లోటస్ ఎలట్రే (Lotus Eletre) ఎలక్ట్రిక్ హైపర్ కార్ ఆవిష్కరణ; ఫుల్ చార్జ్‌పై 600 కిమీ రేంజ్!

బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ లోటస్ (Lotus) తమ మొట్టమొదటి హైపర్ ఎలక్ట్రిక్ కారు "లోటస్ ఎలట్రే" (Lotus Eletre) ను అధికారికంగా ఆవిష్కరించింది. గ్లోబల్ మార్కెట్ల కోసం లోటస్ ప్రకటించిన మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఎలట్రే మొట్టమొదటి మరియు ఇది వచ్చే ఏడాది నాటికి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఈ హైపర్ ఎలక్ట్రిక్ కారు పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో Eletre అనే పదాన్ని తూర్పు యూరోపియన్ భాష నుండి గ్రహించారు. ఆ భాషలో దీని అర్థం 'జీవం పోసుకోవడం' (కమింగ్ టూ లైఫ్) అని అర్థం.

లోటస్ ఎలట్రే (Lotus Eletre) ఎలక్ట్రిక్ హైపర్ కార్ ఆవిష్కరణ; ఫుల్ చార్జ్‌పై 600 కిమీ రేంజ్!

లోటస్ ఎలట్రేతో ఈ సూపర్ కార్ బ్రాండ్ మొట్టమొదటి సారిగా ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లోకి ప్రవేశించింది. లోటస్ బ్రాండ్ యొక్క 74 ఏళ్ల చరిత్రలో, కంపెనీకి ఇదే తొలి ఎలక్ట్రిక్ హైపర్ కారు. లోటస్ రానున్న 3-4 సంవత్సరాలలో మరో రెండు ఎలక్ట్రిక్ కార్లను కూడా లాంచ్ చేయనుంది. లోటస్ యొక్క ఎలక్ట్రిక్ కార్ లైనప్ లో ఓ స్పోర్ట్స్ కారు, స్పోర్ట్స్ సెడాన్ మరియు కూపే ఎస్‌యూవీలు ఉండనున్నాయి.

లోటస్ ఎలట్రే (Lotus Eletre) ఎలక్ట్రిక్ హైపర్ కార్ ఆవిష్కరణ; ఫుల్ చార్జ్‌పై 600 కిమీ రేంజ్!

లోటస్ ఎలట్రే విషయానికి వస్తే, కంపెనీ దీనిని తమ అవిజా హైపర్‌కార్ నుండి ప్రేరణ పొందిన కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ తో రూపొందించింది. ఇది పూర్కిగా సరికొత్త ఎలక్ట్రిక్ ప్రీమియం ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది మరియు ఇది బహుళ పరిమాణాల బ్యాటరీలు, మోటార్లు మరియు స్మార్ట్ డ్రైవింగ్ టెక్నాలజీలకు అనుగుణంగా సౌకర్యవంతమైన ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. లోటస్ ఎలట్రే అనేక అధునాతన సాంకేతికతలతో రానుంది.

లోటస్ ఎలట్రే (Lotus Eletre) ఎలక్ట్రిక్ హైపర్ కార్ ఆవిష్కరణ; ఫుల్ చార్జ్‌పై 600 కిమీ రేంజ్!

లోటస్ ఎలట్రే యొక్క పవర్‌ట్రెయిన్ గురించి పూర్తి వివరాలు ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. అయితే, కంపెనీ ఈ హైపర్ కారులో 100 kWh కంటే ఎక్కువ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్‌ ను ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. Lotus Eletre గరిష్టంగా 592 bhp (600 PS) పవర్ అవుట్‌పుట్‌ ను జనరేట్ చేసే డ్యూయల్ మోటార్ (ఫ్రంట్ యాక్సిల్ ఒకటి మరియు రియర్ యాక్సిల్ లో ఒకటి చొప్పున మొత్తం రెండు ఎలక్ట్రిక్ మోటార్లను) సెటప్‌ను కలిగి ఉంటుంది.

