పెరిగిన పెట్రోల్ ధరలతో హై-టెన్షన్.. కానీ టొయోటా క్యామ్రీ (Toyota Camry) హైబ్రిడ్‌తో నో-టెన్షన్!

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ఇప్పటికే అమెరికా వంటి అగ్రరాజ్యంలో కూడా ఇంధన సమస్యలు మొదలయ్యాయి. ఆ దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మరికొన్ని రోజులు ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మనదేశంలో కూడా ఇంధన ధరలు గరిష్ట స్థాయిలో పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, కొనుగోలుదారులు కొత్త కార్లను కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు అధిక మైలేజీనిచ్చే కార్ల కోసం లేదా ప్రత్యమ్నాయ ఇంధనాలతో నడిచే కార్ల కోసం చూస్తున్నారు.

పెరిగిన పెట్రోల్ ధరలతో హై-టెన్షన్.. కానీ టొయోటా క్యామ్రీ (Toyota Camry) హైబ్రిడ్‌తో నో-టెన్షన్!

మనదేశంలో జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా (Toyota) అందిస్తున్న అత్యుత్తమ వాహనాలలో క్యామ్రీ హైబ్రిడ్ (Camry Hybrid) కూడా ఒకటి. ఇది పెట్రోల్ మరియు బ్యాటరీ పవర్ సాయంతో నడిచే బెస్ట్ ప్రీమియం సెడాన్. టొయోటా ఇటీవల తమ కొత్త 2022 మోడల్ క్యామ్రీ హైబ్రిడ్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మరి ఈ సెడాన్ విశేషాలు, విశిష్టతలు ఏంటి, డ్యూయెల్ పవర్ తో ఇది ఎంత మైలేజీని ఇస్తుంది, ఈ కారులో లభించే ఫీచర్లు, పరికరాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

పెరిగిన పెట్రోల్ ధరలతో హై-టెన్షన్.. కానీ టొయోటా క్యామ్రీ (Toyota Camry) హైబ్రిడ్‌తో నో-టెన్షన్!

ఎక్స్టీరియర్ డిజైన్

టొయోటా గతంలో ప్రవేశపెట్టిన అనేక ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల మాదిరిగానే, ఈ కొత్త 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ (2022 Toyota Camry Hybrid) ని కూడా రిఫ్రెష్డ్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ తో పాటుగా కొన్ని అదనపు ఫీచర్లతో కంపెనీ దీనిని అప్‌డేట్ చేసింది. ఈ మార్పులతో కొత్త టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ ఇప్పుడు మరింత స్పోర్టీగా మరియు అంతే ప్రీమియంగా కనిపిస్తుంది. ముందు వైపు క్రోమ్ గార్నిష్ చాలా మినమలిస్టిక్ గా ఉండి, సన్నటి ఫ్రంట్ గ్రిల్ మరియు దాని మధ్యలో ఇల్యుమినేటెడ్ టొయోటా లోగో ఉంటాయి.

పెరిగిన పెట్రోల్ ధరలతో హై-టెన్షన్.. కానీ టొయోటా క్యామ్రీ (Toyota Camry) హైబ్రిడ్‌తో నో-టెన్షన్!

ఫ్రంట్ గ్రిల్ కి దిగువ భాగంలో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లతో కూడిన ఫ్రంట్ బంపర్‌ను కూడా ఇందులో గమనించవచ్చు. ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన సన్నటి హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్ దిగువ భాగంలో అమర్చిన సన్నటి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ బానెట్ పై మజిక్యులర్ బాడీ లైన్స్‌తో ఇది ముందు వైపు నుండి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొత్త 2022 క్యామ్రీ హైబ్రిడ్ యొక్క సైడ్ ప్రొఫైల్ లో పెద్ద మార్పులు ఏమీ లేవు, ఇది మునుపటి మోడల్‌ మాదిరిగానే ఉంటుంది.

పెరిగిన పెట్రోల్ ధరలతో హై-టెన్షన్.. కానీ టొయోటా క్యామ్రీ (Toyota Camry) హైబ్రిడ్‌తో నో-టెన్షన్!

