కియా కార్ యజమానుల కోసం 'మై కియా' (MyKia) మొబైల్ యాప్ విడుదల; దీని స్పెషాలిటీ ఏంటంటే..

కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India), తమ కస్టమర్ల యాజమాన్య అనుభవాన్ని మరింత మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా 'మై కియా' (MyKia) పేరుతో ఓ సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. సేల్స్, సర్వీస్ మరియు ఆఫర్‌ల వంటి బహుళ ప్రయోజనాలను అందించడానికి ఈ అప్లికేషన్ రూపొందించబడింది మరియు అభివృద్ధి చేయబడింది. మై కియా మొబైల్ యాప్ కి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కియా కార్ యజమానుల కోసం 'మై కియా' (MyKia) మొబైల్ యాప్ విడుదల; దీని స్పెషాలిటీ ఏంటంటే..

మైకియా (MyKia) యాప్ లో సేల్స్ విభాగంలో భాగంగా, సంభావ్య కస్టమర్‌లు టెస్ట్ డ్రైవ్ లను బుక్ చేయడం, డిజి-కనెక్ట్ ద్వారా వీడియో కన్సల్టేషన్ లు, కొత్త కార్లను బుక్ చేయడం మరియు కొటేషన్ లను అభ్యర్థించడం వంటి సేవలను పొందవచ్చు. అలాగే, ఆఫ్టర్‌సేల్స్ కస్టమర్‌లకు సర్వీస్ కాస్ట్ కాలిక్యులేటర్, సర్వీస్ ఖర్చుల వివరాలు, సర్వీస్ ఫీడ్‌బ్యాక్, సర్వీస్ బుకింగ్ మరియు ట్రాకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.

కియా కార్ యజమానుల కోసం 'మై కియా' (MyKia) మొబైల్ యాప్ విడుదల; దీని స్పెషాలిటీ ఏంటంటే..

మైకియా మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ (Android) మరియు యాపిల్ (iOS) వినియోగదారులకు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ యాప్ ను విడుదల చేసిన రెండు వారాల్లోనే 10,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్‌లను సేకరించింది. ప్లేస్టోర్ లో మైకియా (MyKia) సెర్చ్ చేయడం ద్వారా ఈ యాప్ ను కనుక్కోవచ్చు. ఇతర మొబైల్ అప్లికేషన్ల మాదిరిగానే ఈ యాప్ ను సులుగా డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

కియా కార్ యజమానుల కోసం 'మై కియా' (MyKia) మొబైల్ యాప్ విడుదల; దీని స్పెషాలిటీ ఏంటంటే..

తగ్గనున్న కియా కార్ల వెయిటింగ్ పీరియడ్

కియా ఇండియా తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన 7-సీటర్ ఎమ్‌పివి కియా కారెన్స్ (Kia Carens) కి వస్తున్న అధిక డిమాండ్ కారణంగా, కంపెనీ వాహనాల వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో, కియా కార్ల యొక్క వెయిటింగ్ పీరియడ్ ను తగ్గించేందుకు కంపెనీ తమ అనంతపురం ప్లాంట్‌లో మూడవ షిప్ట్ లో వాహనాల ఉత్పత్తిని ప్రారంభించింది. కియా ఇండియా ఇప్పుడు ఏటా మూడు లక్షల వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కియా కార్ యజమానుల కోసం 'మై కియా' (MyKia) మొబైల్ యాప్ విడుదల; దీని స్పెషాలిటీ ఏంటంటే..

కియా కార్నివాల్ డెలివరీలు ప్రారంభం

కియా ఇండియా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కియా కారెన్స్ యొక్క డెలివరీలను కూడా ప్రారంభించింది. ఎమ్‌పివి విభాగంలో టొయోటా ఇన్నోవా (Toyota Innova) కి ప్రత్యక్ష పోటీగా వచ్చిన ఈ కారును కంపెనీ కేవలం రూ.8.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే ప్రవేశపెట్టింది. కియా కారెన్స్ మొత్తం 5 ట్రిమ్ లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్లు ఉన్నాయి. ఇది 6-సీటర్ లేదా 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కియా కార్ యజమానుల కోసం 'మై కియా' (MyKia) మొబైల్ యాప్ విడుదల; దీని స్పెషాలిటీ ఏంటంటే..

