ఏప్రిల్ 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్స్ ఇవే..

దేశంలో వాహనాల ధరలు, ఇంధన ధరలు పెరుగుతున్నప్పటికీ, కార్ల అమ్మకాలు మాత్రం సానుకూలంగానే సాగుతున్నాయి. ఏప్రిల్ 2022 నెలలో భారతదేశంలో కార్ల విక్రయాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్వల్పంగా 2.35 శాతం వార్షికంగా వృద్ధి చెందాయి. కాగా, ఇవే అమ్మకాలను గడచిన మార్చి 2022 నెలతో పోలిస్తే మాత్రం కార్ల విక్రయాలు 8.83 శాతం నెలవారీ తగ్గుదలను నమోదు చేశాయి. మరి గడచిన నెలలో ఏ కార్ బ్రాండ్ అత్యధిక అమ్మకాలను నమోదు చేసిందో ఈ కథనంలో చూద్దాం రండి.

ఏప్రిల్ 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్స్ ఇవే..

ఈ టాప్ 10 జాబితాలో మారుతి సుజుకి ఎప్పటిలానే మొదటి స్థానంలో ఉండగా, చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా అత్యధిక శాతం వృద్ధిని కనబరించింది. ఏప్రిల్ 2022 నెలలో కార్ కంపెనీలు మొత్తం 2,93,435 యూనిట్లను విక్రయించారు, ఇది ఏప్రిల్ 2021లో సాధించిన దానికంటే 6,736 యూనిట్లు ఎక్కువ. ఏప్రిల్ 2021 నెలలో, కార్ల తయారీదారులు 2,86,699 యూనిట్లను విక్రయించారు. గత నెలలో మారుతి సుజుకి, హ్యుందాయ వంటి కంపెనీలు 10 శాతానికి పైగా నష్టపోయినప్పటికీ, టాప్ 10 కార్ల తయారీదారులలో ఆరు కంపెనీలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి.

ఏప్రిల్ 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్స్ ఇవే..

1) మారుతి సుజుకి - 1,21,995 యూనిట్లు

మారుతి సుజుకి ఇటీవలి నెలల్లో తమ కొత్త బాలెనో ఫేస్‌లిప్ట్ మరియు రిఫ్రెష్ చేయబడిన ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి వాహనాలను విడుదల చేసినప్పటికీ, గడచిన ఏప్రిల్ నెలలో కంపెనీ అమ్మకాలు మాత్రం ఆశించినరీతిలో వృద్ధి చెందలేదు. ఏప్రిల్ 2021 నెలలో మారుతి సుజుకి మొత్తం 1,35,879 యూనిట్లను విక్రయించగా, ఏప్రిల్ 2022 నెలలో 1,21,995 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 10.22 శాతం (13,884 యూనిట్లు) తగ్గాయి. నెలవారీ అమ్మకాలను చూస్తే, మార్చి 2022లో మారుతి సుజుకి మొత్తం 1,33,861 యూనిట్లను విక్రయించింది. మార్చి నెలతో పోల్చి చూస్తే, గత నెలలో కంపెనీ అమ్మకాలు 8.86 శాతం (11,866 యూనిట్లు) క్షీణించాయి.

Rank Brand Apr-12 Apr-21 Growth (%) YoY
1 Maruti 1,21,995 1,35,879 -10.22
2 Hyundai 44,001 49,002 -10.21
3 Tata 41,587 25,095 65.72
4 Mahindra 22,526 18,285 23.19
5 Kia 19,019 16,111 18.05
6 Toyota 15,085 9,600 57.14
7 Honda 7,874 9,072 -13.21
8 Renault 7,594 8,642 -12.13
9 Skoda 5,152 961 436.11
10 Volkswagen 3,547 1,533 131.38
ఏప్రిల్ 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్స్ ఇవే..

2) హ్యుందాయ్ - 44,001 యూనిట్లు

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఏప్రిల్ 2022లో రెండవ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 2021 నెలలో కంపెనీ 49,002 యూనిట్లను విక్రయించగా, ఏప్రిల్ 2022 నెలలో 44,001 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ సమయంలో హ్యుందాయ్ అమ్మకాలు 10.21 శాతం (5,001 యూనిట్లు) తగ్గాయి. కాగా, మార్చి 2022 నెలలో విక్రయించిన 44,600 యూనిట్లతో పోలిస్తే హ్యుందాయ్ గత నెల అమ్మకాలు దాదాపు 1.34 శాతం (599 యూనిట్లు) తగ్గాయి.

ఏప్రిల్ 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్స్ ఇవే..

