హైదరాబాద్‌కు మరొక అమెరికన్ ఈవీ కంపెనీ.. తెలంగాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీవీలర్ ప్లాంట్

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈవీ విధానాలు (ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ) ఇటు కొనుగోలుదారులనే కాకుండా, అటు కొత్త తయారీదారులను కూడా ఆకర్షిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫిస్కర్ అనే ఈవీ సంస్థను హైదరాబాద్‌కు తీసుకువచ్చిన ఐటి మంతి కేటీఆర్ ఇప్పుడు, అదే దేశానికి చెందిన మరొక ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీని తెలంగాణా రాష్ట్రానికి తీసుకువచ్చారు.

హైదరాబాద్‌కు మరొక అమెరికన్ ఈవీ కంపెనీ.. తెలంగాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీవలర్ ప్లాంట్

కాలిఫోర్నియాకు చెందిన బిలిటి ఎలక్ట్రిక్ ఇన్‌కార్పోరేషన్ (Biliti Electric) భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 2,40,000 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ప్లాంట్ కోసం కంపెనీ సుమారు 150 మిలియన్ల డాలర్ల ప్రైవేట్ పెట్టుబడిని పెడుతుందని అంచనా వేయబడింది.

హైదరాబాద్‌కు మరొక అమెరికన్ ఈవీ కంపెనీ.. తెలంగాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీవలర్ ప్లాంట్

బిలిటి తీసుకున్న నిర్ణయం వలన ఈ బ్రాండ్‌కు భారతదేశం ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మరియు ఎనర్జీ స్టోరేజ్ తయారీకి గ్లోబల్ హబ్‌గా మారడంతో పాటుగా, రాష్ట్రంలో కొత్తగా 3,000 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించగలదని అంచనా వేయబడింది. బిలిటి ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన గయం మోటార్ వర్క్స్ (జిఎమ్‌డబ్ల్యూ) తో తన త్రీ-వీలర్‌ల తయారీ కోసం ప్రత్యేకమైన తయారీ భాగస్వామ్యంతో పనిచేస్తుంది.

హైదరాబాద్‌కు మరొక అమెరికన్ ఈవీ కంపెనీ.. తెలంగాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీవలర్ ప్లాంట్

బిలిటి బ్రాండ్‌కి చెందిన టాస్క్‌మ్యాన్ (Biliti Taskman) అనేది ఒక ప్రసిద్ధ లాస్ట్-మైల్ డెలివరీ వాహనం, ఇది జపాన్, యూఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, పోర్చుగల్, జర్మనీ, లెబనాన్, ఉగాండా, కెన్యా, సెనెగల్, నేపాల్, బంగ్లాదేశ్, దుబాయ్ మరియు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలలో అందుబాటులో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇది 20 మిలియన్ మైళ్లకు పైగా కవర్ చేసింది. బిలిటి సంస్థకు యూఎస్, పోర్చుగల్ మరియు కెన్యాలో తయారీ కేంద్రాలతో పాటుగా అసెంబ్లీ ప్లాంట్లను కూడా కలిగి ఉంది.

హైదరాబాద్‌కు మరొక అమెరికన్ ఈవీ కంపెనీ.. తెలంగాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీవలర్ ప్లాంట్

ఈ అమెరిన్ బ్రాండ్ అందిస్తున్న టాస్క్‌మ్యాన్ త్రీవీలర్‌ను Amazon, IKEA, Wasoko (Sokowatch), BigBasket (Tata), Zomato, Flipkart (Walmart) మరియు Grofers వంటి సంస్థలు తమ లాస్ట్-మైల్ కనెక్టివిటీ మరియు కార్గో రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. ఇది పూర్తి చార్జ్ పై 110 మైళ్ల రేంజ్ ను అందిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 25 మైళ్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇది స్వాపబల్ బ్యాటరీ ప్యాక్ ని కూడా కలిగి ఉంటుంది, కేవలం 1 నిమిషంలోనే దీని బ్యాటరీని స్వాప్ చేయవచ్చు. ఇందులోని బ్యాటరీని 3.5 గంటల్లో పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. దీని పేలోడ్ సామర్థ్యం 1500 పౌండ్స్‌గా ఉంటుంది.

