కొత్త X4 Facelift విడుదల చేసిన BMW.. ధర రూ. 70.50 లక్షలు
బిఎండబ్ల్యు ఇండియా (BMW India) దేశీయ మార్కెట్లో తన కొత్త 'బిఎండబ్ల్యు ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్' (BMW X4 Facelift) విడుదల చేసింది. దీని ధర రూ. 70.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ ఈ కొత్త ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది. కావున కస్టమర్లు రూ. 50,000 చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త కారు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన బిఎండబ్ల్యు ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి xDrive 30i M Sport Dark Shadow Edition కాగా మరొకటి xDrive 30d M Sport Dark Shadow Edition. వీటి ధరలు వరుసగా రూ. 70.50 లక్షలు మరియు రూ. 72.50 లక్షలు.

BMW కంపెనీ ఈ కొత్త ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ అనేక అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కొత్త BMW X4 ఫేస్‌లిఫ్ట్ SUV చెన్నైలోని కంపెనీ ఫ్యాక్టరీలో తయారు చేయబడుతుంది. X4 ఫేస్‌లిఫ్ట్ దాని మునుపటి కంటే స్పోర్టియర్‌గా ఉంది. ఇది బ్రూక్లిన్ గ్రే, మినరల్ వైట్ మరియు బ్లాక్ సఫైర్ వంటి కొత్త ఆకర్షణీయమైన పెయింట్ స్కీమ్‌లలో అడాప్టివ్ LED హెడ్‌లైట్లు మరియు కొత్త 19-ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో అందించబడుతుంది.

అంతే కాకూండా ఇది పెద్ద కిడ్నీ గ్రిల్, సన్నని LED టెయిల్ లైట్లు, కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లను పొందుతుంది. BMW X4 పూర్తిగా బ్లాక్ కలర్ స్కీమ్‌తో వచ్చే బ్లాక్ షాడో ఎడిషన్‌లో తీసుకురాబడింది. దీని గ్రిల్, వింగ్ మిర్రర్స్, ఎగ్జాస్ట్ పైప్ మరియు వీల్స్ గ్లోస్ యాక్సెంట్‌లలో ఉంచబడ్డాయి.

X4 ఫేస్‌లిఫ్ట్ అప్‌గ్రేడ్ చేయబడిన 12.3-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12.3-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో BMW లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్స్-అప్ డిస్ప్లే, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు 6 కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి వాటిని పొందుతుంది.

BMW X4 ఫేస్‌లిఫ్ట్ ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్, ESC, డైనమిక్ డంపర్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ వంటి వాటిని పొందుతుంది.

BMW X4 ఫేస్‌లిఫ్ట్ 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 252 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

ఇక ఇందులోని 3.0-లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ డీజిల్ ఇంజన్ 265 బిహెచ్‌పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు జత చేయబడి ఉంటాయి. అంతే కాకుండా ఇందులో BMW యొక్క xDrive ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా ప్రామాణికంగా పొందుతుంది. BMW X4 దేశీయ మార్కెట్లో Mercedes-Benz GLC కూపే కి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది.

BMW కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను తీసుకువస్తూనే ఉంది, తమ కస్టమర్లను ఎప్పటికప్పుడు ఆకర్శించడానికి మరియు మార్కెట్లో తమ ఉనికిని నిరంతరం చాటుకోవడానికి కొత్త ఉత్పత్తులను భారతీయ మార్కెట్లో విడుదలచేస్తోంది.

ఇటీవల కంపెనీ చెన్నై ప్లాంట్ నుండి స్థానికంగా ఉత్పత్తి చేయబడిన 1,00,000 వ BMW కారును విడుదల చేసింది. ఈ సందర్భంగా బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తమ బిఎమ్‌డబ్ల్యూ 740ఎల్ఐ ఎమ్ స్పోర్ట్ ఎడిషన్‌కు ఒక ప్రత్యేక బ్యాడ్జ్‌ను ఇచ్చింది.

భారత మార్కెట్లో ప్రస్తుతం, బీఎండబ్ల్యూ కంపెనీ స్థానికంగా 13 మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. వీటిలో BMW 2 సిరీస్ గ్రాన్ కూపే, BMW 3 సిరీస్, BMW 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్, BMW M340i, BMW 5 సిరీస్, BMW 6 సిరీస్ గ్రాన్ టురిస్మో, BMW 7 సిరీస్, BMW X1, BMW X3, BMW X4, BMW X5, BMW X7 మరియు కంట్రీమ్యాన్ వంటివి ఉన్నాయి. మొత్తానికి కంపెనీ ఇప్పుడు 1,00,000 మార్కుని చేరుకుంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో BMW కార్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది.


Click it and Unblock the Notifications








