దేశీయ మార్కెట్లో విడుదలైన 2022 మారుతి సుజుకి ఈకో: మంచి ధర &ఎక్కువ మైలేజ్

దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి ఎప్పటికప్పుడు తమ వాహనాలను అప్డేటెడ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు 'మారుతి ఈకో'ని అప్డేటెడ్ వెర్షన్ లో తీసుకువచ్చింది.

మార్కెట్లో విడుదలైన కొత్త '2022 ఈకో' ప్రారంభ ధర రూ. 5.10 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ లేటెస్ట్ వేరియంట్ డిజైన్, ఫీచర్స్ వంటి వాటితో పాటు మైలేజ్ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన 2022 మారుతి సుజుకి ఈకో

2022 మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) 5 సీటర్ మరియు 7 సీటర్ వేరియంట్‌లలో కార్గో, టూర్ మరియు అంబులెన్స్ వెర్షన్‌లలో దాని కమర్షియల్ వెహికల్ వెర్షన్ లో కూడా అందించబడుతుంది. అయితే ఇది ఇప్పుడు మునుపటి కంటే కూడా మంచి మైలేజ్ అందిస్తుంది. అయితే డిజైన్ మరియు ఫీచర్స్ దాదాపు దాని మునుపటి మోడల్ ని పోలి ఉండటం చూడవచ్చు.

మారుతి సుజుకి దాని ఈకో దాని పాత 1.2 లీటర్ G సిరీస్ పవర్‌ప్లాంట్ స్థానంలో 1.2 లీటర్ K సిరీస్ డ్యూయెల్ జెట్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 80 బిహెచ్‌పి పవర్ మరియు 104.4 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్ తో 20.20 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అయితే సిఎన్‌జి వెర్షన్ కేజీ సిఎన్‌జితో 27.05 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన 2022 మారుతి సుజుకి ఈకో

మారుతి సుజుకి ఈకో సిఎన్‌జి వెర్షన్ 71 బిహెచ్‌పి పవర్ మరియు 95 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. 2022 మారుతి ఈకో ఇప్పుడు సాలిడ్ వైట్, పర్ల్ మిడ్‌నైట్ బ్లాక్, మెటాలిక్ సిల్కీ సిల్వర్ మరియు మెటాలిక్ గ్లిస్టెనింగ్ గ్రే కలర్ ఆప్సన్స్ తో పాటు మెటాలిక్ బ్రిస్క్ బ్లూ కలర్ ఆప్షన్‌లో కూడా అందించబడుతుంది

కొత్త 2022 మారుతి సుజుకి ఈకో ఇప్పటికే చెప్పుకున్నట్లు దాదాపు దాని పెట్రోల్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో ఇప్పుడు సరికొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఆధునిక ఇంటీరియర్ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు తప్పకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించే అవకాశం ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన 2022 మారుతి సుజుకి ఈకో

2022 ఈకో భద్రత పరంగా కూడా చాలా వరకు అప్డేట్ చేయబడి ఉంటుంది. కావున ఇందులో ఇప్పుడు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ స్లైడింగ్ డోర్లు, విండోస్ కి చైల్డ్ లాక్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ మరియు ఇల్యూమినేటెడ్ హజార్డ్ స్విచ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇది మునుపటికంటే ఆధునికంగా ఉందనిపిస్తుంది.

కొత్త మారుతి సుజుకి ఈకో భద్రత పరంగా మంచి ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల వాహన వినియోగదారులకు పటిష్టమైన భద్రతను అందిస్తుంది. కాగా ఇప్పటికే మారుతి సుజుకి ఈకో దేశీయ మార్కెట్లో 9.75 లక్షల యూనిట్లకు పైగా విక్రయాలను చేపట్టగలిగింది. అయితే ఇప్పడు ఈ కొత్త ఈకో అప్డేటెడ్ రూపంలో విడుదల కావడం వల్ల అమ్మకాలు ఖచ్చితంగా మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Wednesday, November 23, 2022, 10:17 [IST]
English summary
2022 maruti suzuki eeco launched price specs features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+