2022 మార్చి 10 న విడుదలకానున్న BMW X4 ఫేస్‌లిఫ్ట్: వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ' (BMW) భారతీయ మార్కెట్లో తన కొత్త 'ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్' (X4 Facelift) SUV ని 2022 మార్చి 10 న అధికారికంగా విడుదలచేయనుంది. దీనికి సంబందించిన సమాచారం కంపెనీ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ కోసం ప్రీ-లాంచ్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కావున ఈ కొత్త SUV కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

2022 మార్చి 10 న విడుదలకానున్న BMW X4 ఫేస్‌లిఫ్ట్: వివరాలు

నివేదికల ప్రకారం ఈ కొత్త BMW X4 ఫేస్‌లిఫ్ట్ SUV చెన్నైలోని కంపెనీ ఫ్యాక్టరీలో తయారు చేయబడుతుంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ SUVని కంపెనీ విడుదల చేసింది. అయితే భారతీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త SUV కూడా అదే డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అయితే ఇది దాని మునుపటి మోడల్ కంటే చాలా స్పోర్టీగా ఉంటుంది.

2022 మార్చి 10 న విడుదలకానున్న BMW X4 ఫేస్‌లిఫ్ట్: వివరాలు

'బీఎండబ్ల్యూ ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్' బ్రూక్లిన్ గ్రే, మినరల్ వైట్ మరియు బ్లాక్ సఫైర్ వంటి కొత్త ఆకర్షణీయమైన పెయింట్ స్కీమ్‌లలో అడాప్టివ్ LED హెడ్‌లైట్లు మరియు కొత్త 19-ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో అందించబడుతుంది. మొత్తం మీద ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

2022 మార్చి 10 న విడుదలకానున్న BMW X4 ఫేస్‌లిఫ్ట్: వివరాలు

ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది అప్‌గ్రేడ్ చేయబడిన 12.3-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12.3-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో బీఎండబ్ల్యూ లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే మరియు త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి వాటిని పొందుతుంది.

2022 మార్చి 10 న విడుదలకానున్న BMW X4 ఫేస్‌లిఫ్ట్: వివరాలు

ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ మొత్తం 6 కలర్ ఆప్సన్స్ పొందే అవకాశం ఉంటుంది. అంతే కాకూండా ఇది ఆధునిక యాంబియంట్ లైటింగ్‌ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ డంపర్ కంట్రోల్ మరియు మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది.

2022 మార్చి 10 న విడుదలకానున్న BMW X4 ఫేస్‌లిఫ్ట్: వివరాలు

కొత్త BMW ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ SUV రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతాయి. ఇందులో ఒకటి 2.0-లీటర్, ఫోర్-సిలిండర్, ట్విన్-టర్బో, పెట్రోల్ ఇంజన్‌ కాగా మరొకటి 3.0-లీటర్, 6 సిలిండర్ డీజిల్ ఇంజన్‌.

ఇందులోని పెట్రోల్ ఇంజిన్ 248 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అయితే డీజిల్ ఇంజిన్ 282 బిహెచ్‌పి పవర్ మరియు 650 న్యూటన్ మీటర్ల టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడతాయి.

2022 మార్చి 10 న విడుదలకానున్న BMW X4 ఫేస్‌లిఫ్ట్: వివరాలు

భారతదేశంలో ప్రస్తుత BMW X4 ధర రూ. 67.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). కావున త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల కానున్న X4 ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 70 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. BMW X4 భారతదేశంలో విడుదలైన తరువాత Mercedes-Benz GLC కూపేకి ప్రత్యర్థిగా ఉంటుంది.

2022 మార్చి 10 న విడుదలకానున్న BMW X4 ఫేస్‌లిఫ్ట్: వివరాలు

ఇదిలా ఉండగా బీఎండబ్ల్యూ (BMW) ఇటీవల కాలంలో తన కొత్త ఎక్స్3 (X3) SUV ని భారతీయ మార్కెట్లో డీజిల్ ఇంజిన్ లో కూడా విడుదలైంది. డీజిల్ ఇంజిన్ కలిగిన 2022 BMW X3 ధర రూ. 65.50 లక్షలు.

2022 మార్చి 10 న విడుదలకానున్న BMW X4 ఫేస్‌లిఫ్ట్: వివరాలు

2022 BMW X3 డీజిల్ xDrive20d లగ్జరీ ఎడిషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మోడల్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 213 కి.మీ వరకు ఉంటుంది. కంపెనీ విడుదల చేసిన ఈ మోడల్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కంపెనీ దీనిని రెండు పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లను విడుదల చేసింది.

2022 మార్చి 10 న విడుదలకానున్న BMW X4 ఫేస్‌లిఫ్ట్: వివరాలు

BMW X3 SUV యొక్క పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2-లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 252 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ SUV కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 km/h వేగాన్ని అందుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 9, 2022, 12:04 [IST]
English summary
Bmw x4 facelift to launch on 10th march features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+