భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ 50 జహ్రే ఎమ్ ఎడిషన్ (BMW 6 Series 50 Jahre M Edition) విడుదల
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ (BMW) భారతదేశంలో విక్రయిస్తున్న 6-సిరీస్ (6-Series) లో ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్ ను విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ 50 జహ్రే ఎమ్ ఎడిషన్‌ను (BMW 6 Series 50 Jahre M Edition) పేరుతో కంపెనీ ఈ ప్రత్యేకమైన కారును విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ స్పెషల్ ఎడిషన్ కారు ధర రూ. 72.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది మరియు పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ 50 జహ్రే ఎమ్ ఎడిషన్‌ను కంపెనీ యొక్క హై-పెర్ఫార్మెన్స్ బ్రాండ్ ఎమ్ ఎడిషన్ (M Edition) యొక్క 50 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తయారు చేయబడింది. ఈ పేరులో 50 అనేది ఎమ్ బ్రాండ్ యొక్క 50 ఏళ్ల వారసత్వాన్ని సూచిస్తుంది. ఈ 50 జహ్రే ఎడిషన్ వెలుపలి భాగంలో వివిధ కొత్త డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. కంపెనీ ఈ ప్రత్యేకమైన కారును స్టాండర్డ్ 6-సిరీస్ మోడల్ ను ఆధారంగా చేసుకొని రూపొందించింది.

ఆసక్తిగల కస్టమర్లు ఈ కారును బిఎమ్‌డబ్ల్యూ షోరూమ్ నుండి బుక్ చేసుకోవచ్చు. ఇందులో క్లాసిక్ 'బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్' లోగో నుండి ప్రేరణ పొందిన M లోగో ఉంటుంది. ఈ లోగో వీల్ క్యాప్‌లో కూడా కనిపిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ కారు టాంజానైట్ బ్లూ మెటాలిక్, ఎమ్ కార్బన్ బ్లాక్, బెర్నినా గ్రే అంబర్ ఎఫెక్ట్ మరియు మినరల్ వైట్ అనే కలర్ ఆప్షన్లలలో లభిస్తుంది. కొనుగోలుదారులు M యాక్సెసరీస్ ప్యాకేజీతో ఈ కారును మరింత స్పోర్టీగా మార్చుకోవచ్చు.

ఈ మోటార్‌స్పోర్ట్ యాక్సెసరీస్ ప్యాకేజీ కారు యొక్క బాహ్య భాగాన్ని పూర్తిగా మార్చివేసి దానికి మరింత అగ్రెసివ్ స్టైలింగ్ ను జోడిస్తుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జహ్రే ఎడిషన్ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో హై గ్లోస్ బ్లాక్‌లో ఫినిష్ చేయబడిన బిఎమ్‌డబ్ల్యూ కిడ్నీ గ్రిల్, కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ లో ఉండే కీ ఫోబ్ మరియు అల్కాంటారా లెథర్ అప్‌హోలెస్ట్రీ మరియు జెట్ బ్లాక్‌లో ఫినిష్ చేయబడిన 19 ఇంచ్ 647ఎమ్ లైట్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి.

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, క్యాబిన్ లోపల న్యాచురల్ లెదర్ తో తయారు చేయబడిన సీట్‌బెల్ట్‌లు, స్పోర్ట్స్ సీట్లు, డ్రైవర్ మరియు ప్రయాణీకుల సీటు కోసం మెమరీ ఫంక్షన్, వెనుక భాగంలో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల బ్యాక్‌రెస్ట్ యాంగిల్ మరియు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల రోలర్ సన్ బ్లైండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటుగా స్టాండర్డ్ 6-సిరీస్ లో లభించే మరిన్ని ఇతర ఫీచర్లను ఇందులో కూడా గమనించవచ్చు.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ 50 జహ్రే ఎమ్ ఎడిషన్‌ను (BMW 6 Series 50 Jahre M Edition) లో శక్తివంతమైన 2.0-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 258 బిహెచ్‌పి శక్తిని మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇంజన్ నుంచి వచ్చే శక్తిని వెనుక చక్రాలకు (రియర్ వీల్ డ్రైవ్ యూనిట్) పంపిణీ చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ కారణంగా బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ 50 జహ్రే ఎమ్ ఎడిషన్ కేవలం 6.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి మోడల్ విడుదల..
ఇదిలా ఉంటే, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా గడచిన ఏప్రిల్ నెలలో దేశీయ మార్కెట్లో తమ కొత్త 2022 మోడల్ 2021 బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాండ్ టురిస్మో (జిటి) ని విడుదల చేసింది. ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటిలో స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో పాటుగా కొన్ని అదనపు ఫీచర్లను కూడా జోడించారు. భారత మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ. 67.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్‌ను ఒక పెట్రోల్, రెండు డీజిల్ ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి మోడల్ అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, బిఎమ్‌డబ్ల్యూ లైవ్ కాక్‌పిట్, బిఎమ్‌డబ్ల్యూ వర్చువల్ అసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్, రియర్ సీట్ ఎంటర్‌టైన్మెంట్ స్క్రీన్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ పార్కింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ సీట్, పానోరమిక్ సన్‌రూఫ్ మరియు ఎయిర్ సస్పెన్షన్ వంటి చాలా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ కారులో కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేవు. లేటెస్ట్ ఆటోమొబైల్స్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








