కొత్త తరం 2023 టొయోటా ఇన్నోవా హైక్రాస్ విడుదలకు ప్లాన్స్.. హైబ్రిడ్ ఇంజన్, ADAS ఫీచర్లతో..
జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా (Toyota) భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఇన్నోవా క్రిస్టా డీజిల్ వేరియంట్ల కోసం బుకింగ్‌లను స్వీకరించడాన్ని కంపెనీ ఇటీవల నిలిపివేసిన సంగతి తెలిసినదే. డీజిల్ వేరియంట్ల కోసం ఉన్న అధిక డిమాండ్ కారణంగా బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్పష్టం చేస్తూ కంపెనీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Recommended Video
అయితే, టొయోటా ఇన్నోవా క్రిస్టాలోని డీజిల్ ఇంజన్ దేశంలో ఉద్గార పరీక్షలో విఫలమైందని, అందుకో ఈ ఎమ్‌పివి తాత్కాలికంగా నిలిపివేయబడిందని పేర్కొంటూ కొత్త నివేదికలు వెలువడ్డాయి. కాగా, టొయోటా ఇప్పుడు తమ ఇన్నోవా క్రిస్టా అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా, ఇందులో కొత్త లిమిటెడ్ ఎడిషన్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ టొయోటా ఇన్నోవా క్రిస్టాను స్టాండర్డ్ పెట్రోల్ మోడల్ యొక్క GX వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది.

కొత్త లిమిటెడ్ ఎడిషన్ టొయటా ఇన్నోవా క్రిస్టా స్టాండర్డ్ మోడల్ కన్నా ఎక్కువ యాక్సెసరీలను పొందుతుంది. ఈ కొత్త ఫీచర్లలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు హెడ్స్-అప్ డిస్‌ప్లేలు ఉన్నాయి. డీలర్ల ప్రకారం, ఈ అదనపు ఫీచర్లను కస్టమర్లు విడిగా కొనుగోలు చేయాలంటే, సుమారు రూ. 55,000 వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇవి జిఎక్స్ వేరియంట్ ధరకే ఈ అదనపు ఫీచర్లు లభించనున్నట్లు సమాచారం.

అయితే, కేవలం పెట్రోల్ మోడల్ ఇన్నోవాతో మాత్రమే అమ్మకాలను సాధించడం సాధ్యం కాదు. ఎందుకంటే, అధిక మైలేజీని ఇచ్చే డీజిల్ వేరియంట్ ఇన్నోవానే ఎక్కువ మంది కస్టమర్లు కోరుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో టొయోటా ఇప్పుడు కొత్తగా హైబ్రిడ్ మంత్రాన్ని ఉపయోగించనుంది. టొయోటా ఇటీవల విడుదల చేసిన మిడ్-సైజ్ ఎస్‌యువీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మాదిరిగానే, టొయోటా ఇన్నోవా క్రిస్టాలో కూడా హైక్రాస్ పేరిట ఓ హైబ్రిడ వెర్షన్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇంధన ధరకు మరియు మైలేజీకి ప్రాధాన్యతనిచ్చే భారత మార్కెట్లో, టొయోటా డీజిల్ కస్టమర్లను హైబ్రిడ్ కస్టమర్లుగా మార్చుకునేందుకు టొయోటా కొత్త ప్లాన్ చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, టొయోటా తమ నాల్గవ తరం ఇన్నోవాను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది, దీనిని "ఇన్నోవా హైక్రాస్" (INNOVA HYCROSS) అని పిలుస్తారు మరియు ఈ లేటెస్ట్ మోడల్ జనవరిలో జరగబోయే ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించబడుతుందని సమాచారం.

అంతేకాకుండా, రాబోయే కొత్త 2023 టొయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌యూవీని కంపెనీ ఇకపై ట్రక్ లాంటి బాడీ-ఆన్-లాడర్ ఫ్రేమ్‌పై కాకుండా, కొత్త TNGA-C ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారు చేయనుంది. ఇది మోనోకోక్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించుకుంటుంది మరియు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ పై తయారు కాబోయే కొత్త టొయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌యూవీ ప్రస్తుత ఇన్నోవా క్రిస్టా కంటే పెద్దది మరియు తేలికైనదిగా ఉంటుంది.

అంతేకాకుండా, రాబోయే టొయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌యూవీ ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లను కూడా కలిగి ఉండనుంది. ఈ అడాస్ ఫీచర్లలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అనేక అధునాతన కంఫర్ట్ మరియు సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నాయి. పవర్‌ట్రెయిన్ పరంగా, కొత్త 2023 టొయోటా ఇన్నోవా హైక్రాస్ భారతదేశంలో పెట్రోల్ మరియు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో విక్రయించబడే అవకాశం ఉంది.

ఈ కొత్త మోడల్ ఇన్నోవాలో ఉపయోగించబోయే స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇది తమ పాపులర్ ప్రీమియం సెడాన్ టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ మోడల్ లో ఉపయోగిస్తున్నన అదే 2.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ హైబ్రిడ్ ఇంజన్ గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం, మార్కెట్లో విక్రయంచబడుతున్న కొత్త 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ సెడాన్‌లో 2.5-లీటర్, 4-సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు.

పెట్రోల్ ఇంధనంతో ఈ ఇంజన్ 175.5 బిహెచ్‌పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇందులోని బలమైన ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా ఈ ఇంజన్ శక్తి అదనంగా 160 kW లభిస్తుంది. గరిష్టంగా, ఇవి రెండూ కలిసిన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 215 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లో లభిస్తున్న ఇతర ఎమ్‌యూవీ గణాంకాల కంటే ఎక్కువ. కొత్త టొయోటా ఇన్నోవా హైక్రాస్ కూడా పెట్రోల్-ఓన్లీ పవర్‌ట్రెయిన్‌తో అందించబడుతుంది మరియు అవుట్‌గోయింగ్ ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిలో ఉన్న అదే పవర్‌ట్రెయిన్‌తో ఈ మోడళ్లను అందించవచ్చని సమాచారం.

అవుట్‌గోయింగ్ ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిలోని ఈ 2.7-లీటర్, 4-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 164 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 245 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో కూడిన టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 10.75 కిలోమీటర్ల ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

కాగా, కొత్తగా రాబోయే 2023 టొయోటా ఇన్నోవా హైక్రాస్‌లో అందించబోయే ADAS ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులోని యాక్టివ్ సేఫ్టీ సిస్టమ్ అయిన టొయోటా సేఫ్టీ సెన్స్ (TSS)లో భాగంగా అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ వంటి మరిన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇక ఇందులోని ఇతర ప్రీమియం ఫీచర్ల విషయానికి వస్తే, టొయోటా ఇన్నోవా హైక్రాస్ లో సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నలజీ మొదలైనవి చాలానే ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications








