BMW i4 కి స్వాగతం.. సుస్వాగతం..! ఇది భారత్‌లోనే అత్యధిక రేంజ్‌ను అందించే ఎలక్ట్రిక్ కార్..!!

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో మరో కొత్త కారును విడుదల చేసింది. ఈ బ్రాండ్ తమ అధునాతన ఎలక్ట్రిక్ కారు బిఎమ్‌డబ్ల్యూ ఐ4 (BMW i4) ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం, భారతదేశంలో కెల్లా అత్యధిక రేంజ్ ను అందించే ఎలక్ట్రిక్ కారు కూడా ఇదే. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది పూర్తి చార్జ్ పై 590 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ ఐ4 సెడాన్ రూపంలో లభించే ఎలక్ట్రిక్ కారు మరియు భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.69.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

BMW i4 కి స్వాగతం.. సుస్వాగతం..! ఇది భారత్‌లోనే అత్యధిక రేంజ్‌ను అందించే ఎలక్ట్రిక్ కార్..!!

బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ మాదిరిగానే, ఐ4 కూడా CLAR ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది మరియు ఇది శక్తివంతమైన 83.9 kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో వెనుక భాగంలో అమర్చిన రియర్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 340 hp శక్తిని మరియు 430 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కారు కేవలం 5.7 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 190 కిలోమీటర్లకు ఎలక్ట్రానిక్ గా పరిమితం చేయబడి ఉంటుంది.

BMW i4 కి స్వాగతం.. సుస్వాగతం..! ఇది భారత్‌లోనే అత్యధిక రేంజ్‌ను అందించే ఎలక్ట్రిక్ కార్..!!

ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు BMW iX మాదిరిగా కాకుండా, ఇది EV-నిర్దిష్ట ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉండదు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇది eDrive40 మరియు M50 xDrive అనే రెండు వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో eDrive40 మరియు M50 xDrive ట్రిమ్‌ల గరిష్ట పవర్ అవుట్‌పుట్ వరుసగా 340 hp మరియు 544 hp గా ఉంటుంది. కాగా, భారత మార్కెట్లో కేవలం ఇడ్రైవ్40 మోడల్ ను మాత్రమే విడుదల చేసింది. పెర్ఫార్మెన్స్ వేరియంట్ ప్రస్తుతానికి మన మార్కెట్లో విడుదల కాలేదు.

BMW i4 కి స్వాగతం.. సుస్వాగతం..! ఇది భారత్‌లోనే అత్యధిక రేంజ్‌ను అందించే ఎలక్ట్రిక్ కార్..!!

సిబియూ (CBU, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా కంపెనీ ఈ కారును భారత మార్కెట్లోకి దిగుమతి చేసుకొని విక్రయిస్తుంది. ఇది చూడటానికి 4-సిరీస్ మోడల్ ను ఆధారంగా చేసుకొని తయారు చేసినట్లు ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ ఐ4 దాని ICE-ఆధారిత కౌంటర్‌పార్ట్‌తో సమానంగా ఉండే డిజైన్‌ను కలిగి ఉంటుంది, అయితే ఇది ప్రత్యేకమైన EV టచ్‌లను పొందుతుంది. ఈ మార్పులలో ఎక్కువ భాగం ఏరోడైనమిక్స్, కూలింగ్ సిస్టమ్ మరియు సాధ్యమైన అత్యధిక రేంజ్ ను అందించడానికి సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది.

BMW i4 కి స్వాగతం.. సుస్వాగతం..! ఇది భారత్‌లోనే అత్యధిక రేంజ్‌ను అందించే ఎలక్ట్రిక్ కార్..!!

డిజైన్ ఎలిమెంట్స్ లో ఫ్రంట్ కిడ్నీ గ్రిల్, 10-దశల యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్, ఫ్రంట్ లిప్ స్పాయిలర్, 17 ఇంచ్ ఏరోడైనమిక్ ఆప్టిమైజ్డ్ వీల్స్, బ్లూ యాక్సెంట్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ వంటివి హైలైట్ గా నిలుస్తాయి. ఇంటీరియర్స్ లో ఇది ఐఎక్స్ ఎస్‌యూవీ మాదిరిగా కాకుండా, సాధారణ 4 సిరీస్ కూపే యొక్క క్యాబిన్ లేఅవుట్ మరియు డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ డ్యాష్‌బోర్డులో వంపు తిరిగిన ట్విన్-స్క్రీన్ సెటప్‌ ఉంటుంది. ఇందులో 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 14.9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటాయి.

BMW i4 కి స్వాగతం.. సుస్వాగతం..! ఇది భారత్‌లోనే అత్యధిక రేంజ్‌ను అందించే ఎలక్ట్రిక్ కార్..!!

ఈ కారులో BMW యొక్క లేటెస్ట్ iDrive 8 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో పాటుగా, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు మరియు Android Auto మరియు Apple CarPlay వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉంటాయి. డ్రైవర్ సౌలభ్యం మరియు వాహన స్థిరత్వం కోసం, కంపెనీ ఈ కారులో వెనుక ఎయిర్ సస్పెన్షన్ మరియు లిఫ్ట్-సంబంధిత డంపర్‌లను అమర్చింది. ఈ మోడల్ ఇతర హైలైట్ ఫీచర్లలో త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎల్ఈడి యాంబియెంట్ లైటింగ్, సన్‌రూఫ్, కెమెరాతో కూడిన రివర్స్ పార్కింగ్ అసిస్ట్ మరియు 17-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

BMW i4 కి స్వాగతం.. సుస్వాగతం..! ఇది భారత్‌లోనే అత్యధిక రేంజ్‌ను అందించే ఎలక్ట్రిక్ కార్..!!

చార్జింగ్ విషయానికి వస్తే, BMW i4 ఎలక్ట్రిక్ కారును 205kW ఛార్జర్ తో కేవలం 10 నిమిషాల్లో 164 కిమీ రేంజ్‌కు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. అలాగే, ఇది 11kW AC ఛార్జింగ్‌ ను సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో ఈ లిథియం-అయాన్ ప్యాక్‌ను 8.25 గంటల్లో 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అదే 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌కు కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీ ప్యాక్‌ను కేవలం 83 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.

BMW i4 కి స్వాగతం.. సుస్వాగతం..! ఇది భారత్‌లోనే అత్యధిక రేంజ్‌ను అందించే ఎలక్ట్రిక్ కార్..!!

కొత్త BMW i4 ఎలక్ట్రిక్ సెడాన్ 4,785mm పొడవు, 1,852mm వెడల్పు మరియు 1,448mm ఎత్తును కలిగి ఉండి, 2,856mm వీల్ బేస్‌ను కలిగి ఉంటుంది. కాగా, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 125mm గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ బరువు 2,125 కిలోగ్రాములు. ఇది ఈ విభాగంలోని ఇతర హై-ఎండ్ ఎలక్ట్రిక్ కార్లతో పోటీ పడుతుంది. BMW i4 మొదటిసారిగా 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో BMW i విజన్ డైనమిక్స్ కాన్సెప్ట్‌గా ఆవిష్కరించారు. ఆ తర్వాత 3 సంవత్సరాలకు 2020లో దీనిని ఐ4 కాన్సెప్ట్ గా పరిచయం చేశారు.

More from DriveSpark

Article Published On: Thursday, May 26, 2022, 15:01 [IST]
English summary
Bmw i4 electric sedan launched in india price starts at rs 69 90 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+