ఇకపోతే, ఇందులో కొత్త 18 ఇంచ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌ ను జోడించారు, ఇవి చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. వెనుక వైపు ఎల్ఈడి టెయిల్‌ ల్యాంప్‌ లపై డార్క్ ఇన్‌సర్ట్‌లు ఉంటాయి మరియు రియర్ బంపర్ ఇప్పుడు మరింత షార్ప్‌ గా ఉంటాయి. అప్‌డేట్ చేయబడిన 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ వెనుక భాగంలో కూడా స్పోర్టీ థీమ్ కనిపిస్తుంది.

పెరిగిన పెట్రోల్ ధరలతో హై-టెన్షన్.. కానీ టొయోటా క్యామ్రీ (Toyota Camry) హైబ్రిడ్‌తో నో-టెన్షన్!

ఇంటీరియర్ ఫీచర్లు

ఇదివరకు చెప్పుకున్నట్లుగా, కొత్త 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్లలో కంపెనీ చెప్పుకోదగిన మార్పులు చేసింది. ఈ కారులో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేతో కూడిన కొత్త 9.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో వస్తుంది. అంతే కాకుండా, ఇందులో 9 స్పీకర్ JBL ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మెమరీ ఫంక్షన్, క్రూయిజ్ కంట్రోల్, హెడ్‌అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

పెరిగిన పెట్రోల్ ధరలతో హై-టెన్షన్.. కానీ టొయోటా క్యామ్రీ (Toyota Camry) హైబ్రిడ్‌తో నో-టెన్షన్!

అలాగే, ఈ కొత్త క్యామ్రీ కారులో ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, పవర్ రిక్లైనింగ్ రియర్ సీట్స్, వెనుక ప్రయాణీకుల కోసం పవర్ సన్‌షేడ్‌లు వంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్లతో పాటుగా కొత్త 2022 టొయోటా క్యామ్రీ కారులోని వెనుక సీటులో కూర్చునే ప్రయాణీకుల కోసం రియర్ ఏసి కంట్రోల్స్, లెదర్ అప్‌హోలెస్ట్రీ మరియు సన్ షేడ్స్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

పెరిగిన పెట్రోల్ ధరలతో హై-టెన్షన్.. కానీ టొయోటా క్యామ్రీ (Toyota Camry) హైబ్రిడ్‌తో నో-టెన్షన్!

సేఫ్టీ ఫీచర్లు

భద్రతా ఫీచర్ల పరంగా చూస్తే, కొత్త 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ ఫేస్‌లిఫ్ట్ లో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడి (EBD) తో కూడిన ఏబిఎస్ (ABS), ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), బ్యాక్ గైడ్ మానిటర్‌తో పార్క్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), ట్రాక్షన్ కంట్రోల్ (TC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్-స్టార్ట్ అసిస్ట్ వంటి మరెన్నో సేఫ్టీ ఫీచర్‌లు ఉన్నాయి.

పెరిగిన పెట్రోల్ ధరలతో హై-టెన్షన్.. కానీ టొయోటా క్యామ్రీ (Toyota Camry) హైబ్రిడ్‌తో నో-టెన్షన్!

పవర్‌ట్రైన్ (ఇంజన్, గేర్‌బాక్స్)

కొత్త 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ కారులో గరిష్టంగా 178.5 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 2.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ ను ఉపయోగించారు. మునుపటి మోడల్ కూడా ఇదే ఇంజన్ లభించేది. ఈ ఇంజన్ గరిష్టంగా 221 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 202 ఎన్ఎమ్ టార్క్‌ మరియు 88 కిలోవాట్ పవర్ ను జనరేట్ చేసే ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 215 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజన్ సున్నితంగా అనిపించే సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడింది ఉంటుంది. ఇందులో విభిన్న డ్రైవింగ్ పరిస్థితుల కోసం స్పోర్ట్, ఎకో మరియు నార్మల్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు కూడా ఉంటాయి.

పెరిగిన పెట్రోల్ ధరలతో హై-టెన్షన్.. కానీ టొయోటా క్యామ్రీ (Toyota Camry) హైబ్రిడ్‌తో నో-టెన్షన్!

ధర మరియు వారంటీ

భారత మార్కెట్లో టొయోటా క్యామ్రీ ధర రూ. 41.70 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంటుంది. కంపెనీ యొక్క అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం, కొత్త 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ మోడల్ యొక్క బ్యాటరీపై కంపెనీ 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది. అలాగే, కొత్త 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్‌పై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 1,00,000 కిమీల స్టాండర్డ్ వారంటీని కూడా అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 14, 2022, 15:18 [IST]
English summary
All you need to know about toyota camry design engine specs features and much more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+