3) టాటా మోటార్స్ - 41,587 యూనిట్లు

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఈ టాప్ 10 కార్ బ్రాండ్స్ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. ఇటీవలి కాలంలో టాటా కార్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 2021 నెలలో టాటా మోటార్స్ విక్రయించిన 25,095 యూనిట్లతో పోలిస్తే, కంపెనీ గత నెలలో 41,587 యూనిట్లను విక్రయించి 65.72 శాతం (16,492 యూనిట్లు) వార్షిక వృద్ధిని సాధించింది. అయితే, కంపెనీ నెలవారీ విక్రయాలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. మార్చి 2022 నెలలో టాటా విక్రయించిన 42,293 యూనిట్లతో పోలిస్తే గత నెలలో కంపెనీ అమ్మకాలు 1.67 శాతం (706 యూనిట్లు) తగ్గాయి.

ఏప్రిల్ 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్స్ ఇవే..

4) మహీంద్రా - 22,526 యూనిట్లు

యుటిలిటీ వాహనాల తయారీలో పేరుగాంచిన దేశీయ కార్ బ్రాండ్ మహీంద్రా గత నెలలో మంచి వృద్ధిని కనబరించింది. మహీంద్రా ఏప్రిల్ 2021లో 18,285 యూనిట్లను మాత్రమే విక్రయించింది. కాగా, ఏప్రిల్ 2022 నెలలో కంపెనీ విక్రయాలు 23.19 శాతం (4,241 యూనిట్లు) పెరిగి 22,526 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, మార్చి 2022 నెల అమ్మకాలతో పోలిస్తే మాత్రం, గత నెల అమ్మకాలు 18.39 శాతం (5,077 యూనిట్లు) తగ్గాయి. ఆ నెలలో మహీంద్రా 27,603 యూనిట్లను విక్రయించింది.

ఏప్రిల్ 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్స్ ఇవే..

5) కియా - 19,019 యూనిట్లు

కొరియన్ కార్ కంపెనీ కియా భారత కార్ మార్కెట్‌లో దాదాపు 6.5 శాతం మార్కెట్ వాటాని నియంత్రించే స్థాయికి చేరుకుంది. కొత్త మోడళ్ల రాకతో కంపెనీ అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. కియా ఇండియా ఏప్రిల్ 2021 నెలలో విక్రయించిన 16,111 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, ఏప్రిల్ 2022 నెలలో అమ్మకాలు 18.05 శాతం (2,908 యూనిట్లు) వృద్ధి చెంది 19,019 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే, ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే కియా కూడా మార్చి 2022 నెల విక్రయాలతో పోలిస్తే, గత నెలలో తక్కువ అమ్మకాలను నమోదు చేసింది. మార్చి నెలలో కియా విక్రయించిన 22,622 యూనిట్లతో పోలిస్తే, గత నెల అమ్మకాలు 15.93 శాతం (3,603 యూనిట్లు) తగ్గాయి.

Rank Brand Apr-12 Mar-22 Growth (%) MoM
1 Maruti 1,21,995 1,33,861 -8.86
2 Hyundai 44,001 44,600 -1.34
3 Tata 41,587 42,293 -1.67
4 Mahindra 22,526 27,603 -18.39
5 Kia 19,019 22,622 -15.39
6 Toyota 15,085 17,131 -11.94
7 Honda 7,874 6,589 19.50
8 Renault 7,594 8,518 -10.85
9 Skoda 5,152 5,608 -8.13
10 Volkswagen 3,547 3,672 -3.40
ఏప్రిల్ 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్స్ ఇవే..

ఇక ఈ జాబితాలోని ఇతర 5 కార్ బ్రాండ్లలో టయోటా మరియు హోండా కంపెనీలు ఏప్రిల్ 2022 నెలలో వరుసగా 15,085 మరియు 7,874 యూనిట్లను విక్రయించి ఐదవ మరియు ఆరవ స్థానాలను ఆక్రమించాయి. వార్షిక అమ్మకాల పరంగా టొయోటా 57.14 శాతం వార్షిక వృద్ధిని సాధించగా, హోండా 13.21 శాతం క్షీణతను నమోదు చేసింది. ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో గడచిన ఏప్రిల్‌లో రెట్టింపు క్షీణతను చవిచూసింది. గత నెలలో ఈ కంపెనీ 7,594 యూనిట్లను విక్రయించడంతో అమ్మకాలు 12.13 శాతం తగ్గాయి. ఇకపోతే, గత నెలలో స్కోడా మరియు ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్లు వరుసగా 5,152 మరియు 3,547 యూనిట్లను విక్రయాలతో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.

More from DriveSpark

Article Published On: Thursday, May 5, 2022, 9:14 [IST]
English summary
April 2022 car sales here is the list of top 10 best selling car brands in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+