బ్రేకింగ్ న్యూస్..: భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ విడుదల ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

మారుతి సుజుకి ఇప్పుడు చిన్న కార్ల తయారీపై శ్రద్ధ తగ్గించి, ఎస్‌యూవీల తయారీపై ఎక్కువ దృష్టి పెట్టిందా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననిపిస్తున్నాయి. ఇటీవలే బ్రెజ్జా ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేసిన మారుతి సుజుకి, ఇప్పుడు కొత్తగా మరో పెద్ద ఎస్‌యూవీని గ్రాండ్ విటారా పేరుతో విడుదల చేసేందుకు సిద్ధమైంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, విటారా గ్రాండ్ తర్వాత కంపెనీ తమ ఆఫ్-రోడ్ / ఆన్-రోడ్ ఎస్‌యూవీ అయిన మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) ని విడుదల చేయనుంది.

బ్రేకింగ్ న్యూస్..: భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ విడుదల ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

గత కొంత కాలంగా మారుతి సుజుకి భారతదేశంలోనే జిమ్నీ ఎస్‌యూవీని తయారు చేస్తోంది. ఇక్కడ తయారైన జిమ్నీ ఎస్‌యూవీని మారుతి సుజుకి విదేశీ మార్కెట్లలో విక్రయిస్తోంది. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు ఇది భారతదేశంలో కూడా విడుదల కానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో మారుతి సుజుకి ఈ కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేస్తుందని సమాచారం. అయితే, ఈ మోడల్ యొక్క వేరియంట్లు మరియు ధరలు ఇంకా ధృవీకరించబడలేదు. త్వరలోనే కంపెనీ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

బ్రేకింగ్ న్యూస్..: భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ విడుదల ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

మారుతి సుజుకి ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో చాలా మంది కోరుకునే కార్లు కొన్ని ఉన్నాయి. వాటిలో జెన్, ఎస్టీమ్, బాలెనో సెడాన్, జిప్సీ, గ్రాండ్ విటారా ఎక్స్ఎల్7, మరియు ఎస్-క్రాస్ 1.6 వంటివి కొన్ని. వీటితో పాటుగా బాలెనో హ్యాచ్‌బ్యాక్ యొక్క పెర్ఫార్మెన్స్ వెర్షన్ అయిన RS వేరియంట్ కూడా కొంత మంది ఎక్కువగా కోరుకుంటున్న మోడల్ అని చెప్పొచ్చు. ఈ జాబితాలో మారుతి సుజుకి జిమ్నీ కూడా కూడా ఉంది. ఒకప్పటి జిప్సీ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ వచ్చిన మోడల్ ఇది.

బ్రేకింగ్ న్యూస్..: భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ విడుదల ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

మారుతి సుజుకి జిమ్నీ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ఆదరణ పొందింది. అక్కడి మార్కెట్లలో ఇది 3-డోర్ మరియు 4-సీటర్ ఆఫ్-రోడర్ / సిటీ డ్రైవ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా అందుబాటులో ఉంది. మారుతి సుజుకి ఇప్పటికే భారతదేశంలో సుజుకి జిమ్నీ యొక్క 3-డోర్ వెర్షన్‌ను తయారు చేస్తోంది. కాబట్టి, ఈ కంపెనీ జిమ్నీ యొక్క 3-డోర్ వేరియంట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి ఎంచుకుంటే చాలా బాగుంటుంది. అంతే కాకుండా దేశంలోని ఎంతో మంది ఔత్సాహికులను కూడా ఇది ఇట్టే ఆకర్షిస్తుంది.

బ్రేకింగ్ న్యూస్..: భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ విడుదల ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

ఇప్పటికే, కొత్త తరం మహీంద్రా థార్ మరియు కొత్తగా వచ్చిన ఫోర్స్ గుర్ఖా వంటి ఎస్‌యూవీలు కూడా ఇదే తరహా బాడీ స్టైల్‌తో మంచి ఆదరణ పొందాయి. కాబట్టి, మారుతి సుజుకి జిమ్నీ యొక్క 3-డోర్ వెర్షన్ కూడా దాని అధిక వాంఛనీయత కారణంగా ప్రారంభ నెలల్లో మంచి విక్రయ గణాంకాలను సాధిస్తుందని భావిస్తున్నారు. అయితే, సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ మరింత అదనపు ప్రాక్టికాలిటీని కలిగి ఉంటుంది కాబట్టి, కంపెనీ వీలైనంత వరకూ ఈ ఐదు డోర్ల జిమ్నీ ఎస్‌యూవీనే భారతదేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

బ్రేకింగ్ న్యూస్..: భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ విడుదల ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

