BMW విడుదల చేసిన కొత్త M340i సెడాన్.. ఇదే: ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో బిఎండబ్ల్యు కంపెనీ తన M340i సెడాన్ విడుదల చేసింది. ఈ 2023 బిఎండబ్ల్యు ఎమ్340ఐ సెడాన్ ధర రూ. 62.9 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త సెడాన్ డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ పర్ఫామెన్స్ వంటి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. రండి.

బిఎండబ్ల్యు విడుదల చేసిన ఈ కొత్త M340i సెడాన్ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. డెలివరీలు 2023 జనవరి నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిజానికి BMW 3 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ 2022 ప్రారంభంలోనే గ్లోబల్ అరంగేట్రం చేసింది. అయితే దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ M340i సెడాన్ అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి చూడగానే చూపరులను వెంటనే ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

BMW విడుదల చేసిన కొత్త M340i సెడాన్

బిఎండబ్ల్యు M340i లగ్జరీ సెడాన్ మూడు కలర్ ఆప్సన్స్ లో విడుదలైంది. అవి ద్రవిట్ గ్రే, సన్‌సెట్ ఆరెంజ్ మరియు టాంజానైట్ బ్లూ కలర్స్. ఈ మూడు కలర్స్ కూడా చూడచక్కగా ఉంటాయి. ఇక డిజైన్ విషయానికి వస్తే, ఇందులో సన్నగా ఉండే హెడ్‌ల్యాంప్‌లు, రీ డిజైన్ గ్రిల్ మరియు రియర్ బంపర్ పొందుతుంది. ఇందులో 19-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఈ సెడాన్ కి మరింత అట్రాక్టివ్ లుక్ ఇస్తుంది.

కొత్త BMW M340i సెడాన్ ఇప్పుడు చాలా ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున ఇందులో సింగిల్-పీస్ కర్వ్డ్ డిస్‌ప్లేతో అప్‌డేట్ చేయబడిన డాష్‌బోర్డ్‌ను పొందుతుంది. స్క్రీన్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో 16 స్పీకర్లు 464W డిజిటల్ యాంప్లిఫైయర్‌తో ప్రీమియం హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడింది.

BMW విడుదల చేసిన కొత్త M340i సెడాన్

యొక్క ఇంటీరియర్ కూడా 2023 మోడల్ సంవత్సరానికి చాలా కొన్ని మార్పులకు గురైంది. నవీకరించబడిన M340i ట్విన్ డ్రైవర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేలను కలిగి ఉన్న పెద్ద గాజు పేన్‌ను కలిగి ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ప్రీమియం హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్‌ 16 స్పీకర్లు, 464W డిజిటల్ యాంప్లిఫైయర్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. మొత్తం ఇందులోని ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటాయి.

BMW M340i సెడాన్ 3.0-లీటర్, ఇన్‌లైన్-సిక్స్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది 5,500 మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 368.8 బిహెచ్‌పి పవర్ మరియు 1,900 మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 500 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇందులోని 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ చేయబడుతుంది.

BMW విడుదల చేసిన కొత్త M340i సెడాన్

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త M340i సెడాన్ కేవలం 4.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ అని నిర్దారించబడింది. BMW M340i లగ్జరీ సెడాన్ కి దేశీయ మార్కెట్లో ఆడి S5 స్పోర్ట్‌బ్యాక్ ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అయితే ఈ సెడాన్ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే సమాచారం మాత్రం త్వరలో తెలుస్తుంది.

ఇదిలా ఉండగా బిఎండబ్ల్యు దేశీయ మార్కెట్లో 'ఎక్స్ఎమ్' ఎస్‌యువి విడుదల చేసింది. 'బిఎండబ్ల్యు ఎక్స్ఎమ్' ధర రూ. 2.60 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది S68 ట్విన్ టర్బోచార్జ్డ్ 4.4 లీటర్ V8 ఇంజన్ మరియు ఒక ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఇది 644 బిహెచ్‌పి పవర్ మరియు 800 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తాయి. ఈ కొత్త బిఎండబ్ల్యు ఎక్స్ఎమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Saturday, December 10, 2022, 18:14 [IST]
English summary
Bmw m340i sedan launched in india at rs 62 9 lakhs details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+