కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న అలనాటి అందాల తార 'వహీదా రెహ్మాన్': ధర ఎంతో తెలుసా?

'ఏరువాక సాగారోరన్నొ చిన్నన్న' అంటూ తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన అలనాటి అందాల తార 'వహీదా రెహ్మాన్' (Waheeda Rehman) గురించి చాలామందికి తెలుసు. ఒకప్పుడే తెలుగు చలన చిత్ర సీమలో తనదైన ముద్ర వేసుకున్న వహీదా రెహ్మాన్ ఇటీవల ఒక లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న అలనాటి అందాల తార 'వహీదా రెహ్మాన్': ధర ఎంతో తెలుసా?

నటి వహీదా రెహ్మాన్ కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కారు బిఎండబ్ల్యు బ్రాండ్ కి చెందిన 5-సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌ సెడాన్. ఇది '530ఐ ఎమ్ స్పోర్ట్ వేరియంట్'. దీని ధర అక్షరాలా రూ. 64.50 లక్షలు. ఈ సెడాన్ భారతీయ మార్కెట్లో గత సంవత్సరంలో విడుదలైంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా అద్భుతమైన పనితీరుని కూడా అందిస్తుంది.

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న అలనాటి అందాల తార 'వహీదా రెహ్మాన్': ధర ఎంతో తెలుసా?

బిఎమ్ డబ్ల్యూ 5 సిరీస్ లో మరో రెండు వేరియంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అవి ఒకటి 520డి లగ్జరీ లైన్ వేరియంట్ కాగా, మరొకటి 530డి ఎమ్ స్పోర్ట్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 65.90 లక్షలు (520డి లగ్జరీ లైన్) మరియు రూ. 65.90 లక్షలు (530డి ఎమ్ స్పోర్ట్).

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న అలనాటి అందాల తార 'వహీదా రెహ్మాన్': ధర ఎంతో తెలుసా?

బిఎండబ్ల్యు 5 సిరీస్ సెడాన్ లు వివిధ కలర్ ఆప్సన్స్ లో కూడా అందుబాటులో ఉంటాయి. బీఎండబ్ల్యూ 5 సిరీస్ లోని ప్రతి వేరియంట్ కూడా విభిన్న ఇంజిన్ ని పొందుతుంది. ఇందులోని 530ఐ వేరియంట్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 252 పిఎస్ పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ వేరియంట్ యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు.

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న అలనాటి అందాల తార 'వహీదా రెహ్మాన్': ధర ఎంతో తెలుసా?

ఇక ఇందులోని 520డి వేరియంట్ విషయానికి వస్తే, ఇది ఫోర్ సిలిండర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 235 కిలోమీటర్లు. అదే సమయంలో ఇది కేవలం 7.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న అలనాటి అందాల తార 'వహీదా రెహ్మాన్': ధర ఎంతో తెలుసా?

బీఎండబ్ల్యూ 5 సిరీస్ లోని టాప్ ఎండ్ వేరియంట్ 530డి విషయానికి వస్తే, ఇది సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. 265 పిఎస్ పవర్ మరియు 620 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. పైన తెలిపిన మూడు వేరియంట్లలోని మూడు ఇంజిన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కు జతచేయబడి ఉంటాయి. మంచి పనితీరుని అందిస్తాయి.

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న అలనాటి అందాల తార 'వహీదా రెహ్మాన్': ధర ఎంతో తెలుసా?

ఇప్పుడు వహీదా రెహ్మాన్ కొనుగోలు చేసిన సెడాన్ విషయానికి వస్తే, ఇది ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, కిడ్నీ షేప్ గ్రిల్స్, సైడ్ ఫెండర్స్ పై ఎమ్ బ్యాడ్జస్, 18-ఇంచెస్ అలాయ్ వీల్స్, ఎమ్ బ్యాడ్జింగ్ తో స్కఫ్ ప్లేట్స్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న అలనాటి అందాల తార 'వహీదా రెహ్మాన్': ధర ఎంతో తెలుసా?

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది బిఎండబ్ల్యు నావిగేషన్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా ఇందులో 360 డిగ్రీ కెమెరా, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ సీట్ వంటివి ఇందులో అందుబాటులో ఉన్నాయి.

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న అలనాటి అందాల తార 'వహీదా రెహ్మాన్': ధర ఎంతో తెలుసా?

బిఎండబ్ల్యు 5 సిరీస్ సెడాన్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఇకపోతే ఇది భారతీయ మార్కెట్లో ఆడి ఎ6, జాగ్వార్ ఎక్స్ఎఫ్, వోల్వో ఎస్ 90, మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ వంటి మిడ్-సైజ్ లగ్జరీ సెడాన్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మరియు కొత్త బైకులు & కార్లను గురించి ఎప్పటికప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 14, 2022, 15:29 [IST]
English summary
Actress waheeda rahman buys new bmw 5 series details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+