కొత్త 'విటారా బ్రెజ్జా' లాంచ్ డేట్ వెల్లడించిన మారుతి సుజుకి: వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి' (Maruti Suzuki) దేశీయ విఫణిలో నిరంతరం తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో కొత్త వాహనాలను విడుదల చేయడం మాత్రమే కాకూండా కొన్ని కార్లను అప్డేట్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ తన విటారా బ్రెజ్జా ను కూడా అప్డేట్ చేయడానికి సన్నద్ధమవుతోంది.

ఇప్పటికే కంపెనీ దీని గురించి చాలా సమాచారం వెల్లడించింది. అయితే ఇప్పుడు భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందో వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

కొత్త 'విటారా బ్రెజ్జా' లాంచ్ డేట్ వెల్లడించిన మారుతి సుజుకి: వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (Maruti Suzuki Brezza) 2022 జూన్ 30 న అధికారికంగా భారత మార్కెట్లో విడుదలకానుంది. అయితే విడుదలకు ముందే ఇది చాలా సార్లు టెస్టింగ్ సమయంలో గుర్తించబడింది. కానీ మార్కెట్లో విడుదలకానున్న కొత్త 2022 విటారా బ్రెజ్జా యొక్క ధర మరియు బుకింగ్స్ కి సంబందించిన వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఇటీవల కంపెనీ డీలర్‌షిప్‌లు ఈ కొత్త తరం మారుతి బ్రెజ్జా యొక్క అనధికారిక బుకింగ్‌లను స్వీకరిస్తునట్లు తెలిసింది.

కొత్త 'విటారా బ్రెజ్జా' లాంచ్ డేట్ వెల్లడించిన మారుతి సుజుకి: వివరాలు

త్వరలో విడుదలకానున్న కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది దాని మునుపటి మోడల్ కి చాలా వరకు భిన్నంగా ఉంటుంది. 2022 మారుతి సుజుకి బ్రెజ్జా డ్యూయల్ టోన్ కలర్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఇప్పటికి వెలువడిన ఫోటోల ద్వారా తెలుస్తుంది.

కొత్త 'విటారా బ్రెజ్జా' లాంచ్ డేట్ వెల్లడించిన మారుతి సుజుకి: వివరాలు

2022 మారుతి సుజుకి బ్రెజ్జాలో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ మరియు టెయిల్ సెక్షన్ ఇవ్వబడ్డాయి. మారుతి బ్రెజ్జా యొక్క ప్రస్తుత మోడల్‌లో ముందు భాగంలో క్రోమ్ గ్రిల్ ఉంది, అయితే కొత్త బ్రెజ్జా క్రోమ్ గ్రిల్‌కు బదులుగా గ్రే లేదా బ్లాక్ గ్రిల్‌ను పొందుతుంది. హెడ్‌లైట్ ఇప్పుడు స్లిమ్ డిజైన్‌తో ఫ్రెష్ లుక్ ఇవ్వబడింది. కావున ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త 'విటారా బ్రెజ్జా' లాంచ్ డేట్ వెల్లడించిన మారుతి సుజుకి: వివరాలు

2022 మారుతి సుజుకి బ్రెజ్జా ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇందులో ట్విన్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు కూడా అందించబడ్డాయి. ముందు భాగంలో సుజుకి యొక్క పెద్ద లోగో ఫ్రంట్ గ్రిల్‌లో ఇవ్వబడింది. కార్ యొక్క టెయిల్ సెక్షన్ యారో డిజైన్‌లో ఫాగ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లను కూడా పొందే అవకాశం ఉంది.

కొత్త 'విటారా బ్రెజ్జా' లాంచ్ డేట్ వెల్లడించిన మారుతి సుజుకి: వివరాలు

వీటితో పాటు కంపెనీ ఇందులో కొత్త 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇవ్వనుంది. ఇవి డ్యూయల్ టోన్ కలర్‌లో ఉన్నాయి. అయితే, అల్లాయ్ వీల్స్ టాప్ మోడల్‌లో మాత్రమే కనిపిస్తాయి. మొత్తంమీద, 2022 మారుతి సుజుకి బ్రెజ్జా మునుపటి కంటే బోల్డ్‌గా చాలా ఆకర్షణీయంగా ఉంది.

కొత్త 'విటారా బ్రెజ్జా' లాంచ్ డేట్ వెల్లడించిన మారుతి సుజుకి: వివరాలు

కొత్త 2022 బ్రెజ్జా యొక్క ఇంటీరియర్స్ గురించి ఇంకా అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇందులో లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, 360 డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద 9.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, టెంపరేచర్ కంట్రోల్, ఈబిడితో కూడిన ఏబిఎస్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

కొత్త 'విటారా బ్రెజ్జా' లాంచ్ డేట్ వెల్లడించిన మారుతి సుజుకి: వివరాలు

మారుతి సుజుకి యొక్క 2022 మారుతి సుజుకి బ్రెజ్జా కొత్త సుజుకి ఎర్టిగా లో ఉపయోగించిన అదే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని ఉపయోగించే అవకాశం ఉంది. ఇది 101.6 బిహెచ్‌పి పవర్ మరియు 136.8 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. అయితే 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానాల్లో కొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఉపయోగించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 1, 2022, 8:30 [IST]
English summary
2022 maruti suzuki brezza set to be launched on 30 june details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+