సరికొత్త 2022 హోండా హెచ్ఆర్-వి (Honda HR-V) టీజర్ ఆవిష్కరణ; త్వరలో విడుదల!
జపనీస్ కార్ బ్రాండ్ హోండా తయారు చేస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ హెచ్ఆర్-విలో కంపెనీ ఓ కొత్త 2022 మోడల్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో, హోండా తమ కొత్త ఎస్‌యూవీ (2022 Honda HR-V) టీజర్‌ను కూడా విడుదల చేసింది. హోండా హెచ్ఆర్-వి 2022 మోడల్‌ని కంపెనీ ఏప్రిల్ 4న ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించనుంది, ఆ తర్వాత న్యూయార్క్ ఆటో షో 2022లో దీనిని గ్లోబల్ మార్కెట్ల కోసం విడుదల చేయనుంది.

హోండా హెచ్ఆర్-వి ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి సక్సెస్‌ఫుల్ మోడల్‌గా మరియు ఖరీదైన హోండా సిఆర్-వి ఎస్‌యూవీకి ప్రత్యామ్నాయంగా ఉంది. హోండా సిఆర్-వి మాదిరిగానే హెచ్ఆర్-వి కూడా ఓ 5-సీటర్ ఎస్‌యూవీ. ఈ రెండు మోడళ్లలో ప్రధానమైన తేడా ఎక్కడ అంటే, వాటి ఇంజన్ మరియు స్పేస్ విషయంలో ఉంటుంది. తాజాగా హోండా విడుదల చేసిన కొత్త 2022 హెచ్ఆర్-వి టీజర్ లో కంపెనీ దాని వెనుక ఎల్ఈడి స్ప్లిట్ టెయిల్ ల్యాంప్ మరియు HR-V బ్యాడ్జింగ్‌ను హైలైట్ చేసింది.

ఈ టీజర్ చిత్రం మినహా రాబోయే క్రాస్ఓవర్ ఎస్‌యూవీ గురించి హోండా ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే, కంపెనీ ఈ SUV యొక్క స్కెచ్‌ను గడచిన జనవరి 2022 లోనే విడుదల చేసింది. ఈ అఫీషియల్ స్కెచ్ ద్వారా హోండా ఈ చిన్న ఎస్‌యూవీలో చేయబోయే మార్పులను మరియు డిజైన్ వివరాలను వెల్లడి చేసింది. ఈ డిజైన్ స్కెచ్ ప్రకారం, హోండా హెచ్ఆర్-వి కొత్త ఫ్రంట్ గ్రిల్‌ను పొందింది, ఇది మునుపటి గ్రిల్ తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

అంతేకాకుండా, ఈ కారుకు మెష్ డిజైన్ గ్రిల్ ఉన్న పెద్ద ఎయిర్‌డ్యామ్ కూడా ఇవ్వబడింది. ఇంకా ఇందులో L ఆకారంలో ఉండే సొగసైన హెడ్‌ల్యాంప్‌లు మరియు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు వాటి పక్కనే అమర్చిన ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు ఉంటాయి. మొత్తమ్మీద ఒకే హెడ్‌ల్యాంప్ క్లస్టర్ లో ఈ మూడు రకాల లైట్లు కూడా అమర్చబడి ఉంటాయి. ఇక సైడ్ మిర్రర్స్‌ను చూస్తే, ఇవి సగం బాడీ కలర్ మరియు సగం బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

సైడ్స్ లో కొత్త డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు వెనుక వైపు రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్ కూడా ఉన్నాయి. ఈ క్రాస్‌ఓవర్ ఎస్‌యూవీ వెనుక భాగంలో వెడల్పాటి వ్రాప్‌అరౌండ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లు అమర్చబడ్డాయి. ఇవి సగం బాడీపై మరియు సగం బూట్ డోరుపై అమర్చబడిన స్ప్లిట్ యూనిట్ రూపంలో ఉంటాయి. ఈ కారుకి మరింత స్పోర్టీ అండ్ రగ్గడ్ లుక్ ని ఇచ్చేందుకు కంపెనీ ఈ ఎస్‌యూవీ చుట్టూ భారీ బ్లాక్ క్లాడింగ్‌ను కూడా ఉపయోగించే అవకాశం ఉంది.

మొత్తమ్మీద కంపెనీ ఈ చిన్న ఎస్‌యూవీకి వెనుక భాగంలో వాలుగా డిజైన్ చో కూపే లాంట్ బాడీ లుక్ ని అందించనుంది. ఇవీ హోండా హెచ్ఆర్-వి కి సంబంధించిన ఎక్స్టీరియర్ డిజైన్ ఎలిమెంట్స్. అయితే, ప్రస్తుతానికి ఈ ఎస్‌యూవీ లోపలి భాగంలో చేయబోయే ఇంటీరియర్ మార్పుల గురించి ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. ప్రస్తుత, మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా మరియు కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా కంపెనీ దీని ఇంటిరీయర్లను అత్యాధునికంగా మరియు టెక్ లోడెడ్ ఫీచర్లతో అందించే అవకాశం ఉంది.

అలాగే, హోండా హెచ్ఆర్-వి ఎస్‌యూవీకి సంబంధించిన సాంకేతిక వివరాలు కూడా ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఎస్‌యూవీ విడుదల సమయంలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, ఈ క్రాస్ఓవర్ ఎస్‌యూవీలో, కంపెనీ ప్రస్తుతం అమెరికన్ మార్కెట్లలో విక్రయిస్తున్న హోండా సివిక్ సెడాన్ లో ఉపయోగించిన అదే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి, హోండా ఈ కొత్త 2022 మోడల్ హెచ్ఆర్-వి ఎస్‌యూవీని గ్లోబల్ మార్కెట్ల కోసం మాత్రమే సిద్ధం చేస్తోంది.

మరి ఈ చిన్న ఎస్‌యూవీ భారత్‌కు వస్తుందా అంటే, ప్రస్తుతం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదనే చెప్పాలి. ఎందుకంటే, హోండా భారతదేశంలో ఎస్‌యూవీల విక్రయాన్ని పూర్తిగా నిలిపివేసింది. గతేడాది హోండా భారత మార్కెట్లో తమ సిఆర్-వి అమ్మకాలను కూడా నిలిపివేసింది. ఇప్పుడు ఈ మోడల్ నుండి లభిస్తున్న ఏకైక యుటిలిటీ వాహనంగా హోండా డబ్ల్యూఆర్-వి (Honda WR-V) ఉంది. అయితే, భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా హోండా తమ 2022 HR-Vని భారతదేశానికి తీసుకురావడాన్ని కంపెనీ పరిగణించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications