ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ, ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించింది..!

చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బ్రాండ్ 'బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఆటో' (BYD Auto), భారతదేశంలో తమ రెండవ డీలర్‌షిప్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో బివైడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ డీలర్‌షిప్ షోరూమ్‌ను ప్రారంభించింది.

Recommended Video

Ola Electric స్కూటర్ల కోసం విడుదల కానున్న Move OS2: వివారాలు #AutoNews

బివైడి ఇండియా వారెన్ బఫెట్-మద్దతుగల బివైడి యొక్క పూర్తి భారతీయ అనుబంధ సంస్థగా కొనసాగుతుంది మరియు దేశంలోని ఈ డీలర్‌షిప్‌లను పిపిఎస్ మోటార్స్ నిర్వహిస్తుంది. బివైడి ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో బివైడి ఇ6 అనే ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని విక్రయిస్తోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ, ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించింది..!

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీదారుగా ఉన్న బివైడి ఆటో, భారతదేశంలో 2023 మధ్య నాటికి కనీసం 25 డీలర్‌షిప్ షోరూమ్‌లను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపింది. చైనా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బివైడి ఆటో, భారతదేశంలోని పిపిఎస్ మోటార్స్‌తో కలిసి తమ అనుబంధ కంపెనీగా బివైడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ పేరుతో దేశీయ మార్కెట్లో ఈవీ వ్యాపారాన్ని ప్రారంభించింది. భారతదేశంలోని తమ రెండవ డీలర్‌షిప్ షోరూమ్‌ను గురువారం నాడు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు‌లు కలిసి ప్రారంభించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ, ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించింది..!

విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ఈ బివైడి షోరూమ్‌లో సుశిక్షితులైన కన్సల్టెంట్‌లు మరియు ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లు ఉన్నాయని, ఇది కస్టమర్‌లకు అసాధారణమైన ఇన్-స్టోర్ అనుభవాన్ని అందింస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ షోరూమ్ 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది మరియు కస్టమర్‌లకు విలాసవంతమైన అనుభూతిని అందించేందుకు ఇక్కడ రిలాక్సింగ్ లాంజ్ ఏరియా కూడా ఉంటుంది. ఈ కంపెనీకి చెన్నైలో నెలకు దాదాపు 900 కార్లను ఉత్పత్తి చేయగల అసెంబ్లీ ప్లాంట్ ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ, ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించింది..!

బివైడి ఇండియా గతేడాది నవంబర్ నెలలో భారత మార్కెట్లో తమ మొట్టమొదటి 'బివైడి ఇ6' (BYD e6) ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని విడుదల చేసింది. ఇది చూడటానికి దాదాపు టొయోటా ఇన్నోవా, మారుతి సుజుకి ఎర్టిగా యొక్క ఫ్యూచరిస్టిక్ మోడల్ మాదిరిగా కనిపిస్తుంది. అయితే, బివైడి ఇ6 కేవలం 5-సీటర్ వెర్షన్ గా మాత్రమే అందుబాటులో ఉంటుంది. బివైడి ఇ6 భారతదేశంలో బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని స్వీకరించిన మొదటి ప్రీమియం ఎమ్‌పివి. దేశీయ మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి ధర రూ. 29.15 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ, ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించింది..!

బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివిలో పెద్ద 71.7 కిలోవాట్అవర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది బ్లేడ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఇందులోని 70 కిలోవాట్అవర్ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 94 బిహెచ్‌పి పవర్ మరియు 180 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఫ్రంట్ యాక్సిల్ లో అమర్చబడి ఉంటుంది. ఈ పవర్‌ట్రైన్ సాయంతో బివైడి ఇ6 గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇది పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 520 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ, ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించింది..!

బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్ ఏసి చార్జింగ్ మరియు డిసి ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఈ కారును డిసి ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారా చార్జ్ చేసినప్పుడు, ఈ కారులోని బ్యాటరీ ప్యాక్‌ ను కేవలం 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే దీని ఫాస్ట్ చార్జర్ ద్వారా పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయాలంటే సుమారు గంటన్నర సమయం పడుతుంది. కస్టమర్లు రూ. 45,000 అదనంగా చెల్లిస్తే, కంపెనీ ఈ కారుతో పాటుగా BYD 7kW అనే AC ఛార్జర్‌ ను కూడా అందిస్తుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ, ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించింది..!

ఇదిలా ఉంటే, ఇటీవల బివైడి ఇ6 (BYD e6) ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ పవర్‌పై గరిష్ట దూరాన్ని కవర్ చేసిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి కూడా ప్రవేశించింది. ఈ రికార్డులో భాగంగా BYD e6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి 6 రోజుల్లో ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లే మార్గంలో 9 నగరాలను కవర్ చేస్తూ 2,203 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. బివైడి ఎలక్ట్రిక్ కార్లు వాటి సాంకేతికత, భద్రత, రేంజ్ మరియు ఛార్జింగ్ సైకిల్ వంటి విషయాలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందాయి. బివైడి కార్లలోని బ్యాటరీ ప్యాక్ ఇంత అధిక రేంజ్ ను అందించడానికి ప్రధాన కారణంగా, ఇందులో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ టెక్నాలజీని ఉపయోగించడమే. ఇది వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీని 50 శాతం మెరుగుపరుస్తుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ, ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించింది..!

విజయవాడలో కొత్త షోరూమ్‌ని ప్రారంభించిన సందర్భంగా బివైడి ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ, పిపిఎస్ మోటార్స్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో తమ మొదటి షోరూమ్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని, తమ కస్టమైజ్డ్ ఉత్పత్తులు మరియు సేవలు ఈ ప్రాంతంలో హరిత కార్యక్రమాలను వేగవంతం చేస్తాయని, ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 11 షోరూమ్‌లను మరియు జూన్ 2023 చివరి నాటికి భారతదేశం అంతటా 25 నుండి 28 షోరూమ్‌లను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Friday, August 26, 2022, 12:48 [IST]
English summary
Byd india opens first dealership in andhra pradesh124824
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+