ఆకర్షణీయమైన ధర మరియు అధ్భుతమైన ఫీచర్ల కారణంగా కియా కారెన్స్ ప్రెస్టీజ్ మరియు ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. కియా కారెన్స్ ఎమ్‌పివి తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు కంపెనీ కియా సెల్టోస్ ఎస్‌యూవీలో ఉపయోగించిన అవే ఇంజన్స్‌నే కారెన్స్ ఎమ్‌పివిలో కూడా ఉపయోగించింది. ఇందులో మొత్తం మూడు ఇంజన్ ఆప్సన్స్ ఉన్నాయి. అవి: 1.5 పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఇవి వివిధ రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

కియా కార్ యజమానుల కోసం 'మై కియా' (MyKia) మొబైల్ యాప్ విడుదల; దీని స్పెషాలిటీ ఏంటంటే..

త్వరలో కొత్త కియా సెల్టోస్ (Kia Seltos) విడుదల

ఇదిలా ఉంటే, కియా ఇండియా అతి త్వరలో కొత్త మోడల్ సెల్టోస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే 2022 కియా సెల్టోస్ ఎస్‌యూవీ యొక్క కొన్ని ఫీచర్ల వివరాలు కూడా ఇప్పటికే వెల్లడయ్యాయి. సమాచారం ప్రకారం, కొత్త 2022 సెల్టోస్ ఎస్‌యూవీ అధునాతన డ్రైవ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. టెస్టింగ్ దశలో ఉండగా, కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ యొక్క కొన్ని చిత్రాలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి.

కియా కార్ యజమానుల కోసం 'మై కియా' (MyKia) మొబైల్ యాప్ విడుదల; దీని స్పెషాలిటీ ఏంటంటే..

ఆ వివరాల ప్రకారం, కొత్త సెల్టోస్ ఎస్‌యూవీని కంపెనీ ADASతో అందించవచ్చని చెబుతున్నారు. ఇక ఈ 2022 మోడల్ కియా సెల్టోస్ డిజైన్ విషయానికి వస్తే, దీనిని కొత్త తరం కియా స్పోర్టేజ్ డిజైన్ నుండి ప్రేరణ పొంది రూపొందించినట్లుగా తెలుస్తోంది. కొత్త సెల్టోస్ కారులో కొన్ని డిజైన్ అప్‌డేట్‌లతో పాటుగా ఫీచర్ అప్‌డేట్స్ కూడా ఉండనున్నాయి. ఇందులో కొత్త ఎల్ఈడి హెడ్‌లైట్లు, రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ మరియు రివైజ్డ్ టెయిల్ లైట్లు ఉన్నాయి.

కియా కార్ యజమానుల కోసం 'మై కియా' (MyKia) మొబైల్ యాప్ విడుదల; దీని స్పెషాలిటీ ఏంటంటే..

కియా ఇండియా ఈ అప్‌డేటెడ్ సెల్టోస్ వెర్షన్ లో సింగిల్ పేన్ సన్‌రూఫ ‌కు బదులుగా పానోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తుందని సమాచారం. కొత్త కియా సెల్టోస్ యొక్క మిడ్-లెవల్ ట్రిమ్ లు ప్రస్తుత మోడల్ మాదిరిగానే సింగిల్-పాన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ తో అమర్చబడి ఉంటాయని తెలుస్తోంది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లలో కియా సెల్టోస్ డీజిల్ వేరియంట్‌ను నిలిపివేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. మరి భారతదేశంలో విషయంలో కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Article Published On: Wednesday, March 9, 2022, 16:36 [IST]
English summary
All you need to know about kia india s mykia mobile application
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+