రూ.3 కోట్లు ఖరీదు చేసే మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసిన స్టార్ డైరెక్టర్!

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) అందించే కార్లు, అందులోనూ ఈ లగ్జరీ కార్ బ్రాండ్ యొక్క పెర్ఫార్మెన్స్ డివిజన్ ఏఎమ్‌జి (AMG) అందించే కార్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. అత్యంత ఖరీదైన మరియు అత్యధిక పెర్ఫార్మెన్స్ అందించే కార్లను సెలబ్రిటీలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.

Recommended Video

భారత్‌లో 2022 Mercedes-Benz C-Class లాంచ్: ధర & వివరాలు

తాజాగా, ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఒకరు ఇలాంటి అరుదైన కారును కొనుగోలు చేశారు. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

రూ.3 కోట్లు ఖరీదు చేసే మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసిన స్టార్ డైరెక్టర్!

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టికి సినిమాలతో పాటు కార్లంటే కూడా చాలా ఇష్టం. పెద్ద పెద్ద సినిమాలు తీసే ఈ స్టార్ డైరెక్టర్‌కి పెద్ద పెద్ద ఎస్‌యూవీలంటేనే ఎక్కువ ఇష్టం. రోహిత్ శెట్టి కార్ గ్యారాజ్‌లో ఇప్పటికే చాలా అరుదైన కార్లు ఉన్నాయి. కాగా, ఇప్పుడు ఆయన కార్ కలెక్షన్‌లో కొత్తగా మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జి63 (Mercedes AMG G63) ఎస్‌యూవీ వచ్చి చేరింది. రోహిత్ శెట్టి ఈ కొత్త జర్మన్ ఎస్‌యూవీని దాదాపు రూ.3 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం.

రూ.3 కోట్లు ఖరీదు చేసే మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసిన స్టార్ డైరెక్టర్!

రోహిత్ శెట్టి కొత్తగా కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జి63 కారుతో ఇటీవల ఓ ఈవెంట్‌లో కనిపించారు, అతని AMG G63 తెలుపు రంగులో పెయింట్ చేయబడి, చాలా ఆకర్షణీయంగా ఉంది. మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జి63 గంభీరమైన వైఖరితో మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది. భారతదేశంలో మెర్సిడెస్ ఏఎమ్‌జి జి63 వెర్షన్‌ను మాత్రమే విక్రయిస్తోంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లోల ఇందులో మరింత శక్తివంతమైన ఏఎమ్‌జి జి65 వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

రూ.3 కోట్లు ఖరీదు చేసే మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసిన స్టార్ డైరెక్టర్!

రోహిత్ శెట్టి కొనుగోలు చేసిన ఈ కొత్త లగ్జరీ ఎస్‌యూవీలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు ఎల్ఈడి హెడ్‌లైట్లతో కూడిన కొత్త హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌ ఉంటుంది. ఇందులో గుండ్రటి హెడ్‌ల్యాంప్స్ మరియు దాని చుట్టూ ఉండే గుండ్రటి డేటైమ్ రన్నింగ్ లైట్స్, వెర్టికల్ స్లాట్స్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్ మరియు దాని మధ్యలో ఉండే పెద్ద మెర్సిడెస్ బెంజ్ లోగో, హుడ్ పై భాగంలో అమర్చిన దీర్ఘచతురస్రాకారపు టర్న్ ఇండికేటర్లు మరియు డ్యూయెల్ టోన్ బంపర్‌తో ఇది ఐకానిక్ క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

రూ.3 కోట్లు ఖరీదు చేసే మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసిన స్టార్ డైరెక్టర్!

బయటకు చెక్కినట్లుగా ఉండే పెద్ద వీల్ ఆర్చ్‌లు, పెద్ద 21 ఇంచ్ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు 241 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ తో ఇంచి అత్యుత్తమ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది. ఇంజన్ విషయానికి వస్తే, మెర్సిడెస్ ఏఎమ్‌జి జి63 ఎస్‌యూవీలో పెద్ద 4.0-లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 585 బిహెచ్‌పి శక్తిని మరియు 850 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రూ.3 కోట్లు ఖరీదు చేసే మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసిన స్టార్ డైరెక్టర్!

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 220 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. మెర్సిడెస్ ఏఎమ్‌జి జి63లో మల్టీ-టెర్రైన్ మోడ్స్ ఉంటాయి మరియు ఇది ఏ రకమైన రోడ్డుపై అయినా నడిపేందుకు వీలుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆఫ్-రోడింగ్ ప్రియులకు ఇది చాలా ఇష్టమైన ఎస్‌యూవీ.

రూ.3 కోట్లు ఖరీదు చేసే మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసిన స్టార్ డైరెక్టర్!

ఈ కారులోని ఇంటీరియర్‌ల గురించి చెప్పాలంటే, ఇది చూడటానికి పెద్దగా కనిపించినప్పటికీ, ఇదొక 5-సీటర్ ఎస్‌యూవీ. దీని క్యాబిన్‌ లోపల పెద్ద 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డ్యూయల్ టోన్ కాంట్రాస్ట్ మరియు సాఫ్ట్-టచ్ లెదర్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అధునాతన కనెక్టివిటీ ఫీచర్లు మరియు మెర్సిడెస్ బెంజ్ యొక్క అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

రూ.3 కోట్లు ఖరీదు చేసే మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసిన స్టార్ డైరెక్టర్!

రోహిత్ శెట్టి కార్ కలెక్షన్ లో ఇప్పటికే లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ కూడా ఉంది. ఇటీవలే ఆయన ఈ కారును కొనుగోలు చేశారు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీలలో లాంబోర్గినీ ఉరుస్ కూడా ఒకటి. అంతేకాదు, ఇది లాంబోర్గినీ తయారు చేసిన మొట్టమొదటి ఎస్‌యూవీ కూడా. ఈ కారు కేవలం 3.6 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 305 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

రూ.3 కోట్లు ఖరీదు చేసే మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసిన స్టార్ డైరెక్టర్!

టాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి ఎస్‌యూవీని చాలా మంది ప్రముఖులు కొనుగోలు చేసి ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వద్ద కూడా ఇలాంటి ఓ మెర్సిడెస్ ఏఎమ్‌జి జి63 కారు ఉన్నట్లు సమాచారం. అలాగే, కొన్ని నెలల క్రితం, ఈ లగ్జరీ ఎస్‌యూవీని భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా కొనుగోలు చేశాడు.

More from DriveSpark

Article Published On: Sunday, September 11, 2022, 14:00 [IST]
English summary
Bollywood star director rohit shetty buys new mercedes amg g63
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+