వాస్తవానికి, మారుతి సుజుకి ఇప్పటికే తమ ఐదు డోర్ల జిమ్నీ ఎస్‌యూవీ భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఇటీవల ఈ మోడల్ టెస్టింగ్ లో కెమెరాకు చిక్కింది. ఒకవేళ, మారుతి సుజుకి ఈ 3-డోర్ వెర్షన్ జిమ్నీ ఎస్‌యూవీని రూ. 8.5 లక్షల నుండి రూ. 11 లక్షల మధ్యలో విడుదల చేసినట్లయితే, ఇది ఖచ్చితంగా విజయవంతమవుతుందని భావిస్తున్నారు. అలాగే, 5-డోర్ వెర్షన్ మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 9.5 లక్షల నుండి రూ. 13 లక్షల మధ్యలో ఉన్నట్లయితే, ఈ పోటీ ప్రపంచంలో ఇవి రెండూ ఖచ్చితంగా మంచి ఆదరణను పొందే అవకాశం ఉంది.

బ్రేకింగ్ న్యూస్..: భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ విడుదల ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

మారుతి సుజుకి జిమ్నీ చాలా మినిమలిస్టిక్ డిజైన్ తో ఓల్డ్ స్కూల్ వాహనంలా కనిపిస్తుంది. అలాగే, ఇది పాత కాలపు లాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌ పై తయారవుతోంది. అయినప్పటికీ, ఇది ఈ ఎస్‌యూవీకి మరింత కఠినమైన క్యారెక్టర్ ను అందించడంలో సహకరిస్తుంది. దీని రగ్గడ్ డిజైన్ మరియు హ్యాండ్లింగ్ కారణంగా జిమ్నీ రైడ్ క్వాలిటీ మరియు మెయింటినెన్స్ స్వల్పంగా దెబ్బతింటాయని భావిస్తున్నారు. అయితే, ఈ లాడర్ ఫ్రేమ్ చాస్సిస్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ను సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ఇది ఆఫ్-రోడ్ భూభాగాలపై అద్భుతమైన పనితీరును చూపే అవకాశం ఉంది.

బ్రేకింగ్ న్యూస్..: భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ విడుదల ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

ఈ 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్ విషయానికి వస్తే, మారుతి సుజుకి జిమ్నీ ఎస్‌యూవీలో దాని జపాన్ అనుబంధ సంస్థ సుజుకి యొక్క ALLGRIP ప్రో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ స్టాండర్డ్‌గా ఉపయోగిస్తున్నారు. ఈ సిస్టమ్ మూడు మోడ్‌లతో వస్తుంది. ఇందులో 2H, 4H మరియు 4L ఉన్నా. ఈ సిస్టమ్ లోని 2H మోడ్ ఇంజన్ నుండి వచ్చే మొత్తం శక్తిని వెనుక చక్రాలకు పంపుతుంది మరియు ఈ మోడ్ రోజువారీ డ్రైవింగ్ కోసం ఉపయోగించబడుతుంది. అంతేకాకుండా, ఇది మెరుగైన మైలేజీని కూడా అందిస్తుంది.

బ్రేకింగ్ న్యూస్..: భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ విడుదల ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

ఇకపోతే, ఇందులోని 4H మోడ్ అదనపు ట్రాక్షన్ అవసరమయ్యే ఆఫ్-రోడ్ పరిస్థితుల కోసం రూపొందించబడింది. కాగా, 4L మోడ్ తీవ్రమైన ఆఫ్-రోడ్ పరిస్థితుల కోసం ఉపయోగించబడుతుంది, ఎందుకంటే ఈ మోడ్ తక్కువ రేషియో గేర్‌బాక్స్‌ని ఉపయోగించి అన్ని చక్రాలకు పంపే టార్క్‌ను గుణిస్తుంది. ఇక ఇందులో ఉపయోగించబోయే ఇంజన్ విషయానికి వస్తే, మారుతి సుజుకి జిమ్నీలో కంపెనీ ఇటీవలే విడుదల చేసిన 2022 ఎర్టిగా, 2022 XL6 మరియు 2022 విటారా బ్రెజ్జాలలో ఉపయోగించిన అదే K15C 1.5-లీటర్ న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా.

బ్రేకింగ్ న్యూస్..: భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ విడుదల ఖరారు.. లాంచ్ ఎప్పుడంటే..?

ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పిల శక్తిని మరియు 136.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కొత్త ఇంజన్ ఇప్పుడు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో పాటుగా మరింత అధునాతనమైన 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో అందుబాటులో ఉంటుంది. కాబట్టి, మారుతి సుజుకి భారతదేశంలో జిమ్నీ ఎస్‌యూవీని లాంచ్ చేస్తే, ఇది మార్కెట్లో ఒక ప్రత్యేకమైన మోడల్ గా నిలుస్తుంది మరియు దేశంలోని అనేక అడ్వెంచర్ రైడ్ ప్రియులను ఖచ్చితంగా కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుంది.

Article Published On: Tuesday, July 12, 2022, 12:14 [IST]
English summary
After grand vitara maruti suzuki to launch jimny suv in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+