ఉత్పత్తిలో రికార్డ్ స్థాయి చేరిన BMW చెన్నై ప్లాంట్.. వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా (BMW India) ఒకటి. ఈ కంపెనీ దేశీయ మార్కెట్లో కూడా స్థానికంగా ఉత్పత్తిని ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగానే చెన్నై ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తోంది. అయితే కంపెనీ ఇటీవల చెన్నై ప్లాంట్ నుండి స్థానికంగా ఉత్పత్తి చేయబడిన 1,00,000 వ BMW కారును విడుదల చేసింది.

ఈ సందర్భంగా బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తమ బిఎమ్‌డబ్ల్యూ 740ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఎడిషన్‌కు ఒక ప్రత్యేక బ్యాడ్జ్‌ను ఇచ్చింది. దీనికి సంబంధించి సమాచారాన్ని BMW గ్రూప్ చెన్నై ప్లాంట్ మేనేజింగ్ డైరెక్టర్ థామస్ డోస్ తెలియజేశారు. అంతే కాకుండా మా అసెంబ్లీ లైన్ నుండి 100,000 వ మేడ్-ఇన్-ఇండియా కారు రోల్ అవుతోంది కావున మాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న సమయంలో BMW గ్రూప్ చెన్నై ప్లాంట్ యొక్క స్థిరమైన తయారీ నైపుణ్యంలో బార్‌ను పెంచడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. చైన్నైలో BMW గ్రూప్ ప్లాంట్ 2007 మార్చి 29 న తమ కార్యకలాపాలు ప్రారంభించిందని కంపెనీ తెలిపింది.

భారత మార్కెట్లో ప్రస్తుతం, బీఎండబ్ల్యూ కంపెనీ స్థానికంగా 13 మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. వీటిలో BMW 2 సిరీస్ గ్రాన్ కూపే, BMW 3 సిరీస్, BMW 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్, BMW M340i, BMW 5 సిరీస్, BMW 6 సిరీస్ గ్రాన్ టురిస్మో, BMW 7 సిరీస్, BMW X1, BMW X3, BMW X4, BMW X5, BMW X7 మరియు కంట్రీమ్యాన్ వంటివి ఉన్నాయి. మొత్తానికి కంపెనీ ఇప్పుడు 1,00,000 మార్కుని చేరుకుంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో BMW కార్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది.

ఇదిలా ఉండగా BMW ఇండియా తన అప్డేటెడ్ బీఎండబ్ల్యూ X4 ఫేస్‌లిఫ్ట్‌ను త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల చేయనుంది. ఐతే కాకుడా కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ X సిరీస్ SUV యొక్క BMW X4 బ్లాక్ ఎడిషన్‌ను కూడా భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఇప్పుడు కంపెనీ భారతీయ మార్కెట్ కోసం BMW X4 బ్లాక్ ఎడిషన్ బుకింగ్ ప్రారంభించింది. ఈ కొత్త BMW X4 బ్లాక్ ఎడిషన్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు BMW ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, రూ.50,000 అడ్వాన్స్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు.

ఇటీవల కాలంలోనే కొత్త BMW X4 ఫేస్‌లిఫ్ట్ లాంచ్ గురించి కొంత సమాచారం వెల్లడైంది. దీని ప్రకారం, రెండవ తరం BMW X4 ఫేస్‌లిఫ్ట్ గత సంవత్సరం BMW X3 ఫేస్‌లిఫ్ట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయబడింది. ఇది అప్‌డేటెడ్ హెడ్‌లైట్లు, రీషేప్డ్ బంపర్‌లు, యూనిఫైడ్ కిడ్నీ గ్రిల్, షార్పర్ మరియు స్లిమ్మర్ రియర్ లైట్లు, కొత్త ఎగ్జాస్ట్ టిప్స్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఇవన్నీ కూడా దీనిని కొత్తగా కనిపించేలా చేస్తాయి.

త్వరలో విడుదల కానున్న BMW X4 బ్లాక్ ఎడిషన్ రెండు పెయింట్ స్కీమ్లతో అందించబడుతుంది. ఇందులో బ్రూక్లిన్ గ్రే మరియు బ్లాక్ సఫైర్ ఉన్నాయి. ఇవి రెండూ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇందులో 20-ఇంచెస్ జెట్ బ్లాక్ ఎమ్ స్పోర్ట్ అల్లాయ్ వీల్స్ ఉండే అవకాశం ఉంటుంది.

అంతే కాకుండా రానున్న ఈ కొత్త కారు రిఫ్రెష్ చేయబడిన క్యాబిన్ పొందుతుంది. ఇది రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో ప్రీమియం లెదర్ అపోల్స్ట్రే కూడా పొందుతుంది. దీనితో పాటు 12.3-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, బిఎండబ్ల్యు లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్‌తో కూడిన 12.3-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, హై-ఫై సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు యాంబియంట్ లైటింగ్ వాటి వాటిని పొందుతాయి.

కొత్త BMW X4 SUV పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్సన్స్ లో అందించబడతాయి. ఇందులో 2.0-లీటర్, నాలుగు-సిలిండర్, ట్విన్-టర్బో, పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 248 బిహెచ్‌పి పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ కూడా మంచి పనితీరుని అందిస్తుంది.

ఇది మంచి డిజైన్ మరియు పరికరాకను కలిగి ఉండటమే కాకుండా మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి. మొత్తం మీద ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల రానున్న కొత్త SUV మార్కెట్లో మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