హైదరాబాద్‌కు మరొక అమెరికన్ ఈవీ కంపెనీ.. తెలంగాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీవలర్ ప్లాంట్

ఈ సందర్భంగా తెలంగాణా పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాము రెండేళ్ల క్రితం ఈవీ పాలసీని ప్రారంభించినప్పుడు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని అందరూ ఇష్టపడే గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించామని, బిలిటి వంటి కంపెనీలు ప్రపంచంలోనే అతిపెద్ద త్రీవీలర్‌ ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పడంతో ఈ లక్ష్యం నిజమవడాన్ని తాను కళ్లారా చూస్తున్నామని ఆయన అన్నారు.

హైదరాబాద్‌కు మరొక అమెరికన్ ఈవీ కంపెనీ.. తెలంగాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీవలర్ ప్లాంట్

ఈవీ తయారీ రంగంలో ఈ ఏడాది రాష్ట్రంలో ప్రకటించిన అతిపెద్ద పెట్టుబడి ఇదేనని, కాలిఫోర్నియాకు చెందిన మరొక కంపెనీ ఫిస్కర్ హైదరాబాద్‌లో తమ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. స్వచ్ఛమైన (ప్యూర్ ఎనర్జీ) పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తెలంగాణా రాష్ట్రం కట్టుబడి ఉంటుందని మరియు తమ ప్రభుత్వ విధానాల ప్రకారం ఈవీ తయారీ కంపెనీలకు అవసరమైన అన్ని ప్రయోజనాలను అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌కు మరొక అమెరికన్ ఈవీ కంపెనీ.. తెలంగాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీవలర్ ప్లాంట్

తెలంగాణ రాష్ట్రంలో తమ అద్భుతమైన ఈవీ లైనప్‌ ను తయారు చేయడం చాలా గర్వకారణంగా ఉందని బిలిటి ఎలక్ట్రిక్ యొక్క సీఈఓ రాహుల్ గయామ్ అన్నారు. కంపెనీ తయారు చేస్తున్న టాస్క్‌మాన్ ఎలక్ట్రిక్ త్రీవీలర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 12 మిలియన్ల యూనిట్లకు పైగా అమ్ముడైందని, భవిష్యత్తులో మరిన్ని యూనిట్లు అమ్మకం అవుతాయని, ఇందులో ఉపయోగించే బ్యాటరీలు మరియు డ్రైవ్‌ట్రెయిన్ డిజైన్‌ లో కాంపాక్ట్ మరియు మాడ్యులర్‌ గా ఉంటాయని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌కు మరొక అమెరికన్ ఈవీ కంపెనీ.. తెలంగాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీవలర్ ప్లాంట్

తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో బిలిటీ ప్లాంట్‌ ను ఏర్పాటు చేయనున్నారు. రెండు దశల్లో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్‌లో ఫేజ్ 1 లో భాగంగా సంవత్సరానికి 18,000 వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో 13.5 ఎకరాల్లో ఓ తయారీ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు, ఇది 2023 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

హైదరాబాద్‌కు మరొక అమెరికన్ ఈవీ కంపెనీ.. తెలంగాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీవలర్ ప్లాంట్

కాగా, 200 ఎకరాల్లో ఏర్పాటు కానున్న పెద్ద ప్లాంట్ 2024 లో అందుబాటులోకి రానుంది మరియు ఇది సంవత్సరానికి 2,40,000 వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కార్గో మోడల్ టాస్క్‌మాన్ మరియు ప్యాసింజర్ వెర్షన్ అర్బన్ తో సహా బిలిటి పలు ఇత ఉత్పత్తులను ఈ ప్లాంట్ లో తయారు చేస్తుంది మరియు ఇక్కడ తయారైన వాహనాలు పలు ఇతర గ్లోబల్ మార్కెట్‌లకు కూడా ఎగుమతి చేయనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 20, 2022, 10:46 [IST]
English summary
Biliti electric to setup the world s largest electric three wheeler plant in hyderabad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+