Atto 3 విడుదలకు ముందే అంతా సిద్ధం చేసుకుంటున్న BYD: డెలివరీలు మరింత సులభమైపోతాయ్..

చైనా కార్ తయారీ సంస్థ BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) దేశీయ మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ SUV 'ఆటో 3' (Atto 3) ని ఇప్పటికే అధికారికంగా ఆవిష్కరించింది. కాగా కంపెనీ త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ SUV యొక్క ధరలను కూడా ప్రకటించనుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. కావున డెలివరీలు 2023 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

Atto 3 విడుదలకు ముందే అంతా సిద్ధం చేసుకుంటున్న BYD: ఇక డెలివరీలు మరింత సులభమైపోతాయ్..

BYD కంపెనీ తన ఎలక్ట్రిక్ SUV ని భారతీయ మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో విక్రయించడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ కావలసిన సంఖ్యలో షోరూమ్‌లను ప్రారంభిస్తోంది. ఇప్పటికే 12 షోరూమ్‌లను కలిగి ఉన్న కంపెనీ 2022 చివరి నాటికి 23 షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి తగిన సన్నాహాలు కూడా సిద్ధం చేసుకుంటోంది.

Atto 3 విడుదలకు ముందే అంతా సిద్ధం చేసుకుంటున్న BYD: ఇక డెలివరీలు మరింత సులభమైపోతాయ్..

ఇప్పటికే కంపెనీ చెన్నై, బెంగళూరు మరియు ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో షోరూమ్‌లను ప్రారంభించింది. BYD ఆటో 3 రాబోయే 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2022 అక్టోబరు 31 న కంపెనీ చెన్నైలో షోరూమ్ ప్రారంభించింది. ఇది 20,000 అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని ద్వారా సేల్స్, స్పేర్స్ మరియు సర్వీస్ వంటివి కూడా జరుగుతాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న 12 షోరూమ్‌లలో చెన్నై షోరూమ్ చాలా పెద్దది అనే చెప్పాలి.

Atto 3 విడుదలకు ముందే అంతా సిద్ధం చేసుకుంటున్న BYD: ఇక డెలివరీలు మరింత సులభమైపోతాయ్..

కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ కారు 'ఆటో 3' (Atto 3) కోసం బుకింగ్స్ స్వీకరించాడా కూడా ప్రారంభించింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న మొదటి 500 మంది కస్టమర్లకు 2023 జనవరి నాటికి డెలివరీ చేయనున్నట్లు కూడా కంపెనీ తెలిపింది.

Atto 3 విడుదలకు ముందే అంతా సిద్ధం చేసుకుంటున్న BYD: ఇక డెలివరీలు మరింత సులభమైపోతాయ్..

BYD ఇండియా చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లోని ప్లాంట్‌లో సెమీ-నాక్డ్ డౌన్ (SKD) కిట్‌ల నుండి Atto 3 ని అసెంబుల్ చేస్తుంది. ఇది ప్రస్తుతం 10,000 యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో మూడు షిఫ్ట్‌లలో 15,000 యూనిట్లకు విస్తరించదానికి కూడా కంపెనీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. 2023 సంవత్సరంలో కంపెనీ ఏకంగా 15,000 అటో 3 కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Atto 3 విడుదలకు ముందే అంతా సిద్ధం చేసుకుంటున్న BYD: ఇక డెలివరీలు మరింత సులభమైపోతాయ్..

ఇటీవల BYD Atto 3 కి నిర్వహించిన యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొంది అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. ఇందులో ఫ్రంట్ మరియు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అంతే కాకుండా బెల్ట్ ప్రిటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, ఐసోఫిక్స్, సీట్‌బెల్ట్ రిమైండర్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, స్పీడ్ అసిస్టెన్స్ మరియు లేన్ అసిస్ట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

Atto 3 విడుదలకు ముందే అంతా సిద్ధం చేసుకుంటున్న BYD: ఇక డెలివరీలు మరింత సులభమైపోతాయ్..

కొత్త ఆటో 3 ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ SUV ముందు భాగంలో BYD అక్షరాలతో కూడిన సిల్వర్ గ్రిల్‌ ఉంటుంది, దానికి కింది భాగంలో Atto 3 అనేది ఉంటుంది. అంతే కాకుండా ఇందులో LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌తో కూడా సొగసైన హెడ్‌లైట్‌ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 18 ఇంచెస్ ఫైవ్ స్పోక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు సి-పిల్లర్‌పై ప్రత్యేకమైన సిల్వర్ ఫినిషింగ్ వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ మరియు పెద్ద అక్షరాలతో కూడిన 'బిల్డ్ యువర్ డ్రీమ్స్' ఉన్నాయి.

Atto 3 విడుదలకు ముందే అంతా సిద్ధం చేసుకుంటున్న BYD: ఇక డెలివరీలు మరింత సులభమైపోతాయ్..

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్‌ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఒక పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు 5 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Atto 3 విడుదలకు ముందే అంతా సిద్ధం చేసుకుంటున్న BYD: ఇక డెలివరీలు మరింత సులభమైపోతాయ్..

కొత్త అటో 3 ఎలక్ట్రిక్ SUV పెద్ద 60.48 kWh బ్యాటరీ ప్యాక్ మరియు చిన్న 49.92kWh బ్యాటరీ ప్యాక్‌ పొందుతుంది. ఇందులోని పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 521 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని కూడా పొందుతుంది.

Atto 3 విడుదలకు ముందే అంతా సిద్ధం చేసుకుంటున్న BYD: ఇక డెలివరీలు మరింత సులభమైపోతాయ్..

ఛార్జింగ్ విషయానికి వస్తే, BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు 80 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 50 నిమిషాల్లో 0 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. అదే సమయంలో టైప్ 2 AC ఛార్జర్‌ని ఉపయోగించి, బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. కంపెనీ ఈ SUV కొనుగులుదారులకు 7kW AC హోమ్ ఛార్జర్‌తో పాటు 3kW AC పోర్టబుల్ ఛార్జింగ్ బాక్స్‌ వంటి వాటిని కూడా అందిస్తుంది. కావున సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Atto 3 విడుదలకు ముందే అంతా సిద్ధం చేసుకుంటున్న BYD: ఇక డెలివరీలు మరింత సులభమైపోతాయ్..

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు చైనా బ్రాండ్ అయినప్పటికీ సేఫ్టీలో చాలా సురక్షితమైన కారుగా నిలిచింది. అంతే కాకుండా ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కంపెనీ తన ఎలక్ట్రిక్ కారుని కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ సంవత్సరం చివరి నాటికి 23 షోరూమ్‌లను ప్రారభించాలనుకోవడం గొప్ప విషయం. దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త BYD ఎలక్ట్రిక్ కారు గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, November 5, 2022, 11:30 [IST]
English summary
Byd plans to expand 23 dealership before atto 3 delivery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+