భారత మార్కెట్లో విడుదలైన కొత్త Audi Q7: ధర, పూర్తి వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ తయారు సంస్థ ఆడి (Audi) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో కొత్త ఆడి క్యూ7 (Audi Q7) SUV విడుదల చేసింది. ఈ కొత్త SUV ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 79.99 లక్షలు. ఈ కొత్త మోడల్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త SUV గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Audi Q7: ధర, పూర్తి వివరాలు

ఆడి క్యూ7 (Audi Q7) SUV రెండు వేరియంట్లలో అందుబటులో ఉంటుంది. అవి ఒకటి ప్రీమియం ప్లస్ కాగా, మరొక SUV టెక్నాలజీ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 79.99 లక్షలు మరియు రూ. 88.33 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Audi Q7: ధర, పూర్తి వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఆడి క్యూ7 యొక్క ఉత్పత్తి కూడా ఇప్పటికే ప్రారంభించబడింది. కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. కంపెనీ బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారంభించింది. కొనుగోలుదారులు ముందస్తుగా రూ. 5 లక్షలు చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ని సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Audi Q7: ధర, పూర్తి వివరాలు

ఆడి క్యూ7 అనే కొత్త SUV భారతదేశంలో ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్సన్ లో మాత్రమే అందుబటులో ఉంటుంది. కావున ఇందులో 2,995సిసి వి6 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్‌ అందుబటులో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 335 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్‌ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఈ కారు గరిష్టంగా 250 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. అదే సమయంలో ఈ SUV కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Audi Q7: ధర, పూర్తి వివరాలు

ఆడి క్యూ7 ఆల్-వీల్ డ్రైవ్ సిస్టం కలిగి ఉండటమే కాకుండా.. ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్-రోడ్ మరియు ఇండివిజువల్ అనే 7 డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల్ని మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Audi Q7: ధర, పూర్తి వివరాలు

ఇందులోని ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, రియర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, హీటెడ్ ORVMలు, అప్‌డేటెడ్ టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు క్యాబిన్ లైటింగ్, 12-వే పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఆల్-వెదర్ ఫ్లోర్ మ్యాట్‌ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Audi Q7: ధర, పూర్తి వివరాలు

ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో రియర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇది కాకుండా, ఇది మెమరీ ఫంక్షన్‌తో కూడిన హీట్, పవర్-ఫోల్డింగ్ వింగ్ మిర్రర్‌లు, డైరెక్ట్ టైర్-ప్రెజర్ మానిటర్, యాంబియంట్ లైటింగ్‌ వంటి వాటిని కూడా స్టాండర్డ్ గా పొందుతుంది. ఇందులోని 7-సీటర్ మోడల్ మూడవ వరుసలో ఎలక్ట్రిక్ ఫోల్డింగ్‌తో పాటు 4 జోన్ ఎయిర్ కండిషనింగ్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ బూట్ లిడ్, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, పార్క్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Audi Q7: ధర, పూర్తి వివరాలు

కొత్త క్యూ7 SUV 'మై ఆడి కనెక్ట్' యాప్‌తో పాటు వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు ప్రోడక్ట్ విజువలైజర్ వంటి ఆధునిక టెక్నాలజీలను కూడా కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV మూడు వరుసల సీటర్, కావున చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కావున ఇది 20-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, స్లిమ్ మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్ యూనిట్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ గ్రిల్, విండోస్‌పై క్రోమ్ గార్నిష్ మరియు క్రోమ్ లైన్డ్ డోర్‌లను పొందుతుంది. అంతే కాకుండా ఇది మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ టెయిల్‌లైట్‌లను కూడా పొందింది, వీటిని బూట్ డోర్ వద్ద స్లిమ్ క్రోమ్ స్ట్రిప్ జత చేస్తుంది. వెనుక బంపర్‌కు క్రోమ్-టిప్డ్ ఎగ్జాస్ట్ మరియు స్కిడ్ ప్లేట్ కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Audi Q7: ధర, పూర్తి వివరాలు

క్యూ7 SUV యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,063 మిమీ, వెడల్పు 1,970 మిమీ మరియు ఎత్తు 1,741 మిమీ వరకు ఉంటుంది. అదే విధంగా ఇది 2,995 మిమీ వీల్‌బేస్ ఇవ్వబడింది. ఇది 865 లీటర్ల భారీ బూట్‌స్పేస్‌ను పొందుతుంది, వెనుక సీట్లను మడతపెట్టడం ద్వారా బూట్ స్పేస్ 2,050 లీటర్ల వరకు పెంచుకోవచ్చు .

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Audi Q7: ధర, పూర్తి వివరాలు

కొత్త ఆడి క్యూ7 మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. అవి వైట్, బ్లాక్, బ్లూ, గ్రే మరియు సిల్వర్ కలర్స్. ఇంటీరియర్‌లో బీజ్ మరియు బ్రౌన్ అనే రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఈ లగ్జరీ కారుని చాలా ఆకర్షణీయంగా చేస్తుంది. కావున మంచి అమ్మకాలను పొందుతుంది.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Audi Q7: ధర, పూర్తి వివరాలు

ఎట్టకేలకు ఇప్పుడు కొత్త ఆడి క్యూ7 దేశీయ మార్కెట్లో విడుదలయ్యింది. కావున ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం త్వరలోనే తెలుస్తుంది. ఆడి క్యూ7 దేశీయ మార్కెట్లో బిఎండబ్ల్యు ఎక్స్7, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్, వోల్వో XC90, ల్యాండ్ రోవర్ డిస్కవరీ మరియు లెక్సస్ ఆర్ఎక్స్ వంటి వాటికి ఇది ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 3, 2022, 13:35 [IST]
English summary
Audi q7 launched in india price variant features engine details
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+