భారత్‌లో BYD Atto3 డెలివరీలు కాకముందే.. ఆ దేశంలో డెలివరీలు బంద్: అట్లుంటది చైనా కార్ల తోటి

ఇటీవల భారతీయ మార్కెట్లో చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) 'ఆటో 3' (Atto 3) అనే కొత్త ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. ఈ SUV కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది, కాగా డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో డెలివరీ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి.

ఇంతకీ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ SUV యొక్క డెలివరీలను ఎక్కడ నిలిపివేసింది, దీనికి గల కారణం ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

భారత్‌లో BYD Atto3 డెలివరీలు కాకముందే.. ఆ దేశంలో డెలివరీలు బంద్: అట్లుంటది చైనా కార్ల తోటి

నివేదికల ప్రకారం, బివైడి ఆటో 3 డెలివరీలు ఆస్ట్రేలియాలో ఒక వారం రోజుల పాటు వాయిదా వేయబడ్డాయి. ఈ SUV యొక్క చైల్డ్ సీటులో సరైన భద్రత లేదు అనే కారణంగానే ఈ డెలివరీలు వాయిదా వేయబడ్డాయి. ఆస్ట్రేలియా వాహన నిబంధనలకు తగిన విధంగా ఈ ఎలక్ట్రిక్ కారు లేని కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.

భారత్‌లో BYD Atto3 డెలివరీలు కాకముందే.. ఆ దేశంలో డెలివరీలు బంద్: అట్లుంటది చైనా కార్ల తోటి

2022 అక్టోబర్ 21 నుంచి 28 వరకు ఈ డెలివరీలు నిలిపివేయబడ్డాయి. అంతే కాకూండా ఈ ఎలక్ట్రిక్ కారు పొందిన సేఫ్టీ రేటింగ్ మీద కూడా మరో సారి దర్యాప్తు చేయనున్నట్లు కూడా సమచారం వచ్చింది. అయితే దీనిపైన కంపెనీ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

భారత్‌లో BYD Atto3 డెలివరీలు కాకముందే.. ఆ దేశంలో డెలివరీలు బంద్: అట్లుంటది చైనా కార్ల తోటి

ఇదిలా ఉండగా ఇటీవల BYD Atto 3 కి నిర్వహించిన యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొంది అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. ఈ టెస్ట్ లో లెఫ్ట్ హ్యాండ్ బేస్ మోడల్ టెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది రైట్ హ్యాండ్ మోడల్‌కు కూడా వర్తిస్తుంది.

భారత్‌లో BYD Atto3 డెలివరీలు కాకముందే.. ఆ దేశంలో డెలివరీలు బంద్: అట్లుంటది చైనా కార్ల తోటి

ఈ SUV లో ఫ్రంట్ మరియు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అంతే కాకుండా.. బెల్ట్ ప్రిటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, ఐసోఫిక్స్, సీట్‌బెల్ట్ రిమైండర్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, స్పీడ్ అసిస్టెన్స్ మరియు లేన్ అసిస్ట్ సిస్టమ్ వంటివి కూడా ఉన్నాయి.

భారత్‌లో BYD Atto3 డెలివరీలు కాకముందే.. ఆ దేశంలో డెలివరీలు బంద్: అట్లుంటది చైనా కార్ల తోటి

BYD Atto 3 ఎస్‌యువి అడల్ట్ సేఫ్టీ విషయంలో (పెద్దల భద్రతలో) 38 పాయింట్లకు గాను 34.7 పాయింట్లను స్కోర్ చేసింది. మొత్తమ్ మీద పెద్దల భద్రత విషయంలో 91% సేఫ్టీ ఉందని దీని ద్వారా తెలుస్తుంది. అదే సమయంలో పిల్లల సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో 49 పాయింట్లకు గానూ 44 పాయింట్లు సాధించింది. మొత్తం మీద పిల్లల భద్రతలో 89% సేఫ్టీ ఉందని నిర్దారించబడింది. ఇందులో అమర్చబడి డమ్మీ ఛైల్డ్స్ ఇద్దరికీ కూడా మంచి భద్రత కల్పించబడుతుంది.

భారత్‌లో BYD Atto3 డెలివరీలు కాకముందే.. ఆ దేశంలో డెలివరీలు బంద్: అట్లుంటది చైనా కార్ల తోటి

కారులో ఉన్న వ్యక్తుల భద్రతలు మాత్రమే కాకుండా రోడ్డుపైన నడిచే పాదాచారాలకు కూడా హాని కలిగించకుండా ఉండటానికి ఇందులో కొన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. పాదచారుల భద్రత విషయంలో 69 శాతం సేఫ్టీ ఉందని నిర్దారించబడింది. ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) సిస్టమ్ ఆన్‌బోర్డ్ వంటివి ఇందులో ఉండటం వల్ల పాదాచారులు కూడా ఎక్కువ హాని జరిగే అవకాశం ఉండదు.

భారత్‌లో BYD Atto3 డెలివరీలు కాకముందే.. ఆ దేశంలో డెలివరీలు బంద్: అట్లుంటది చైనా కార్ల తోటి

BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు సేఫ్టీ అసిస్ట్ లో 74 శాతం స్కోర్ చేసింది. వెహికల్ లేన్ నుండి బయటకు పోతున్నప్పుడు దాని మార్గాన్ని సరి చేయడం ద్వారా లేన్ సపోర్ట్ సిస్టమ్ బాగా పనిచేసింది. ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) తో కార్ టు కార్ రియాక్షన్‌లు చాలా పటిష్టంగా ఉన్నాయని గుర్తించబడింది. ఈ SUV యొక్క ప్రొడక్షన్ చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌ ప్లాంట్‌లో అసెంబుల్ చేయబడుతుంది.

భారత్‌లో BYD Atto3 డెలివరీలు కాకముందే.. ఆ దేశంలో డెలివరీలు బంద్: అట్లుంటది చైనా కార్ల తోటి

BYD ఆటో 3' (Atto 3) కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న మొదటి 500 మంది కస్టమర్లకు 2023 జనవరి నాటికి డెలివరీ చేయనున్నట్లు కూడా కంపెనీ తెలిపింది. కంపెనీ 2023 సంవత్సరంలో కంపెనీ ఏకంగా 15,000 అటో 3 కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం కంపెనీ కావాల్సిన సన్నాహాలు కూడా సిద్ధం చేసుకుంటోంది. ఈ కొత్త SUV ధరలు ఇంకా వెల్లడించనప్పటికీ ఇది రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య వుండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

భారత్‌లో BYD Atto3 డెలివరీలు కాకముందే.. ఆ దేశంలో డెలివరీలు బంద్: అట్లుంటది చైనా కార్ల తోటి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఇంకా డెలివరీలు ప్రారభం కాలేదు, అయితే అప్పుడే ఆస్ట్రేలియాలో డెలివరీలు నిలిపివేశాయి అన్న వార్త ఈ SUV కొనాలనుకునే కస్టమర్ల మనసులో ఒక అనుమానం కలిగించేసింది. అయితే దీనిపైనా కంపెనీ ఎలా స్పందిస్తుందో తెలియాలి. అయితే కంపెనీ దీనిపైన సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 26, 2022, 15:45 [IST]
English summary
Byd atto 3 electric suv delivery paused over safety issue
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+