అశోక్ లేలాండ్ బడా దోస్త్ యానివర్సరీ ఎడిషన్ విడుదల.. ఇప్పుడు ఏసిలో హాయిగా డెలివరీ చేయండి..!
హిందూజా గ్రూప్ యొక్క ఫ్లాగ్‌షిప్ కంపెనీ మరియు ప్రముఖ దేశీయ వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ (Ashok Leyland) గడచిన రెండేళ్ల క్రితం భారత మార్కెట్లో విడుదల చేసిన తేలికపాటి వాణిజ్య వాహనం (లైట్ కమర్షియల్ వెహిలక్) "బడా దోస్త్" (Bada Dost) లో కంపెనీ ఇప్పుడు ఓ వార్షికోత్సవ ఎడిషన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
Recommended Video
బడా దోస్త్ లైట్ కమర్షియల్ వెహికల్ (ఎల్‌సివి) యొక్క రెండేళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పరిగణలోకి తీసుకొని కంపెనీ ఈ కొత్త అశోక్ లేలాండ్ బడా దోస్త్ యానివర్సరీ ఎడిషన్ (Ashok Leyland Bada Dost Anniversary Edition) ను విడుదల చేసింది. సెప్టెంబర్ 2020 నెలలో కంపెనీ తొలిసారిగా తమ బడా దోస్త్ ఎల్‌సివిని మార్కెట్లో విడుదల చేసింది. ఆ సమయంలో అశోక్ లేలాండ్ తమ బడా దోస్త్ ఎల్‌సివిని రూ.7.75 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది.

ఈ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ అశోక్ లేలాండ్ బడా దోస్త్ కమర్షియల్ వెహిల్ లో ఇండస్ట్రీ-ఫస్ట్ ఫీచర్లను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. బడా దోస్త్ (BADA DOST) సిరీస్ లో రెండు మోడళ్లు ఉన్నాయి. వీటిలో మొదటిది బడా దోస్త్ ఐ1 (BADA DOST i1), ఇది 1250 కేజీల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వేరియంట్ లో 1750 మిమీ వెడల్పు మరియు 2596 మిమీ (8.5 అడుగుల) పొడవైన డెక్ ఉంటుంది.

ఇకపోతే, బడా దోస్త్ ఐ2 (BADA DOST i2) వేరియంట్ 1425 కేజీల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే, ఈ వేరియంట్ లో 1750 మిమీ వెడల్పు మరియు 2745 మిమీ (9 అడుగుల) పొడవైన డెక్ ఉంటుంది. ఇది ఈ కేటగిరీలోనే అత్యధికమైన లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాణిజ్య వాహనాలు అధిక శక్తి, అధిక మైలేజీ, అధిక పేలోడ్, అధిక లోడ్ బాడీ పొడవు మరియు అధిక లోడింగ్ స్థలాన్ని కలిగి ఉండి, కస్టమర్‌లు ప్రతి ట్రిప్‌కు అధిక లాభాన్ని పొందేలా డిజైన్ చేయబడ్డాయని కంపెనీ తెలిపింది.

బడా దోస్త్ ఐ1 మరియు ఐ2 రెండు వేరియంట్లు కూడా ఇంటర్ మరియు ఇంట్రా-సిటీ రవాణా కోసం అనుకూలంగా ఉండేలా తక్కువ టర్నింగ్ రేడియస్‌ని కలిగి ఉండేలా తెలివిగా రూపొందించబడ్డాయి. భారత ఎల్‌సివి మార్కెట్‌లో దోస్త్ బ్రాండ్ సృష్టించిన బలమైన పునాదిపై కొత్త బడా డోస్త్ ఎల్‌సివి నిర్మించామని కంపెనీ తెలిపింది. విశ్వసనీయత, మైలేజ్ మరియు సౌకర్యానికి ఈ బ్రాండ్ ప్రసిద్ధి చెందిందని అశోక్ లేలాండ్ పేర్కొంది. అధునాతన టెక్నాలజీ మరియు డ్రైవర్ కంఫర్ట్ వంటి కస్టమర్-సెంట్రిక్ ఫీచర్లతో ఈ కొత్త బడా దోస్త్ ఎల్‌సివిని తయారు చేశామని కంపెనీ పేర్కొంది.

అశోక్ లేలాండ్ బడా దోస్త్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ లో కొత్తగా సెంట్రల్ లాకింగ్ ఫీచర్‌ను జోడించారు. ఈ విభాగంలో ఇది సెంట్రల్ లాకింగ్ ఫీచర్ ను పొందిన మొదటి వాణిజ్య వాహనం. ఇంకా ఇందులో సాధారణ ప్యాసింజర్ కార్లలో కనిపించే కీలెస్ ఎంట్రీ మరియు యాంటీ థెఫ్ట్ అలారం వంటి కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్లు కూడా జోడించబడ్డాయి. వాణిజ్య వాహనాల డ్రైవర్లకు కూడా డ్రైవింగ్ సౌకర్యాన్ని పెంచడానికి మరియు కస్టమర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి కంపెనీ ఈ లేటెస్ట్ ఫీచర్లను అందిస్తోంది.

అశోక్ లేలాండ్ బడా దోస్త్ లోని రెండు వేరియంట్లు కూడా ఒకే రకమైన ఇంజన్‌తో లభిస్తాయి. కాకపోతే, వీటి పేలోడ్ సామర్థ్యం మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఇందులో 1.5-లీటర్, త్రీ సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ 3300 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 79 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1600-2400 ఆర్‌పిఎమ్ మధ్యలో 190 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ బెస్ట్-ఇన్-క్లాస్ పవర్ మరియు మైలేజీని అందిస్తుందని అశోక్ లేలాండ్ పేర్కొంది, ఇది వినియోగదారునికి ప్రతి ట్రిప్‌లోనూ ఎక్కువ లాభాలను ఆర్జించడంలో సహాయపడుతుందని తెలిపింది.

బాడా డోస్త్ ఎల్‌సివిలో ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఏఆర్ఏఐ సర్టిఫైడ్ త్రీ సీట్ వాక్‌థ్రూ క్యాబిన్ ఉంటుంది, ఇందులో డ్రైవర్‌తో పాటుగా మరో ఇద్దరు కో ప్యాసింజర్లు సౌకర్యవంతంగా కూర్చోవటానికి వీలుగా ఉంటుంది. ఈ సీట్లు ప్రయాణీకులకు అత్యుత్తమ సౌకర్యాన్ని మరియు స్థలాన్ని అందిస్తాయి. ఫోల్డబుల్ బ్యాక్‌రెస్ట్ మరియు కోలాప్సబల్ హ్యాండ్ బ్రేక్‌లు డ్రైవర్‌కు మరింత సౌకర్యాన్ని అందిస్తాయి. బడా దోస్త్ ఈ విభాగంలోనే విశాలమైన క్యాబిన్‌తో వస్తుంది. ఇందులోని విశాలమైన సీటును బెడ్‌గా కూడా మార్చవచ్చు, ఇది డ్రైవర్ కు ప్రయాణాల మధ్య సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.

అశోక్ లేలాండ్ బడా దోస్త్ లోని ఇతర ఫీచర్లలో ఎర్గోనామిక్‌గా ఉంచిన డాష్-మౌంటెడ్ గేర్ షిఫ్ట్ లివర్, డ్యూయెల్-టోన్ డాష్‌బోర్డ్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి. ఈ వాణిజ్య వాహనాన్ని నడిపే డ్రైవరుకు ప్రీమియం కారు లాంటి అనుభవాన్ని అందించడం కోసం ఈ వాహనంలో AC (ఎయిర్ కండిషనింగ్) కూడా అమర్చబడి ఉంటుంది, దీని వలన వినియోగదారులు వేసవిలో కూడా ఎక్కువ దూరం అలసిపోకుండా నడపడానికి వీలుగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








