వరుణ్ ధావన్ గ్యారేజిలో చేరిన మరో కొత్త లగ్జరీ కార్.. ఇదే: మీరూ చూడండి

సినీ ప్రముఖులు, క్రికెటర్లు మరియు పారిశ్రామిక వేత్తలకు అధునాతన సదుపాయాలు కలిగిన లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే వారు ఎప్పటికప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ నటుడు 'వరుణ్ ధావన్' ఇటీవల కొత్త 'మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్' (Mercedes-Benz GLS) కారుని కొనుగోలు చేశారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

వరుణ్ ధావన్ గ్యారేజిలో చేరిన మరో జర్మన్ లగ్జరీ కారు.. ఇదే: మీరూ చూడండి

నివేదికల ప్రకారం.. వరుణ్ ధావన్ జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే ఇందులో ఏ వేరియంట్ కొనుగోలు చేశారు అనేది ఖచ్చితంగా తెలియదు. అయితే దీనికి సంబంధిచిన ఫోటోలు మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికి వెలువడిన ఫోటోల ప్రకారం, వరుణ్ ధావన్ కొనుగోలు చేసిన ఈ కారు బ్లాక్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది.

వరుణ్ ధావన్ గ్యారేజిలో చేరిన మరో జర్మన్ లగ్జరీ కారు.. ఇదే: మీరూ చూడండి

భారతీయ మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఇష్టపడే లగ్జరీ కార్లలో Mercedes-Benz GLS కూడా ఒకటి. ఈ కారణంగానే చాలామంది సెలబ్రెటీల గ్యారేజిలో ఈ కారు ఉంది.

వరుణ్ ధావన్ గ్యారేజిలో చేరిన మరో జర్మన్ లగ్జరీ కారు.. ఇదే: మీరూ చూడండి

మెర్సిడెస్ జిఎల్ఎస్ మొత్తం మూడు వేరియంట్లలో విక్రయించబడుతుంది. అవి 400డి, 450 మరియు మేబాచ్ 600 వేరియంట్స్. ఇందులో 400డి మరియు 450 ధరలు రూ. 1.14 కోట్లు (ఎక్స్-షోరూమ్). అయితే ఇందులోని మేబాచ్ 600 వేరియంట్ ధర రూ. 2.47 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ మూడు వేరియంట్లు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఇవి చాలా విలాసవంతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

వరుణ్ ధావన్ గ్యారేజిలో చేరిన మరో జర్మన్ లగ్జరీ కారు.. ఇదే: మీరూ చూడండి

మెర్సిడెస్ జిఎల్ఎస్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ మరియు కార్నరింగ్ ఫంక్షన్ అదేవిధంగా హై బీమ్ అసిస్ట్ వంటి వాటిని పొందుతుంది. ఇందులోని 400డి మరియు 450 వేరియంట్స్ 7 సీటర్ కాన్ఫిగరేషన్ తో అందుబాటులో ఉంటుంది. ఇందులోని సీట్లు ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కావలసిన లెగ్ రూమ్, క్నీ రూమ్ మరియు హెడ్ రెస్ట్ వంటివి అందుబాటులో ఉంటాయి.

వరుణ్ ధావన్ గ్యారేజిలో చేరిన మరో జర్మన్ లగ్జరీ కారు.. ఇదే: మీరూ చూడండి

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అంతే కాకూండా ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికీ సపోర్ట్ చేసే టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంది. వీటితోపాటు 'హే మెర్సిడెస్' అనే ఫీచర్ అందుబాటులో ఉంటుంది, కావున దీనికి వాయిస్ కమాండ్ అందించవచ్చు.

వరుణ్ ధావన్ గ్యారేజిలో చేరిన మరో జర్మన్ లగ్జరీ కారు.. ఇదే: మీరూ చూడండి

మెర్సిడెస్ జిఎల్ఎస్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులోని 400డి వేరియంట్ 3.0-లీటర్ డీజిల్‌తో మరియు 450 వేరియంట్ 3.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉన్నాయి.

3.0-లీటర్ డీజిల్‌ ఇంజిన్ 330 బిహెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇక 3.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ 367 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

వరుణ్ ధావన్ గ్యారేజిలో చేరిన మరో జర్మన్ లగ్జరీ కారు.. ఇదే: మీరూ చూడండి

వరుణ్ ధావన్ గ్యారేజిలో ఇప్పుడు కొనుగోలు చేసిన బెంజ్ జిఎల్ఎస్ కాకుండా మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 350డి 4మ్యాటిక్, ల్యాండ్ రోవర్ ఎల్ఆర్3 మరియు ఆడి క్యూ7 వంటి వాటితో పాటు మహీంద్రా కెయువి100 కూడా ఉంది. వరుణ్ ధావన్ గతంలో మహీంద్రా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం వల్ల ఈ మహీంద్రా కెయువి గిఫ్ట్ గా లభించింది.

More from DriveSpark

Article Published On: Sunday, June 26, 2022, 14:30 [IST]
English summary
Bollywood actor varun dhawan bought new mercedes benz gls details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+