Audi A8 L బుకింగ్స్ షురూ.. బుకింగ్స్ ప్రైస్ ఎంతో తెలుసా?

ప్రముఖ జర్మన్ లగ్జరీ తయారీ సంస్థ 'ఆడి' (Audi) త్వరలో భారతీయ మార్కెట్లో తన 'ఏ8 ఎల్' (A8L) విడుదల చేయనుంది. అయితే అంతకంటే ముందే కంపెనీ ఈ సెడాన్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ లగ్జరీ సెడాన్ కొనుగోలు చేయాలనునే కస్టమర్లు రూ. 10 లక్షలు చెల్లింది బుక్ చేసుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Audi A8 L బుకింగ్స్ షురూ.. బుకింగ్స్ ప్రైస్ ఎంతో తెలుసా?

ఆడి ఏ8ఎల్ సెడాన్ బుకింగ్స్ కోసం ఇప్పుడు మీ సమీపంలో ఉన్న ఆడి ఇండియా డీలర్‌షిప్‌ను లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉంటుంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త సెడాన్ దాని మునుపటి ఏ8 మోడల్‌కు పొడవైన వీల్‌బేస్ మోడల్ అవుతుంది.

Audi A8 L బుకింగ్స్ షురూ.. బుకింగ్స్ ప్రైస్ ఎంతో తెలుసా?

ఆడి ఏ8 ఎల్ సెడాన్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఇది అద్భుతమైన డిజైన్ కూడా కలిగి ఉంటుంది. ఈ సెడాన్ లో కంపెనీ డిజిటల్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ లైట్ సెటప్‌ వినియోగించింది. కొత్త క్రోమ్-ఫినిష్డ్ రేడియేటర్ గ్రిల్‌ ఇందులో ఉంటుంది. వెనుక వైపున సెడాన్ వెడల్పు అంతటా లైట్ బార్ చుట్టి, సొగసైన LED టెయిల్-ల్యాంప్‌ ఉంటుంది. దీనితో పాటు చాలా వరకు అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది.

Audi A8 L బుకింగ్స్ షురూ.. బుకింగ్స్ ప్రైస్ ఎంతో తెలుసా?

ఇక ఇందులోని ఫీచర్స్ విషయానికి వస్తే, రిక్లైనర్, ఫుట్ మసాజర్ వంటి వాటితో పాటు దాని మునుపటి మోడల్ లోని దాదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున తప్పకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. A8 L క్యాబిన్ కూడా చాలా వరకు విలాసవంతంగా ఉంటుంది. లగ్జరీ సెడాన్ రివైజ్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు వెనుక సీటు ప్రయాణీకుల కోసం 10.1-ఇంచెస్ డ్యూయల్ స్క్రీన్‌లను పొందుతుంది. అంతేకాకుండా, ఫ్లాగ్‌షిప్ సెడాన్ ఫోల్డబుల్ సెంటర్-కన్సోల్ టేబుల్ మరియు మినీ-బార్‌తో వస్తుంది.

Audi A8 L బుకింగ్స్ షురూ.. బుకింగ్స్ ప్రైస్ ఎంతో తెలుసా?

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త ఆడి ఏ8ఎల్ సెడాన్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడిన 3.0-లీటర్ టిఎఫ్ఎస్ఐ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 340 హెచ్‌పి పవర్ మరియు 540 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో జత చేయబడి ఉంటుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

Audi A8 L బుకింగ్స్ షురూ.. బుకింగ్స్ ప్రైస్ ఎంతో తెలుసా?

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త ఆడి ఏ8 ఎల్ సెడాన్ యొక్క అధికారిక ధర ఇంకా వెల్లడి కాలేదు, కానీ దీని ధర దాదాపు రూ. 1.40 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొత్త సెడాన్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ (Mercedes-Benz S-కClass) మరియు బీఎండబ్ల్యూ 7 (BMW 7) సిరీస్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Audi A8 L బుకింగ్స్ షురూ.. బుకింగ్స్ ప్రైస్ ఎంతో తెలుసా?

ఇదిలా ఉండగా జర్మన్ కార్ కంపెనీ త్వరలో భారతీయ మార్కెట్లో కూడా స్థానికంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు సిద్ధం చేయనుంది. అయితే భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల తయారికి అనుకూలంగా ఉంటుందా లేదా అని కూడా యోచిస్తోంది. కంపెనీ ఇప్పటికే వ్యాప్తంగా తమ వాహనాలన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి కృషి చేస్తోంది.

Audi A8 L బుకింగ్స్ షురూ.. బుకింగ్స్ ప్రైస్ ఎంతో తెలుసా?

ఆడి కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 2023 నుంచి మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలనే విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఎక్కువగా వినియోగంలో ఉండే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ప్రధాన కారణం లేకుండా పోలేదు.

Audi A8 L బుకింగ్స్ షురూ.. బుకింగ్స్ ప్రైస్ ఎంతో తెలుసా?

రోజు రోజుకి పెరుగుతున్న చమురు (పెట్రోల్ & డీజిల్) ధరల కారణంగా ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి సుముఖత చూపుతున్నారు. కావున రానున్న రోజుల్లో దాదాపు చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. కావున రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలే రాజ్యమేలే అవకాశం ఉంది అంతంలో ఎటువంటి సందేహం లేదు.

More from DriveSpark

Article Published On: Friday, May 6, 2022, 8:30 [IST]
English summary
Audi a8 l bookings open launch soon details
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+