BMW i4 తెలుసుకోవలసిన విషయాలు ఇవే.. చూసారా..!!

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బిఎండబ్ల్యు' (BMW) ఇటీవల భారతీయ మార్కెట్లో తన 'ఐ4' (i4) ఎలక్ట్రిక్ కారుని అధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 69.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). దేశీయ మార్కెట్లో కంపెనీ iX xDrive40 ని విడుదల చేసిన తరువాత మార్కెట్లో లాంచ్ చేసిన రెండవ కారు ఈ బిఎండబ్ల్యు ఐ4 (BMW i4). మార్కెట్లో విడుదలైన ఈ కారులో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

BMW i4 తెలుసుకోవలసిన విషయాలు ఇవే.. చూసారా..!!

ఎక్స్టీరియర్ డిజైన్:

కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ కారు దాని 'బిఎండబ్ల్యు ఐ4 ఈడ్రైవ్40' ఆధారంగా రూపొందించబడింది. బిఎమ్‌డబ్ల్యూ ఐ4 దాని ICE-ఆధారిత కౌంటర్‌పార్ట్‌తో సమానంగా ఉండే డిజైన్‌ను కలిగి ఉంటుంది. కానీ ఇది ప్రత్యేకమైన EV టచ్‌లను పొందుతుంది. ఇందులో ఫ్రంట్ కిడ్నీ గ్రిల్, 10-టైప్స్ యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్, ఫ్రంట్ లిప్ స్పాయిలర్, 17 ఇంచ్ ఏరోడైనమిక్ ఆప్టిమైజ్డ్ వీల్స్, బ్లూ యాక్సెంట్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ వంటివి ఉన్నాయి.

BMW i4 తెలుసుకోవలసిన విషయాలు ఇవే.. చూసారా..!!

అంతే కాకుండా ఇందులో ఎక్కువ భాగం ఏరోడైనమిక్స్, కూలింగ్ సిస్టమ్ మరియు అత్యధిక రేంజ్ అందించడానికి కావలసిన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కంపెనీ దృష్టి పెట్టింది. కావున ఇది మంచి పరిధిని కూడా తప్పకుండా అందిస్తుంది.

BMW i4 తెలుసుకోవలసిన విషయాలు ఇవే.. చూసారా..!!

ఇంటీరియర్ ఫీచర్స్:

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ సెడాన్ రెండు ఇంటీరియర్ టోన్ ఎంపికలతో అందించబడుతుంది. ఇందులో ఒకటి కాన్‌బెర్రా బీజ్ బ్లాక్ మరియు కాగ్నాక్ బ్లాక్ వంటివి ఉన్నాయ్. అయితే ఇందులోని సీట్లు సెన్సాటెక్ సింథటిక్ లెదర్ అప్హోల్స్టరీని కలిగి ఉన్నాయి. ఇంటీరియర్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

BMW i4 తెలుసుకోవలసిన విషయాలు ఇవే.. చూసారా..!!

క్యాబిన్‌లో ఓక్ గ్రెయిన్ వుడ్ ట్రిమ్, యాంబియంట్ లైటింగ్‌తో కూడిన డైనమిక్ కాంటౌర్ లైటింగ్ కూడా మీరు పొందవచ్చు. ఇందులో 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 14.9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటాయి. డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్ యొక్క రెండు సెట్టింగులతో పవర్డ్ ఫ్రంట్ సీట్ మరియు మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ స్టీరింగ్‌ను పొందుతుంది.

BMW i4 తెలుసుకోవలసిన విషయాలు ఇవే.. చూసారా..!!

అంతే కాకుండా ఇందులో త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎల్ఈడి యాంబియెంట్ లైటింగ్, సన్‌రూఫ్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్ మరియు 17-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

BMW i4 తెలుసుకోవలసిన విషయాలు ఇవే.. చూసారా..!!

కొలతలు:

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బిఎండబ్ల్యు ఐ4 ఎలక్ట్రిక్ సెడాన్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,785 మిమీ, వెడల్పు 1,852 మీమీ వరకు ఉంటుంది. అదేవిధంగా దీని ఎత్తు 1,448 మిమీ కాగా, వీల్ బేస్ 2,856 మిమీ వరకు ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది 125 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. బిఎండబ్ల్యు ఐ4 ఎలక్ట్రిక్ సెడాన్ బరువు 2,125 కేజీలు. అయితే పనితీరు పరంగా చాలా అద్భుతమైన సెడాన్.

BMW i4 తెలుసుకోవలసిన విషయాలు ఇవే.. చూసారా..!!

ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ &రేంజ్:

BMW i4 eDrive40 ఎలక్ట్రిక్ కారు 83.9kWh బ్యాటరీ ప్యాక్‌ పొందుతుంది. ఇది 335 బిహెచ్‌పి పవర్ మరియు 430 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే, ఇది 205kW ఛార్జర్ తో కేవలం 10 నిమిషాల్లో 164 కిమీ రేంజ్‌కు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోగలదు.

BMW i4 తెలుసుకోవలసిన విషయాలు ఇవే.. చూసారా..!!

ఇక 11kW AC ఛార్జింగ్‌ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి 8.25 గంటల సమయం పడుతుంది. అయితే 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌కు కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీ ప్యాక్‌ను కేవలం 83 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో ఏకంగా 590 కిమీ పరిధిని అందిస్తుందని ధృవీకరించబడింది. అంతే కాకూండా దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ. అయితే ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, May 30, 2022, 13:27 [IST]
English summary
Bmw i4 edrive40 electric car top things to know exterior interior features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+