లోటస్ ఎలట్రే (Lotus Eletre) ఎలక్ట్రిక్ హైపర్ కార్ ఆవిష్కరణ; ఫుల్ చార్జ్‌పై 600 కిమీ రేంజ్!

లోటస్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఎలట్రో హైపర్ కారు కేవలం 3 సెకన్లలోపే గరిష్టంగా గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 260 కిలమీటర్ల టాప్ స్పీడ్ తో దూసుకుపోతుంది. లోటస్ ఎలట్ హైపర్ కారులో 4 డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి. వీటిలో రేంజ్, టూర్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ మరియు ఇండివిడ్యువల్. డ్రైవర్ ఎంచుకునే మోడ్ ను బట్టి, ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్ మారుతూ ఉంటుంది.

లోటస్ ఎలట్రే (Lotus Eletre) ఎలక్ట్రిక్ హైపర్ కార్ ఆవిష్కరణ; ఫుల్ చార్జ్‌పై 600 కిమీ రేంజ్!

లోటస్ ఎలట్రే WLTP (వరల్డ్ హార్మోనైజ్డ్ లైట్-డ్యూటీ వెహికల్స్ టెస్ట్ ప్రొసీజర్) టెస్టింగ్ ప్రక్రియ ప్రకారం, పూర్తి చార్జ్ పై గరిష్టంగా 600 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని సర్టిఫై చేయబడింది. దీనిని 350 kWh ఫాస్ట్ DC ఛార్జర్‌ సాయంతో చార్జ్ చేస్తే, కేవలం 18 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చని లోటస్ పేర్కొంది. ఎలట్రే కారును 23 kW AC ఛార్జింగ్‌తో కూడా ఆఫర్ చేయనున్నారు. ఈ కారును కేవలం 20 నిమిషాల పాటు చార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సరిపడా చార్జింగ్ లభిస్తుంది.

లోటస్ ఎలట్రే (Lotus Eletre) ఎలక్ట్రిక్ హైపర్ కార్ ఆవిష్కరణ; ఫుల్ చార్జ్‌పై 600 కిమీ రేంజ్!

లోటస్ ఎలట్రే కారును ముందు వైపు నుండి చూసినప్పుడు చాలా అగ్రెసివ్‌గా ఉండే డిజైన్‌ ను కలిగి ఉంటుంది. మొదటిసారిగా దీనిని చూసిన వారు, ఇది లాంబోర్ఘిని ఉరుస్ అని భ్రమపడే అవకాశం ఉంటుంది. యొక్క అదనపు అగ్రెసివ్ వెర్షన్ లాగా కనిపిస్తుంది. షార్ప్ గా కనిపించే ఎల్ఈడి హెడ్‌లైట్లు, ట్రైయాంగిల్ ప్యాటర్న్స్‌తో కూడిన యాక్టివ్ ఫ్రంట్ గ్రిల్, వెనుక వైపు వాలుగా ఉండే రూఫ్ లైన్ (కూపే డిజైన్ లుక్) వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఇది బ్రాండ్ యొక్క మొట్టమొదటి 5-డోర్ ప్రొడక్షన్ కారు.

లోటస్ ఎలట్రే (Lotus Eletre) ఎలక్ట్రిక్ హైపర్ కార్ ఆవిష్కరణ; ఫుల్ చార్జ్‌పై 600 కిమీ రేంజ్!

ఎలట్రే షోల్డర్ లైన్స్ కూడా షార్ప్‌గా కనిపిస్తాయి మరియు కారుకి మజిక్యులర్ లుక్‌ని అందిస్తాయి. టెస్లా కార్ల మాదిరిగా లోటస్ ఎలట్రే కూడా ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో సైడ్ మిర్రర్స్ స్థానంలో అద్దాలకు బదులుగా రియర్‌వ్యూ కెమెరాలు ఉంటాయి. ఇక సైడ్స్‌కి వస్తే, ఇందులో 21 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి. అయితే కస్టమర్లు కావాలనుకుంటే, వీటిని 22 ఇంచ్ లేదా 23 ఇంచ్ సైజుతో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ పెట్రోల్ కార్ల మాదిరిగా సైడ్‌లో ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది.

