భర్తకు అమెరికన్ బ్రాండ్ కార్ గిఫ్ట్‌గా అందించిన నటి శ్వేతా మీనన్.. ధర ఎంతో తెలుసా?

కార్లు మరియు బైకులు అంటే దాదాపు అందరికి ఇష్టమే, కానీ సెలబ్రెటీలకు ఆ ఇష్టం మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. కావున ఎప్పటికప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో హీరోలుమాత్రమే కాదు, హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే.

అది మాత్రమే కాకుండా.. సెలబ్రెటీలకు బాగా నచ్చిన సన్నిహితులకు కూడా ఖరీదైన కార్లను గిఫ్ట్ ఇచ్చే అలవాటు ఉంటుంది. ఇందులో భార్య తన భర్తకు గానీ, లేదా భర్త తన భార్యకు గాని గిఫ్ట్స్ అందిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ప్రముఖ మలయాళీ నటి 'శ్వేతా మీనన్' తన భర్త 'శ్రీ వత్సవ్ మీనన్' కి 'జీప్ మెరిడియన్' కారుని గిఫ్ట్‌గా అందించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

అమెరికన్ బ్రాండ్ కార్ గిఫ్ట్‌గా అందించిన నటి శ్వేతా మీనన్.. ధర ఎంతో తెలుసా?

నటి 'శ్వేతా మీనన్' తన భర్త పుట్టిన రోజు గిఫ్ట్‌గా ఈ ఖరీదైన అమెరికన్ ఎస్‌యువి జీప్ మెరిడియన్ గిఫ్ట్‌గా అందించడం జరిగింది. ఇది జీప్ కంపెనీ యొక్క టాప్ ఎండ్ వేరియంట్. కావున దీని ధర రూ. 32.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త కారుని శ్వేతా మీనన్ మరియు శ్రీ వత్సవ్ మీనన్ ఇద్దరూ కలిసి కొచ్చిలోని జీప్ కంపెనీ యొక్క డీలర్షిప్ ద్వారా డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అమెరికన్ బ్రాండ్ కార్ గిఫ్ట్‌గా అందించిన నటి శ్వేతా మీనన్.. ధర ఎంతో తెలుసా?

మీరు ఇక్కడ చూసినట్లయితే శ్వేతా మీనన్ కొనుగోలు చేసిన ఈ కొత్త జీప్ మెరిసిన సిగ్నేచర్ కలర్ అయిన వెల్వెట్ రెడ్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. కంపెనీ ఈ ఎస్‌యువిని 2022 మే నెల చివరిలో అధికారికంగా భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త జీప్ మెరిడియన్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ అనే రెండు వెర్షన్లలో మరియు ఐదు వేరియంట్లలో విడుదలైంది. వీటి ప్రారంభ ధర రూ 29.90 లక్షలు (జీప్ మెరిడియన్ లిమిటెడ్ -మ్యాన్యువల్).

అమెరికన్ బ్రాండ్ కార్ గిఫ్ట్‌గా అందించిన నటి శ్వేతా మీనన్.. ధర ఎంతో తెలుసా?

జీప్ మెరిడియన్ పరిమాణం పరంగా పెద్దదిగా ఉంటుంది. దీని కొలతల విషయానికి వస్తే, ఇది 4,769 మిమీ పొడవు, 1,859 మిమీ వెడల్పు, 1,682 మిమీ ఎత్తు మరియు 2,636 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో మంచి బూట్ స్పేస్ కూడా లభిస్తుంది.

అమెరికన్ బ్రాండ్ కార్ గిఫ్ట్‌గా అందించిన నటి శ్వేతా మీనన్.. ధర ఎంతో తెలుసా?

జీప్ మెరిడియన్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. దీని ముందు భాగంలో 7-స్లాట్ గ్రిల్‌, దానికు ఇరువైపులా ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ బంపర్‌లో క్రోమ్ మరియు పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌ వంటివి చూడవచ్చు. అంతే కాకుండా సైడ్ ప్రొఫైల్ లో 18 ఇంచ్ అల్లాయ్ అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. ఇక వెనుక భాగంలో రియర్ బంపర్, ఎల్ఈడి టెయిల్‌లైట్‌లు ఉండటం వల్ల ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

అమెరికన్ బ్రాండ్ కార్ గిఫ్ట్‌గా అందించిన నటి శ్వేతా మీనన్.. ధర ఎంతో తెలుసా?

కొత్త జీప్ మెరిడియన్ యొక్క ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. అదే సమయంలో ఇందులో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇది ఆల్పైన్ ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది.

అమెరికన్ బ్రాండ్ కార్ గిఫ్ట్‌గా అందించిన నటి శ్వేతా మీనన్.. ధర ఎంతో తెలుసా?

జీప్ మెరిడియన్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 168 బిహెచ్‌పి పవర్ మరియు 1,750 ఆర్‌పిఎమ్ నుంచి 2,500 ఆర్‌పిఎమ్ మధ్య 350 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మెరిడియన్ ఒక లీటరుకు 16.2 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ద్వారా ధృవీకరించబడింది.

కొత్త మెరిడియన్ లో ఎయిర్ బ్యాగులు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబిడి మరియు 360 డిగ్రీ కెమెరా వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

అమెరికన్ బ్రాండ్ కార్ గిఫ్ట్‌గా అందించిన నటి శ్వేతా మీనన్.. ధర ఎంతో తెలుసా?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

'శ్వేతా మీనన్' మలయాళీ సినీరంగంలో తన ప్రయాణం ప్రారంభించినప్పటికీ.. తెలుగులో కూడా దేశద్రోహులు, జూనియర్స్ మరియు రాజన్న వంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంది. అయితే ఇప్పుడు ఈమె తన భర్తకు గిఫ్ట్ గా అందించిన జీప్ కంపెనీ యొక్క మెరిడియన్ ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యువిగా నిలిచింది. ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 28, 2022, 8:00 [IST]
English summary
Actress swetha menon gifts new jeep meridian suv for her husband
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+