కొత్త 2022 Skoda Fabia Monte Carlo ఆవిష్కరణ.. ఈసారైనా భారత్‌కు వచ్చే ఛాన్స్ ఉందా..?
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో (Skoda Auto) ఒకప్పుడు భారత మార్కెట్లో మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కు పోటీగా విక్రయించిన ఫ్యాబియా (Skoda Fabia) గుర్తుందా..? అధిక ఉత్పత్తి వ్యయం, తక్కువ అమ్మకాలు వంటి అనేక కారణాల వలన కంపెనీ ఈ మోడల్ ను భారత మార్కట్ నుండి తొలగించింది. వాస్తవానికి, స్కోడా ఫ్యాబియా భారత మార్కెట్లో అమ్మకానికి లేనప్పటికీ, ఈ మోడల్ ఇప్పటికీ పలు అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడుతోంది. తాజాగా, కంపెనీ ఇందులో ఓ కొత్త 2022 స్కోడా ఫ్యాబియా మాంట్ కార్లో (2022 Skoda Fabia Monte Carlo) ఎడిషన్ ను ఆవిష్కరించింది.

గ్లోబల్ మార్కెట్లలో స్కోడ్ బ్రాండ్ కొనుగోలుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాబియా మాంట్ కార్లో ఎడిషన్ ను ఎట్టకేలకు అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ దీనిని స్కోడా ఫాబియా యొక్క నాల్గవ తరం మోడల్ ఆధారంగా చేసుకొని రూపొందించబడింది మరియు ఇది మునుపటి తరం మోడల్ కంటే పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. కొత్త Skoda Fabia Monte Carlo స్పోర్టియర్ ఎక్ట్సీరియర్ మరియు స్పోర్ట్స్ బ్లాక్ ఎలిమెంట్స్‌తో వస్తుంది. స్టాండర్డ్ ఫ్యాబియాతో పోల్చుకుంటే, స్కోడా ఫాబియా మోట్ కార్లోలో కొత్త బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ ఆప్రాన్, వింగ్ మిర్రర్స్ మరియు డిఫ్యూజర్ వంటి మార్పులు ఉన్నాయి.

ఈ మార్పులు మాత్రమే కాకుండా, Skoda Fabia Monte Carlo లో కొత్త 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, లేతరంగు గల రియర్ అండ్ సైడ్ విండోస్ మరియు ఐచ్ఛిక బ్లాక్ రూఫ్‌ను కూడా ఉంటుంది. కొత్త స్కోడా ఫ్యాబియా మాంట్ కార్లో లోపలి భాగంలో, స్కోడా బ్లాక్ థీమ్‌ని ఉపయోగించడాన్ని కొనసాగించింది మరియు స్పోర్టియర్ అనుభూతి కోసం డాష్‌బోర్డ్ దిగువ భాగంలో కార్బన్-ఫైబర్ ఫినిషింగ్ ను కలిగి ఉంటుంది.

వీటితో పాటుగా, స్కోడా ఫాబియా మాంట్ కార్లో కారులో ఎత్తు సర్దుబాటు చేయగల స్పోర్ట్స్ సీట్లను కూడా ఉపయోగించారు మరియు డోర్ హ్యాండిల్స్, రూఫ్ లైనింగ్ మరియు రూఫ్ పిల్లర్‌లపై రెడ్ కలర్ యాక్సెంట్‌లను ఉపయోగించారు. స్కోడా పేర్కొన్న సమాచారం ప్రకారం, స్కోడా ఫ్యాబియా మాంట్ కార్లో ఎడిషన్ లో 79 bhp నుండి 148 bhp వరకు పవర్‌ను జనరేట్ చేసే నాలుగు విభిన్న ఇంజన్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు తమ అవసరాన్ని బట్టి, వీటిని ఎంచుకోవచ్చు.

ఇందులో ఫోర్-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది, ఈ యూనిట్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ కారణంగా స్కోడా ఫాబియా మాంట్ కార్లో ఎడిషన్ కేవలం కేవలం 8 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 225 కిమీల వేగంతో పరుగులు తీస్తుంది. నాల్గవ తరం స్కోడా ఫాబియా విషయానికి వస్తే, ఈ మోడల్ ఇంకా భారత తీరాలకు చేరుకోలేదు మరియు ఇది భారతదేశంలో 4,107 మిమీ పొడవుతో విక్రయించే ఇతర ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ల కంటే చాలా పెద్దదిగా ఉంటుంది.

ఈ కారు నాలుగు మీటర్ల కన్నా అధిక పొడవు కలిగి ఉన్న కారణంగా, కొత్త స్కోడా ఫాబియా భారతదేశంలో అధిక పన్ను శ్లాబు కలిగిన కార్ల పరిధిలోకి వస్తుంది కాబట్టి, ఈ స్కోడా ఈ కారును ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పైగా, కొత్త స్కోడా ఫాబియా యొక్క వీల్‌బేస్ మునుపటి తరం స్కోడా ఆక్టావియా యొక్క 2564 మిమీ కంటే కేవలం 14 మిమీ మాత్రమే తక్కువగా ఉంటుంది. ఈ లాంగ్-వీల్‌బేస్ సెటప్ కారణంగా కొత్త తరం ఫ్యాబియాలో విశాలమైన ఇంటీరియర్ మరియు దాదాపు 380-లీటర్ల వద్ద సెడాన్ లాంటి బూట్ స్పేస్ లభిస్తుంది.

నాల్గవ తరం స్కోడా ఫాబియా కారులో లభించే ప్రధానమైన ఫీచర్లను గమనిస్తే, ఇందులో పెద్ద 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ మరియు Apple CarPlay మరియు Android Auto కనెక్టివిటీతో కూడిన 9.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే వంటి ప్రీమియం ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ ఉంటుంది. ఇంకా ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, హీటెడ్ విండ్‌షీల్డ్, హీటెడ్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, గెస్చర్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్ మరియు మరెన్నో సరికొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొన్ని దేశాల్లో, కొత్త స్కోడా ఫాబియా లెవల్ 2 అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్ ఫీచర్లతో కూడా అందుబాటులో ఉంది. ఇందులో లేన్ ట్రాకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్ మరియు ఎమర్జెన్సీ బ్రేకింగ్ అసిస్టెన్స్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. నాల్గవ తరం స్కోడా ఫాబియా ప్రపంచంలోని అత్యుత్తమ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ లో కొత్తగా వచ్చిన మాంట్ కార్లో ఎడిషన్ ఫాబియా యొక్క స్పోర్టీనెస్ ను మరింతగా పెంచుతుంది. స్కోడా కనీసం ఈ కారుని లిమిటెడ్ ఎడిషన్ గా నైనా ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications








