BMW కార్లు మరింత ఖరీదైనవిగా మారాయి.. ఇందులో ఉన్న మోడల్స్ ఇవే

భారతీయ మార్కెట్లో ఇప్పటికే చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను 2022 ప్రారంభం నుంచి పెంచాయి. అయితే ఇప్పుడు ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బిఎండబ్ల్యు ఇండియా' (BMW India) కూడా ఇదే మార్గంలో పయనించింది. కంపెనీ ఎంపిక చేసిన తమ ఉత్పత్తుల ధరలను ఈ సంవత్సరం జనవరి నుంచి దాదాపు రూ. 2 లక్షల వరకు పెంచినట్లు తెలిపింది. దీని గురించి మరింత సమాచారం వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

BMW కార్లు మరింత ఖరీదైనవిగా మారాయి.. ఇందులో ఉన్న మోడల్స్ ఇవే

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, BMW X5 40d xLine మరియు 40i MSport ధరలు ఇప్పుడు సుమారు రూ.2 లక్షల వరకు పెరిగాయి. అంతే కాకూండా BMW యొక్క 7 సిరీస్ శ్రేణిలో BMW 730Ld DPE సిగ్నేచర్ మరియు 740 Li M స్పోర్ట్ ధరలు కూడా రూ. 2 లక్షలు పెరిగాయి.

BMW కార్లు మరింత ఖరీదైనవిగా మారాయి.. ఇందులో ఉన్న మోడల్స్ ఇవే

కంపెనీ యొక్క BMW M340i ధర మునుపటికంటే రూ. 2 లక్షలు పెరిగింది. అయితే BMW 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ శ్రేణి ధరలు మాత్రమే రూ. 1.60 లక్షలు పెరిగాయి. ఇందులో స్టాండర్డ్ 3 సిరీస్ వేరియంట్ యొక్క ఎంపిక చేసిన వేరియంట్‌ల ధరలు కేవలం రూ. 50,000 పెరిగాయి.

BMW కార్లు మరింత ఖరీదైనవిగా మారాయి.. ఇందులో ఉన్న మోడల్స్ ఇవే

వీటితో పాటు కంపెనీ యొక్క BMW 2 సిరీస్ గ్రాన్ కూపే ధరలు రూ. 60,000 వరకు పెరిగాయి. అంతే కాకుండా BMW X1 20i SportX మరియు BMW xLine వేరియంట్‌ల ధర ఇప్పుడు మునుపటికంటే కూడా రూ. 40,000 ఎక్కువ ఖరీదైనవిగా మారాయి.

BMW కార్లు మరింత ఖరీదైనవిగా మారాయి.. ఇందులో ఉన్న మోడల్స్ ఇవే

BMW యొక్క 5 సిరీస్‌కి వేరియంట్ లైనప్‌లో రూ. 50,000 పెరిగింది. ఇక BMW 6 సిరీస్ శ్రేణిలోని 630d M స్పోర్ట్ ధరలు రూ. 30,000 వరకు పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత వీటి ప్రారంభ ధరలు కూడా అమాంతం పెరిగాయి, కావున ఇది వాహన కొనుగోలుదారులపైనా ఏమైనా ప్రభావం చూపుతుందా అనే విషయం తెలియాలి.

BMW కార్లు మరింత ఖరీదైనవిగా మారాయి.. ఇందులో ఉన్న మోడల్స్ ఇవే

ఇదిలా ఉండగా బిఎండబ్ల్యు ఇండియా యొక్క BMW X7, BMW X6, BMW X5M, BMW X4, BMW 8 Series, BMW iX, BMW Z4, BMW M2, BMW M5 మరియు BMW M8 ధరలలో ఎటువంటి మార్పు లేదు. దీనిని వాహన కొనుగోలుదారులు తప్పకుండా గమనించాలి. అంతే కాకూండా SUV యొక్క LCI వేరియంట్ల ధరలలో కూడా ఎటువంటి మార్పు లేదు.

BMW కార్లు మరింత ఖరీదైనవిగా మారాయి.. ఇందులో ఉన్న మోడల్స్ ఇవే

ఇదిలా ఉండగా జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన బిఎండబ్ల్యు (BMW) భారతీయ మార్కెట్లో ఇటీవల కొత్త 'బిఎండబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ కూపే' విడుదల చేసింది. ఈ కొత్త కారు ధర దేశీయ మార్కెట్లో రూ. 1.44 కోట్లు (ఎక్స్-షోరూమ్).

BMW కార్లు మరింత ఖరీదైనవిగా మారాయి.. ఇందులో ఉన్న మోడల్స్ ఇవే

దేశీయ విఫణిలో విడుదలైన ఈ కొత్త బిఎండబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ కూపే స్కైస్క్రాపర్ గ్రే, పోర్టిమావో బ్లూ, బ్లాక్ సఫైర్, సావో పాలో ఎల్లో, టొరంటో రెడ్ మరియు ఆల్పైన్ వైట్ అనే మెటాలిక్ పెయింట్ స్కీమ్స్ లో మరియు టాంజానైట్ బ్లూ, ద్రావిడ్ గ్రే, అవెంచురిన్ రెడ్, ఫ్రోజెన్ బ్రిలియంట్ వైట్ మరియు ఫ్రోజెన్ పోర్టిమావో బ్లూ అనే ఇండ్యూజువల్ పెయింట్ స్కీమ్స్ లో అందుబాటులో ఉంటుంది.

BMW కార్లు మరింత ఖరీదైనవిగా మారాయి.. ఇందులో ఉన్న మోడల్స్ ఇవే

సరికొత్త బిఎండబ్ల్యు ఎమ్M4 కాంపిటీషన్‌లో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం హెడ్ మరియు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు అలాగే వెనుక సీట్ల కోసం హెడ్ ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉంటాయి. అంతే కాకూండా, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్, M డైనమిక్ మోడ్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ బ్రేక్ కంట్రోల్ మరియు డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

BMW కార్లు మరింత ఖరీదైనవిగా మారాయి.. ఇందులో ఉన్న మోడల్స్ ఇవే

ఇందులో కొత్త 3.0-లీటర్ స్ట్రెయిట్-సిక్స్ యూనిట్ BMW M GmbH ఇంజిన్‌ల యొక్క హాల్‌మార్క్ హై-రివింగ్ క్యారెక్టర్‌ని లేటెస్ట్ వెర్షన్ M ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీతో మిళితం చేస్తుంది. ఈ ఇంజిన్ 2,750 - 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 510 బిహెచ్‌పి పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఈ కారు కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 12, 2022, 11:13 [IST]
English summary
Bmw india increased price up to 2 lakhs for its selected models details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+