లోటస్ ఎలట్రే (Lotus Eletre) ఎలక్ట్రిక్ హైపర్ కార్ ఆవిష్కరణ; ఫుల్ చార్జ్‌పై 600 కిమీ రేంజ్!

వెనుకవైపు డిజైన్‌ను గమనిస్తే, లోటస్ ఎలట్రే రియర్ డోర్ మొత్తం నడిచే పెద్ద ఎల్ఈడి లైట్ బార్ ఉంటుంది. అలాగే, ఇందులో వెనుక వైపు లోటస్ అవిజా హైపర్‌కార్ నుండి ప్రేరణ పొందిన వెంట్‌లు కూడా కనిపిస్తాయి. రూఫ్‌లో రెండు వింగ్‌లెట్‌లు ఉన్నాయి, ఇవి కారు వెనుక భాగంలో గాలిని ప్రసారం చేయడంలో సహకరిస్తాయి. లోటస్ ఎలట్రే ఈ బ్రాండ్ నుండి వస్తున్న అత్యంత "కనెక్ట్ చేయబడిన" కారు. కంపెనీ ఈ మోడల్‌ను చైనాలో ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది.

లోటస్ ఎలట్రే (Lotus Eletre) ఎలక్ట్రిక్ హైపర్ కార్ ఆవిష్కరణ; ఫుల్ చార్జ్‌పై 600 కిమీ రేంజ్!

ఇక ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, దాని కాక్‌పిట్ డిజైన్ ఓ అద్భుతమైన మరియు విలాసవంతమైన అనుభూతిని అందిస్తుంది. ఈ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో ముందు భాగంలో పెద్ద పెద్ద స్క్రీన్‌లతో నాలుగు లేదా ఐదు సీట్ల లేఅవుట్ ను కలిగి ఉంటుంది. ప్రతిచోటా ప్రాక్టికల్ స్టోరేజ్ స్పేస్‌లు ఉన్నాయి మరియు పెద్ద 15.1 ల్యాండ్‌స్కేప్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేతో కూడిన మల్టీ-స్క్రీన్ సెటప్ నిజంగా ఫ్యూచరిస్టిక్‌గా కనిపిస్తుంది. ఈ కారులో చాలా కొన్ని ఫంక్షనల్ నాబ్‌లు మరియు బటన్లు మాత్రమే కనిపిస్తాయి.

లోటస్ ఎలట్రే (Lotus Eletre) ఎలక్ట్రిక్ హైపర్ కార్ ఆవిష్కరణ; ఫుల్ చార్జ్‌పై 600 కిమీ రేంజ్!

ఈ హైపర్ కారులో 23 స్పీకర్లతో కూడిన 3డి సరౌండ్ సౌండ్‌తో కూడిన సౌండ్ సిస్టమ్‌ ఉంటుంది. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా సెటప్ మరియు పైకప్పుపై అమర్చబడిన లైడార్ సెన్సార్ వంటి అధునాతన సాంకేతికతను కలిగి ఉంటుంది. ఇందులోని 3డి లేజర్ సెన్సార్, కారు చుట్టూ ఉన్న వాహనాలు, వస్తువుల యొక్క 3డి చిత్రాలను ఉత్పత్తి చేస్తుంది మరియు వాటిని స్క్రీన్‌పై ప్రొజెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ కారులోని కొన్ని ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో అడాస్, ఇంటెలిజెంట్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కొలైజన్ మిటిగేషన్ సపోర్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ఫ్రంట్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఎమర్జెన్సీ పార్కింగ్ బ్రేక్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, March 31, 2022, 11:16 [IST]
English summary
British ev maker lotus unveils its hyper electric suv eletre range features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+