భారత్‌లో 'BMW M4 Competition Coupe' విడుదల: ధర & వివరాలు

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎండబ్ల్యు (BMW) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు కొత్త 'బిఎండబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ కూపే' (BMW M4 Competition Coupe) విడుదల చేసింది. ఈ కొత్త కారు ధర దేశీయ మార్కెట్లో రూ. 1.44 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ హై-ఎండ్ పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ కారు పూర్తిగా బిల్ట్-అప్ యూనిట్ (CBU)గా భారత మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త లగ్జరీ కారు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో 'BMW M4 Competition Coupé' విడుదల: ధర & వివరాలు

దేశీయ విఫణిలో విడుదలైన ఈ కొత్త బిఎండబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ కూపే స్కైస్క్రాపర్ గ్రే, పోర్టిమావో బ్లూ, బ్లాక్ సఫైర్, సావో పాలో ఎల్లో, టొరంటో రెడ్ మరియు ఆల్పైన్ వైట్ అనే మెటాలిక్ పెయింట్ స్కీమ్స్ లో మరియు టాంజానైట్ బ్లూ, ద్రావిడ్ గ్రే, అవెంచురిన్ రెడ్, ఫ్రోజెన్ బ్రిలియంట్ వైట్ మరియు ఫ్రోజెన్ పోర్టిమావో బ్లూ అనే ఇండ్యూజువల్ పెయింట్ స్కీమ్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కొత్త ఎమ్4 కాంపిటీషన్ వివిధ రకాల అపోల్స్ట్రే ఆప్సన్ కూడా పొందుతుంది.

భారత్‌లో 'BMW M4 Competition Coupé' విడుదల: ధర & వివరాలు

'బిఎండబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ కూపే' (BMW M4 Competition Coupe) అద్భుతమైన డిజైన్ పొందుతుంది. దీని ఇందులో బాడీ డిజైన్‌లో లార్జ్, వర్టికల్ గా ఉండే ఉండే బిఎండబ్ల్యు కిడ్నీ గ్రిల్ ఉంటుంది. అంతే కాకూండా హారిజాంటల్ డిజైన్‌లో హాల్‌మార్క్ డబుల్ బార్, ఆకర్షణీయమైన వీల్ ఆర్చ్‌లు కూడా ఉన్నాయి.

భారత్‌లో 'BMW M4 Competition Coupé' విడుదల: ధర & వివరాలు

ఈ కొత్త లగ్జరీ కారు యొక్క సైడ్ ప్రొఫైల్ విస్తరించబడి ఉండి, రియర్ ఆప్రాన్ కోసం అటాచ్‌మెంట్ పార్ట్స్ పొందుతుంది. ఇందులో అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు బిఎండబ్ల్యు లేజర్‌లైట్‌ వంటివి కూడా స్టాండర్డ్ గా అందుబటులో ఉంటాయి. రియర్ మిర్రర్స్ ఏరోడైనమిక్‌గా ఆప్టిమైజ్ చేయబడి ఉంటాయి. వీటితో పాటి కారు ఏరోడైనమిక్‌గా ఆప్టిమైజ్ చేయబడిన ఫిన్స్, రియర్ స్పాయిలర్ మరియు బ్లాక్ క్రోమ్‌లో రెండు జతల ఎగ్జాస్ట్ టెయిల్‌పైప్‌లను కూడా పొందుతుంది.

భారత్‌లో 'BMW M4 Competition Coupé' విడుదల: ధర & వివరాలు

ఎమ్4 కాంపిటీషన్ కూపే యొక్క ఇంటీరియర్‌ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఎలక్ట్రికల్-అడ్జస్టబుల్ ఎమ్-స్పోర్ట్ సీట్లు మరియు కార్బన్ ఫైబర్ ట్రిమ్‌తో ప్రామాణికంగా ఎమ్ లెదర్ 'మెరినో' ఉన్నాయి. ఇది కాకుండా, ఎమ్-సీట్ బెల్ట్, స్టీరింగ్ వీల్ కోసం మల్టీఫంక్షన్, లంబర్ సపోర్ట్‌తో సీట్ హీటింగ్ (డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్), మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్ట్‌మెంట్ మరియు అన్ని మిర్రర్‌లలో ఆటోమేటిక్ యాంటీ-డాజిల్ ఫంక్షన్ వంటి ప్రత్యేకమైన ఫంక్షన్‌లు ఇంటీరియర్‌కు మరింత స్పోర్టీ టచ్‌ని అందిస్తాయి.

భారత్‌లో 'BMW M4 Competition Coupé' విడుదల: ధర & వివరాలు

ఈ లగ్జరీ కారులోని అల్ట్రా-లైట్ హై-టెక్ కార్బన్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ పాలిమర్ (CFRP) సన్‌రూఫ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆటోమేటిక్ 3-జోన్ ఎయిర్ కండిషనింగ్ కూడా ఇందులో ఉంటుంది. ఇది అడాప్టివ్ M-స్పెసిఫిక్ సస్పెన్షన్, M స్పోర్ట్ డిఫరెన్షియల్, M హై పెర్ఫార్మెన్స్ కాంపౌండ్ బ్రేక్‌లు మరియు 19"/20" M ఫోర్జ్డ్ వీల్స్ డబుల్-స్పోక్ స్టైల్ 826 M బైకలర్ బ్లాక్‌తో అమర్చబడి ఉంటుంది.

భారత్‌లో 'BMW M4 Competition Coupé' విడుదల: ధర & వివరాలు

ఇవి మాత్రమే కాకుండా ఇందులో యాక్టివ్ సీట్ వెంటిలేషన్, ఎమ్ రేస్‌ట్రాక్ ప్యాకేజీ, ఎమ్ కార్బన్ ఎక్స్‌టీరియర్ ప్యాకేజీ, ఎమ్ డ్రైవ్ ప్రొఫెషనల్, ఎమ్ కాంపౌండ్ బ్రేక్ రెడ్ హై గ్లోస్ వంటి ఆప్సనల్ ఆఫర్‌ల ద్వారా మొత్తం అనుభవాన్ని మెరుగుపరచుకోవడానికి కస్టమర్‌లు మరిన్ని పరికరాలను జోడించవచ్చు.

భారత్‌లో 'BMW M4 Competition Coupé' విడుదల: ధర & వివరాలు

ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని కూడా ఇస్తాయి. ఎమ్4 కాంపిటీషన్ కూపేలో M హై పెర్ఫార్మెన్స్ కాంపౌండ్ బ్రేక్‌లు మరియు 19"/20" M ఫోర్జ్డ్ వీల్స్ డబుల్-స్పోక్ స్టైల్ 826 M బైకలర్ బ్లాక్‌ని స్టాండర్డ్ ప్రొఫైల్‌లో అమర్చారు.

భారత్‌లో 'BMW M4 Competition Coupé' విడుదల: ధర & వివరాలు

సరికొత్త బిఎండబ్ల్యు ఎమ్M4 కాంపిటీషన్‌లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం హెడ్ మరియు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు అలాగే వెనుక సీట్ల కోసం హెడ్ ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉంటాయి. అంతే కాకూండా, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్, M డైనమిక్ మోడ్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ బ్రేక్ కంట్రోల్ మరియు డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రయాణికుల యొక్క భద్రతను నిర్దారిస్తాయి.

భారత్‌లో 'BMW M4 Competition Coupé' విడుదల: ధర & వివరాలు

ఇందులో కొత్త 3.0-లీటర్ స్ట్రెయిట్-సిక్స్ యూనిట్ BMW M GmbH ఇంజిన్‌ల యొక్క హాల్‌మార్క్ హై-రివింగ్ క్యారెక్టర్‌ని లేటెస్ట్ వెర్షన్ M ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీతో మిళితం చేస్తుంది. ఈ ఇంజిన్ 2,750 - 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 510 బిహెచ్‌పి పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఈ కారు కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 10, 2022, 19:03 [IST]
English summary
Bmw m4 competition coupe launched in india price features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+