2022 మారుతి బెజ్జా గురించి మరిన్ని వివరాలు: ఇక్కడ చూడండి

ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) యొక్క '2022 వితారా బ్రెజ్జా' (2022 Vitara Brezza) ఈ నెల (జూన్) 30 న అధికారికంగా భారతీయ మార్కెట్లో విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయి. కంపెనీ ఈ ఎస్‌యువిని దేశీయ మార్కెట్లో విడుదల చేయకముందే డిజైన్, ఫీచర్స్ మరియు వేరియంట్స్ వంటి సమాహారం విడుదల చేసింది. అయితే ఇప్పుడు తాజాగా సేఫ్టీ ఫీచర్స్ కి సంబంధించిన సమాచారం అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 మారుతి బెజ్జా గురించి మరిన్ని వివరాలు: ఇక్కడ చూడండి

ఇప్పటికే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 మారుతి సుజుకి బ్రెజ్జా ఎల్ఎక్స్ఐ (LXI), విఎక్స్ఐ (VXI), జెడ్ఎక్స్ఐ (ZXI) మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ (ZXI+) అనే నాలుగు వేరియంట్స్ లో తీసుకురానుంది. కంపెనీ ఈ నాలుగు వేరియంట్స్ లోనూ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ అందించనుంది. ప్రతి వేరియంట్‌లో స్టాండర్డ్‌గా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్-హోల్డ్ అసిస్ట్ మరియు రోల్-ఓవర్ మిటిగేషన్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

2022 మారుతి బెజ్జా గురించి మరిన్ని వివరాలు: ఇక్కడ చూడండి

అయితే కంపెనీ యొక్క 2022 మారుతి బ్రెజ్జా యొక్క టాప్-స్పెక్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ ప్లస్ (ZXI+) వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇక జెడ్ఎక్స్ఐ (ZXI) వేరియంట్ లో రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి అందుబాటులో ఉన్నాయి. మిగిలిన రెండు వేరియంట్లు కూడా మరిన్ని లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి. మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ గురించి మరింత సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.

2022 మారుతి బెజ్జా గురించి మరిన్ని వివరాలు: ఇక్కడ చూడండి

ఇదిలా ఉండగా ఈ కొత్త ఎస్‌యువి కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు కంపెనీ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో గాని రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన మొదటి రోజే 4,500 యూనిట్ల బుకింగ్స్ స్వీకరించగలిగింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని శశాంక్ శ్రీవాస్తవ అధికారికంగా ప్రకటించారు.

2022 మారుతి బెజ్జా గురించి మరిన్ని వివరాలు: ఇక్కడ చూడండి

మారుతి సుజుకి తన 2022 బ్రెజ్జా యొక్క ఉత్పత్తిని కూడా ఇప్పటికే ప్రారంభించింది. కావున ఇవి త్వరలోనే డీలర్‌షిప్‌లో దర్శనమిచ్చే అవకాశం ఉంటుంది. కావున ఆసక్తి గల కొనుగోలుదారులు 2022 మారుతి బ్రెజ్జా యొక్క టెస్ట్ డ్రైవ్‌ పొందవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

2022 మారుతి బెజ్జా గురించి మరిన్ని వివరాలు: ఇక్కడ చూడండి

కంపెనీ ఇప్పటికే 2022 బ్రెజ్జా యొక్క కలర్ ఆప్సన్స్ కూడా వెల్లడించింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. కొత్త మారుతి వితారా బ్రెజ్జా 6 మోనోటోన్ కలర్స్ లో మరియు 3 డ్యూయెల్ టోన్ కలర్స్ లో లభిస్తుంది. మోనోటోన్ కలర్ ఆప్సన్స్ లో పెర్ల్ ఆర్కిటిక్ వైట్, ప్రైమ్ స్ప్లెండిడ్ సిల్వర్, మెటాలిక్ మాగ్మా గ్రే, సిజ్లింగ్ రెడ్, ఎక్సుబరెంట్ బ్లూ మరియు పెర్ల్ బ్రేవ్ ఖాకీ వంటివి ఉన్నాయి.

డ్యూయెల్ టోన్ కలర్స్ లో సిజ్లింగ్ రెడ్ & బ్లాక్, వైట్ & ఖాకీ బ్రేవ్ మరియు బ్లాక్ & స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అదే సమయంలో ఆధునిక డిజైన్ మరియు మునుపటి మోడల్ కంటే కూడా అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది ఎలక్ట్రిక్ సన్‌రూఫ్.

2022 మారుతి బెజ్జా గురించి మరిన్ని వివరాలు: ఇక్కడ చూడండి

2022 మారుతి సుజుకి బ్రెజ్జా ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇందులో ట్విన్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు కూడా అందించబడ్డాయి. ముందు భాగంలో సుజుకి యొక్క పెద్ద లోగో ఫ్రంట్ గ్రిల్‌లో ఇవ్వబడింది. కార్ యొక్క టెయిల్ సెక్షన్ యారో డిజైన్‌లో ఫాగ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లను కూడా పొందే అవకాశం ఉంది. వీటితో పాటు కంపెనీ ఇందులో కొత్త 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇవ్వనుంది. ఇవి డ్యూయల్ టోన్ కలర్‌లో ఉన్నాయి.

2022 మారుతి బెజ్జా గురించి మరిన్ని వివరాలు: ఇక్కడ చూడండి

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, 2022 మారుతి బ్రెజ్జా 1.5-లీటర్, కె12సి పెట్రోల్ ఇంజన్‌ తో వస్తుంది. ఈ ఇంజిన్ 101.6 బిహెచ్‌పి పవర్ మరియు 136.8 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు కొత్త 6 స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ పొందుతుంది. కంపెనీ ఇప్పుడు ఈ కొత్త ఎస్‌యువి విడుదల చేసిన తరువాత CNG వెర్షన్ లో కూడా అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది.

2022 మారుతి బెజ్జా గురించి మరిన్ని వివరాలు: ఇక్కడ చూడండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో త్వరలోనే విడుదలకానున్న కొత్త 2022 మారుతి సుజుకి బ్రెజ్జా అద్భుతమైన స్పందన పొందుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ మంచి బుకింగ్స్ కూడా స్వీకరించింది. అయితే కంపెనీ ఈ ఎస్‌యువి యొక్క ధరను అధికారికంగా వెల్లడించలేదు. కానీ కంపెనీ ధరను కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, June 27, 2022, 9:32 [IST]
English summary
2022 maruti suzuki brezza safety features revealed details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+