కరీనా కపూర్ మనసుపడిన ఆ కారు ధర ఎంతో తెలుసా.. అయితే ఇది చూడండి
ప్రముఖ బాలీవుడ్ నటి 'కరీనా కపూర్' గురించి కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో చాలామందికి తెలుసు. ఎందుకంటే బాలీవుడ్ చిత్రసీమతో అందరికి సుపరిచితమై టాప్ సెలబ్రెటీల జాబితాలో ఒకరుగా నిలిచారు. అంతే కాకుండా ఈమెకి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ విషయం కరీనా అభిమానులందరికీ తెలిసిన విషయమే. కావున ఈమె గ్యారేజిలో ఇప్పటికే చాలా లగ్జరీ కారు ఉన్నాయి. ఇందులో జర్మనీ బ్రాండ్ 'బెంజ్' కార్లు ఎక్కువగా ఉన్నాయి.
Recommended Video
అయితే ఇటీవల కూడా మరో జర్మన్ కారు మీద మనసుపడింది. ఇంతకీ కరీనా మనసుదోచిన ఆ జర్మన్ లగ్జరీ కారు ఏది, దాని వివరాలు ఏమిటి అనే మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.. రండి.

కరీనా కపూర్ ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ యొక్క 'ఏఎమ్‌జి ఈక్యూఎస్ 53 4మాటిక్+' (AMG EQC 53 4matic+) సెడాన్ లాంచ్ ఈవెంట్ కి హాజరైంది. అయితే సాధారణంగానే లగ్జరీ కార్లంటే ఇష్టమున్న కరీనా మనసు దానిపైన పడింది. ఈ సందర్భంలో ఆమె మనసు ఆ కొత్త కారుని కోరుకుంటుందని, ఆ కారును కొనుగోలు చేయాలనే తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

నిజానికి కరీనా కపూర్ తన జీవితంలో ఎక్కువ భాగం మెర్సిడెస్ బెంజ్ కార్లను ఉపయోగించినట్లు చెప్పుకొచ్చింది. కావున ఇప్పుడు కూడా కంపెనీ లాంచ్ చేసిన కారును ఎప్పటికైనా సొంతం చేసుకుని తన గ్యారేజిలో చేర్చుకుంటానని చెప్పింది. ఈ కొత్త కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది, కావున తప్పకుండా ఇది లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.

ఇక కొత్త మెర్సిడెస్ బెంజ్ యొక్క కొత్త కారు విషయానికి వస్తే, దీని ధర అక్షరాలా రూ. రూ. 2.45 కోట్లు. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన కంపెనీ యొక్క రెండవ ఎలక్ట్రిక్ కారు. కావున ఇది మంచి డిజైన్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఇది భారతీయ మార్కెట్ కి సిబియు మార్గం ద్వారా దిగుమతి అవుతుంది.

కొత్త మెర్సిడెస్ EQS 53 4MATIC+ ఎలక్ట్రిక్ సెడాన్ AMG.EA ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది 107.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 658 బిహెచ్‌పి పవర్ మరియు 950 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది. ఈ సెడాన్ యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిమీ ఉంటుందని కంపెనీ తెలిపింది.

కరీనా కపూర్ మెర్సిడెస్ బెంజ్ యొక్క ఎలక్ట్రిక్ సెడాన్ లాంచ్ సమయంలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఈ ఈవెంట్ లో ఈమె ర్యాంప్ వాక్ చేసి అందరిని అలరించింది. మొత్తం మీద అక్కడ కరీనా షో స్టాపర్‌గా మరియు ఈవెంట్‌లో ప్రారంభ ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కరీనా కాపూర్ కార్ కలెక్షన్:
ఇదిలా ఉండగా కరీనా కపూర్ యొక్క గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ యొక్క ఎస్-క్లాస్ మరియు ఇ-క్లాస్ వంటి వాటితోపాటు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్, ఆడి క్యూ7, బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్, లెక్సస్ ఎల్‌ఎక్స్ 470 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ కార్లను గురించి కూడా కొంత వివరంగా తెలుసుకుందాం..

మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్:
'కరీనా కపూర్' యొక్క గ్యారేజిలోని కార్లలో ఖరీదైన మరియు విలాసవంతమైన జర్మన్ కారు ఈ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ 350 డి వేరియంట్. దీని ధర మార్కెట్లో రూ. 1.42 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. కావున ఇందులో 3.0-లీటర్ వి6 డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 282 బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ 350 డి వేరియంట్ యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో ఇది కేవలం 4.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్:
కరీనా కపూర్ గ్యారేజిలోని జర్మన్ బ్రాడ్ అయిన మెర్సిడెస్ బెంజ్ యొక్క మరొక కారు ఈ 'ఇ-క్లాస్'. ఈ కారులోనే ఎక్కువగా కరీనా కపూర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ కారు ధర దాదాపు రూ. 70 లక్షలు. ఇది 1950 సిసి 4 సిలిండర్ ఇన్‌లైన్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇంజిన్ 192 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 240 కిమీ. కాగా ఇది కేవలం 7.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఆడి క్యూ7:
కరీనా కపూర్ కార్ కలెక్షన్‌లో ఆడి క్యూ7 కూడా ఉంది. భారతీయ మార్కెట్లో ఈ SUV ధర రూ. 80 లక్షలు. ఇది 3.0-లీటర్ వి6 ఇంజిన్ పొందుతుంది. కావున 245 బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 240 కిమీ, కాగా ఇది కేవలం 8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

బిఎండబ్ల్యు 7-సిరీస్:
కరీనా కపూర్ గ్యారేజిలోని మరో జర్మన్ బ్రాండ్ కారు బిఎండబ్ల్యు 7-సిరీస్ యొక్క 750డి వేరియంట్. దీని ధర రూ. 1.37 కోట్లు. అయితే ఇది 2993 సిసి ట్విన్‌పవర్ టర్బో ఇన్‌లైన్ 6 సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. కావున 261.49 బిహెచ్‌పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
బిఎండబ్ల్యు 7-సిరీస్ యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు, కాగా ఇది కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
పాపులర్ నటి అయిన కరీనా కపూర్ గ్యారేజిలో పైన చెప్పిన కార్లు మాత్రమే కాకుండా ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మరియు లెక్సస్ ఎల్‌ఎక్స్ 470 వంటి కారు కూడా ఉన్నాయి. అయితే ఈ గ్యారేజిలో కరీనా కోరుకున్న మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ఎప్పుడు చేరుతుందో తెలియదు. ఇలాంటి మరిన్ని విషయాలతోపాటు కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








