సంక్రాంతి కానుకగా Skoda నుంచి కొత్త కార్ విడుదల: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్కోడా (Skoda) కంపెనీ యొక్క 'స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్' (Skoda Kodiaq Facelift) ఎట్టకేలకు అడుగుపెట్టింది. ఈ కొత్త SUV యొక్క ప్రారంభ ధర రూ. 34.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, ఇందులోని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 37.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

ఈ ప్రీమియం SUV కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది, కావున డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఈ కొత్త స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సంక్రాంతి కానుకగా స్కోడా నుంచి కొత్త కార్ విడుదల: ధర & వివరాలు

భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమ బిఎస్ 6 యుగానికి మారుతున్న తరుణంలో కంపెనీ యొక్క డీజిల్ శ్రేణిని నిలిపివేయడానికి స్కోడా కంపెనీ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే స్కోడా 2020 ఏప్రిల్ నెలలో దాని డీజిల్ మోడల్ నిలిపివేసింది. అయితే డీజిల్ ఉత్పత్తి నిలిపివేసిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కోడియాక్ స్కోడా లైనప్‌లో తిరిగి ప్రవేశించింది.

సంక్రాంతి కానుకగా స్కోడా నుంచి కొత్త కార్ విడుదల: ధర & వివరాలు

కొత్త 2022 స్కోడా కొడియాక్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. కొడియాక్ వేరియంట్లు మరియు ధరల విషయానికి వస్తే

 • స్కోడా స్టైల్ (Skoda Style): రూ. 34.99 లక్షలు
 • స్కోడా స్కోడా స్పోర్ట్‌లైన్ (Skoda Sportline): 35.99 లక్షలు
 • స్కోడా లారెన్ & క్లెమెంట్ (Skoda Lauren & Klement): 37.49 లక్షలు
 • సంక్రాంతి కానుకగా స్కోడా నుంచి కొత్త కార్ విడుదల: ధర & వివరాలు

  స్కోడా కంపెనీ యొక్క కొత్త స్కోడా కొడియాక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఇప్పుడు నిటారుగా ఉన్న గ్రిల్, ఎలివేటెడ్ బానెట్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్, రివైజ్ చేయబడిన హెడ్‌లైట్లు మరియు ట్వీక్ చేయబడిన ఫ్రంట్ బంపర్ వంటి వాటిని పొందుతుంది.

  సంక్రాంతి కానుకగా స్కోడా నుంచి కొత్త కార్ విడుదల: ధర & వివరాలు

  అంతే కాకుండా.. ఇందులో కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ కూడా ఉంటుంది. దీనితో పాటు వెనుకవైపు టెయిల్‌లైట్‌లు మరియు బంపర్ కొద్దిగా అప్‌డేట్ చేయబడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ SUV ని చాలా అద్బుతమగా కనిపించే విధంగా చేస్తాయి. అయితే ఈ అప్డేట్స్ కాకుండా మిగిలిన ఎటువంటి మార్పులు చేయలేదని కంపెనీ తెలిపింది.

  సంక్రాంతి కానుకగా స్కోడా నుంచి కొత్త కార్ విడుదల: ధర & వివరాలు

  2022 స్కోడా కొడియాక్ ఇంటీరియర్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని డ్యాష్‌బోర్డ్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను పోలి ఉంటుంది. అంతే కాకూండా స్కోడా యొక్క కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ ఇందులో కూడా ఉంది. ఇందులో మూడు వరుసల సీటింగ్‌ ఆప్సన్ కూడా అందుబాటులో ఉంటుంది.

  సంక్రాంతి కానుకగా స్కోడా నుంచి కొత్త కార్ విడుదల: ధర & వివరాలు

  స్కోడా కొడియాక్ SUV యొక్క టాప్-స్పెక్ ట్రిమ్‌లో అప్‌డేట్ చేయబడిన 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివాటిని పొందుతుంది.

  సంక్రాంతి కానుకగా స్కోడా నుంచి కొత్త కార్ విడుదల: ధర & వివరాలు

  కొత్త కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు వంటి మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.

  సంక్రాంతి కానుకగా స్కోడా నుంచి కొత్త కార్ విడుదల: ధర & వివరాలు

  2022 కోడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ల టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కొత్త SUV యొక్క అన్ని వేరియంట్లు కూడా స్టాండర్డ్‌గా ఆల్-వీల్ డ్రైవ్‌ను పొందుతాయి. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

  సంక్రాంతి కానుకగా స్కోడా నుంచి కొత్త కార్ విడుదల: ధర & వివరాలు

  ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 2022 స్కోడా కొడియాక్ SUV కి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు, కానీ దీని ధర ఆధారంగా ఫేస్‌లిఫ్టెడ్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ మరియు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన కొత్త కారుని కంపెనీ విడుదల చేసింది. అయితే ఈ 2022 కోడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ రానున్న సంక్రాంతి సందర్భంగా ఎటువంటి అమ్మకాలను పొందుతుంది.. మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతుందా అనే మరిన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి. అప్పటి వరకు ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు కార్లను గురించి మరింత సమాచారం కోసం మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
2022 skoda kodiaq launch price rs 34 99 lakh variant features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X