భారత్‌లో కేవలం 50 మంది కోసం మాత్రమే 'Q7 లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన Audi.. ఎందుకంటే?
ప్రముఖ జర్మన్ లగ్జరీ వాహన తయారీ సంస్థ అయిన 'ఆడి' (Audi) భారతీయ మార్కెట్లో ఇప్పటికే తన క్యూ7 (Q7) విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఎట్టకేలకు క్యూ7 యొక్క 'లిమిటెడ్ ఎడిషన్' విడుదల చేసింది.
Recommended Video
దేశీయ మార్కెట్లో ఆడి ఇండియా లాంచ్ చేసిన కొత్త క్యూ7 లిమిటెడ్ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'ఆడి క్యూ7 లిమిటెడ్ ఎడిషన్' (Audi Q7 Limited Edition) ధర రూ. 88.08 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఈ లగ్జరీ కారు భారతీయ మార్కెట్లో కేవలం 50 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అంటే ఈ కొత్త SUV ని కేవలం 50 మంచి కస్టమర్లు మాత్రమే కొనుగోలుచేయడానికి అవకాశం ఉంటుంది. కావున ఆసక్తిగల కస్టమర్లు వీలైనంత త్వరగా దీనిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

కొత్త 'ఆడి క్యూ7 లిమిటెడ్ ఎడిషన్' దాని టాప్-స్పెక్ టెక్నాలజీ వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. కానీ ధర మాత్రం దాని స్టాండర్డ్ టెక్నాలజీ ట్రిమ్ కంటే కూడా తక్కువ కావడం విశేషం. అయితే ఈ కొత్త ఎడిషన్ లో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉంటాయి.

ఆడి విడుదల చేసిన ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ ఎక్ట్సీరియర్ షేడ్‌ను పొందుతుంది. ఇది ఈ లగ్జరీ SUV కి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పవచ్చు. అంతే కాకూండా ఇందులో రన్నింగ్ బోర్డ్‌లు, క్వాట్రో ఎంట్రీ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, సింగిల్-పీస్ ఆక్టాగోనల్ ఫ్రంట్ గ్రిల్ మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా దాని డిజైన్ యూ మరింత పెంచడంలో సహాయపడతాయి.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.1-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది, ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, 19 స్పీకర్ బ్యాంగ్, ఒలుఫ్సెన్ స్టీరియో సిస్టమ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, రిక్లైన్ ఫంక్షన్‌తో రెండవ వరుస సీట్లు మొదలైనవి ఉన్నాయి, ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కొత్త ఆడి క్యూ7 లిమిటెడ్ ఎడిషన్ 48వి మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా 3.0-లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 336.6 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి జత చేయబడి ఉంటుంది.

కొత్త ఆడి క్యూ7 ఆల్-వీల్ డ్రైవ్ సిస్టం కలిగి ఉండటమే కాకుండా.. ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్-రోడ్ మరియు ఇండివిజువల్ అనే 7 డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల్ని మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఆడి క్యూ7 లిమిటెడ్ ఎడిషన్ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా మొదలైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇది కూడా వాహన వినియోగదారులకు మంచి భద్రతను కల్పిస్తుంది. ఇది దేశీయ మార్కెట్లో బిఎండబ్ల్యు ఎక్స్7, వోల్వో XC90 మరియు మెర్సిడెస్ బెంజ్ GLS వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఇప్పటికే విడుదలైన ఆడి క్యూ7 అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. అంతే కాకుండా ఇప్పటికే ఎక్కువమంది సెలబ్రెటీలు కూడా ఈ లగ్జరీ SUV ని కొనుగోలు చేశారు. ఇందులో అదితి రావ్ హైదరీ మొదలైన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు విడుదలైన ఈ కొత్త ఎడిషన్ మరింత మంది సెలబ్రెటీలను ఆకర్శించే అవకాశం ఉందని భావిస్తున్నాము.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతదేశంలో ఇప్పటికే ప్రారంభమైన పండుగ సీజన్ లో ఆడి ఇండియా కొత్త క్యూ7 లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేయడం వల్ల తప్పకుండా మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన క్యూ7 SUV, ఈ లిమిటెడ్ ఎడిషన్ లో కూడా గొప్ప ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








