మొత్తానికి ఆనంద్ మహీంద్రా కారుకి పేరు దొరికిపోయింది.. ఆ పేరు మీకు బాగా తెలుసు
ఇటీవల మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' కొత్త 'స్కార్పియో-ఎన్' (Scorpio-N) డెలివరీ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సందర్భంగా ఆనంద్ మహీంద్రా తన కొత్త కారుకి ఒక మంచి పేరుని పెట్టాలని ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు. దీనికి చాలామంది రిప్లై ఇస్తూ చాలా పేర్లను తెలిపారు, కానీ అన్ని పేర్లను పరిశీలించి చివరికి రెండు పేర్లను సెలక్ట్ చేశారు. అందులో కూడా ఒక బెస్ట్ పేరుని ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆనంద్ మహీంద్రా కోరిక మేరకు చాలామంది నెటిజన్లు చాలా పేర్లను తెలిపినప్పటికీ అందులో 'భీమ్ మరియు బిచ్చు' అనే పేర్లను సెలక్ట్ చేశారు. అయితే ఈ రెండు పేర్లలో కూడా ఏది తన కారుకి పెట్టాలా అని ఆలోచనలో పడ్డాడు. అయితే ఆ అవకాశం కూడా ప్రజలకే ఇచ్చేసారు. కావున చాలామంది ప్రజలు ఈ రెండు పేర్లలో 'భీమ్' పేరు బాగుంటుందని తెలిపారు.

భీమ్ అంటే సింబల్ ఆఫ్ కింగ్ అని, ఆ పేరు మహీంద్రా స్కార్పియో-ఎన్ కి ఖచ్చితంగా సరిపోతుందని నెటిజన్లు తెలిపారు. కావున ఆనంద్ మహీంద్రా ఆ పేరునే ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆనంద్ మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీ చేసుకున్నప్పుడు చేసిన ట్వీట్ కు చాలా రిప్లేలు వచ్చాయి. కాగా చివరికి 'భీమ్' అనే పేరు నిర్దారించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆనంద్ మహీంద్రా గారికి ఒక మంచి పేరు దొరికేసింది.

ఇక ఆనంద్ మహీంద్రా కొనుగోలు చేసిన కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.

ఇందులోని 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో విక్రయించబడుతుంది.

రెండవ ఇంజిన్ అయిన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ దేశీయ మార్కెట్లో మొత్తం Z2, Z4, Z6, Z8 మరియు టాప్-స్పెక్ Z8L అనే 5 వేరియంట్‌లలో అందించబడుతుంది. వీటి ప్రారంభ ధరలు రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 23.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది మొత్తం 7 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి డీప్ ఫారెస్ట్, న్యాపోలి బ్లాక్, ఎవరెస్ట్ వైట్, రెడ్ రేజ్, డాజ్లింగ్ సిల్వర్, రాయల్ గోల్డ్ మరియు గ్రాండ్ కాన్యన్ కలర్స్.

మహీంద్రా స్కార్పియో-ఎన్ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులో ఇప్పుడు 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మరియు డ్యూయల్ ఛానెల్ సబ్-వూఫర్‌తో కూడిన సోనీ 3డి ఆడియో సిస్టమ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు డ్యూయల్ కెమెరా వంటివి ఉన్నాయి.

డిజైన్ విషయానికి వస్తే, మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సి షేప్ ఎల్ఈడి డిఆర్ఎల్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, సిగ్నేచర్ వీల్ ఆర్చెస్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, రూఫ్ స్పాయిలర్, స్కార్పియో స్టింగ్ క్రోమ్ విండో లైన్, సిగ్నేచర్ డబుల్ బారెల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు సైడ్ ఓపెనింగ్ టెయిల్ గేట్ వంటివి కూడా ఉన్నాయి. ఇందులో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కావున ఇందులో వాహన వినియోగదారులకు మంచి సేఫ్టీ కూడా లభిస్తుంది.

కంపెనీ ఇప్పటికే ఈ కొత్త కారు కోసం ఒక లక్షకు పైగా బుకింగ్స్ కూడా పొందింది, కావున డెలివరీలు వేగంగా జరపడానికి కంపెనీ తగిన సన్నాహాలు చేస్తుంది. కాగా కంపెనీ మొదట్లో వెల్లడించిన ధరలు మొదటి 25,000 యూనిట్లకు మాత్రమే పరిమితం కానున్నాయి. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








