ఎస్‌యూవీలలో ఏది బెస్ట్..? దేనికి డిమాండ్ ఎక్కువ ఉందో మీరే చూడండి..!

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో గత కొన్నేళ్లుగా ఎస్‌యూవీలు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రాక్టికాలిటీ మరియు సరసమైన ధరల నేపథ్యంలో కొనుగోలుదారులు ఇప్పుడు చిన్న కార్ల కన్నా ఎక్కువగా ఎస్‌యూవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యేకించి రూరల్ మార్కెట్ల నుండి ఈ విభాగంలో వాహనాలకు డిమాండ్ బాగా పెరిగింది. నిజానికి, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఎస్‌యూవీ టైప్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఫలితంగా, ఈ సెగ్మెంట్లో వాహనాల అమ్మకాలు కూడా జోరుగా ఉంటున్నాయి.

ఎస్‌యూవీలలో ఏది బెస్ట్..? దేనికి డిమాండ్ ఎక్కువ ఉందో మీరే చూడండి..!

ప్రస్తుతం, మనదేశంలో దాదాపు అన్ని కార్ కంపెనీలు కనీసం ఒక్క ఎస్‌యూవీనైనా విక్రయిస్తున్నారు. మహీంద్రా వంటి కంపెనీలు అయితే, కేవలం ఎస్‌యూవీ టైప్ వాహనాలను మాత్రమే విక్రయిస్తున్నాయి. గత నెలలో భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఎస్‌యూవీల ట్రెండ్ ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం రండి. కొత్త 2022 క్యాలెండర్ ఇయర్ మొదటి నెలలో, టాటా నెక్సాన్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

ఎస్‌యూవీలలో ఏది బెస్ట్..? దేనికి డిమాండ్ ఎక్కువ ఉందో మీరే చూడండి..!

టాటా నెక్సాన్ ఎస్‌యూవీని గడచిన 2017లో భారత మార్కెట్లో లాంచ్ చేసినప్పటి నుండి ఇది మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం, గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొందడమే. గడచిన డిసెంబర్ 2021 నెలలో కూడా టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. టాటా మోటార్స్ జనవరిలో మొత్తం 13,816 నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలను విక్రయించింది.

ఎస్‌యూవీలలో ఏది బెస్ట్..? దేనికి డిమాండ్ ఎక్కువ ఉందో మీరే చూడండి..!

కాగా, జనవరి 2021లో కేవలం 8,225 టాటా నెక్సాన్ ఎస్‌యూవీలు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సమయంలో నెక్సాన్ కార్ల విక్రయాలు దాదాపు 67.9 శాతం పెరిగాయి. నెక్సాన్ అమ్మకాల ట్రెండ్ ను అలానే కొనసాగించేందుకు కంపెనీ ఇందులో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త మోడల్ లాంచ్ తర్వాత టాటా నెక్సాన్ కార్ల విక్రయాలు మరో కొత్త గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.

Rank Model Jan 2022 Jan 2021 Growth (%)
1 Tata Nexon 13,816 8,225 67.9
2 Kia Seltos 11,483 9,869 16.3
3 Hyundai Venue 11,377 11,779 -3.4
4 Tata Punch 10,027 - -
5 Hyundai Creta 9,869 12,284 -19.6
6 Maruti Vitara Brezza 9,576 10,623 -9.8
7 Kia Sonet 6,904 8,859 -22
8 Mahindra Thar 4,646 3,152 47.3
9 Mahindra XUV300 4,550 4,612 -1.3
10 Mahindra XUV700 4,119 - -
ఎస్‌యూవీలలో ఏది బెస్ట్..? దేనికి డిమాండ్ ఎక్కువ ఉందో మీరే చూడండి..!

ఇక ఈ జాబితాలో టాటా నెక్సాన్ అడుగుజాడలను అనుసరిస్తూ, కియా సెల్టోస్ ఎస్‌యూవీ 11,483 యూనిట్ల అమ్మకాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. కొరియన్ కార్ బ్రాండ్ విక్రయిస్తున్న ఈ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ గత జనవరి 2021తో పోలిస్తే గత నెలలో 16.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. జనవరి 2021 నెలలో కంపెనీ మొత్తం 9,869 యూనిట్ల సెల్టోస్ కార్లను విక్రయించింది. కియా సెల్టోస్ ఎస్‌యూవీలో కూడా ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. ఇది 2022 మధ్యలో ప్రారంభించబడుతుందని నివేదించబడింది.

ఎస్‌యూవీలలో ఏది బెస్ట్..? దేనికి డిమాండ్ ఎక్కువ ఉందో మీరే చూడండి..!

మరొక కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ విక్రయిస్తున్న వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ జాబితాలో 11,377 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. జనవరి 2021 నెలలో కూడా దాదాపు అదే సంఖ్యలో వెన్యూ కార్లు విక్రయించబడ్డాయి (11,779 యూనిట్లు). టాటా మోటార్స్ గతేడాది విడుదల చేసిన సరికొత్త మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది. హ్యుందాయ్ క్రెటా మరియు మారుతి విటారా బ్రెజ్జా వంటి ప్రసిద్ధ ఎస్‌యూవీలను టాటా పంచ్ పక్కకు నెట్టి, జనవరి 2022లో మొత్తం 10,027 యూనిట్ల విక్రయాలతో నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది.

ఎస్‌యూవీలలో ఏది బెస్ట్..? దేనికి డిమాండ్ ఎక్కువ ఉందో మీరే చూడండి..!

గత నెలలో విక్రయాల పరంగా 10 వేల యూనిట్ల మైలురాయిని దాటిన మొదటి నాలుగు ఎస్‌యూవీలు ఇవే. ఇక మిగిలిన మోడళ్లన్నీ కూడా దాదాపు 10,000 యూనిట్ల కంటే తక్కువ అమ్మకాలను కలిగి ఉన్నాయి. ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా మరియు మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలు ఈ విభాగంలో ఐదు మరియు ఆరవ స్థానాల్లో నిలిచాయి. గత నెలలో ఈ రెండు మోడళ్లు వరుసగా 9,869 యూనిట్లు మరియు 9,576 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి. కానీ జనవరి 2021 అమ్మకాల గణాంకాలను చూస్తే, ఈ రెండు మోడళ్లు వరుసగా 12,284 యూనిట్లు మరియు 10,623 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి.

More from DriveSpark

Article Published On: Thursday, February 3, 2022, 17:55 [IST]
English summary
Best selling suvs in january 2022 tata nexon punch venue creta and more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+