పవర్ గ్రిడ్‌కు విద్యుత్ అందించే ఎలక్ట్రిక్ స్కూల్ బస్.. బివైడి కొత్త ఆవిష్కరణ..!
చైనాకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఆటో (BYD Auto) తాజాగా ఓ ఎలక్ట్రిక్ స్కూల్ బస్సును ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ స్కూల్ బస్సు పేరు బివైడి టైప్ ఎ (BYD Type A). బివైడి సంస్థ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూల్ బస్సును ప్రస్తుతం అమెరికన్ మార్కెట్ లను లక్ష్యంగా చేసుకుని పరిచయం చేసింది. అయితే, ఇది భారత మార్కెట్ కు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ సమాచారం ప్రకారం, పూర్తి చార్జ్ పై ఇది సుమారు 225 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది.

అంతేకాకుండా, ఈ స్కూల్ బస్సులోని బ్యాటరీ ప్యాక్ ద్వారా ఎలక్ట్రిక్ గ్రిడ్‌కు కూడా ఇది మద్దతు ఇవ్వగలదు. బివైడి (BYD) సంస్థ విస్తృత శ్రేణి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుంది. కంపెనీ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ కార్లు మరియు మినీవ్యాన్‌ల నుండి పెద్ద ఎలక్ట్రిక్ బస్సుల వరకు ఉన్నాయి. ఈ కంపెనీ తమ ఎలక్ట్రిక్ కార్లు మరియు కమర్షియల్ బస్సులను భారత మార్కెట్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

వాస్తవానికి, బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఆటో భారతదేశంలో తమ మొట్టమొదటి 'ఇ6' (e6) ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని గడచిన నవంబర్ నెలలో విడుదల చేసింది. బివైడి ఇ6 (BYD e6) ఎలక్ట్రిక్ ఎమ్‌పివి చూడటానికి ఇంచు మించు టొయోటా ఇన్నోవా మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో గరిష్టంగా 94 బిహెచ్‌పి పవర్ మరియు 180 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్ సాయంతో BYD e6 గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

బివైడి ప్రస్తుతం అమెరికన్ మార్కెట్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని జీరో-ఎమిషన్స్ స్కూల్ బస్సులను నిర్మించింది. అమెరికన్ స్కూల్ బస్ మార్కెట్ చాలా విస్తృతమైనది, ప్రస్తుతం ఈ విభాగంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఎలక్ట్రిక్ స్కూల్ బస్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, బివైడి ఈ మార్కెట్లోని అవకాశాలను దక్కించుకునేందుకు మరియు స్కూల్ బస్సులను పర్యావరణ సాన్నిహిత్యంగా మార్చాలని కంపెనీ భావిస్తోంది. గడచిన 2021లో, బివైడి టైప్ డి బస్సును పరిచయం చేయబడింది. ఇది 84 మంది ప్రయాణీకులకు వసతి కల్పించగల ఫుల్ సైజ్ స్కూల్ బస్సు.

కాగా, ఇప్పుడు, బివైడి బ్రాండ్ టైప్ ఎ ఎలక్ట్రిక్ బస్సును పరిచయం చేసింది. ఇదొక మినీ బస్సు లాంటిది, ఇందులో 30 మంది విద్యార్థుల కూర్చునే సామర్థ్యం ఉంటుంది. ఇది తక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రయాణించే మార్గాల్లో నడపడానికి ఉద్దేశించబడి రూపొందించబడినది. బివైడి టైప్ ఎ లిథియం అయాన్ బ్యాటరీల కంటే ఎక్కువ శక్తి సాంద్రత కలిగిన లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగిస్తుంది. ఫలితంగా, ఇది ఫుల్ చార్జ్ పై అదనపు రేంజ్ ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

వివిధ ఛార్జింగ్ పాయింట్ లకు అనుకూలంగా ఉండేలా బివైడి టైప్ ఎ ఎలక్ట్రిక్ బస్సుని19.2 కిలోవాట్ సింగిల్ ఫేజ్ ఏసి గ్రిడ్ అలాగే 150 కిలోవాట్ వరకు సామర్థ్యం కలిగిన డిసి ఫాస్ట్-ఛార్జర్‌ల ద్వారా ఛార్జ్ చేయవచ్చు. ఈ విశిష్టమైన ఫీచర్ కారణంగా టైప్ ఎ ఎలక్ట్రిక్ ఈ బస్సు ఇతర EVల నుండి వేరు చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సు గ్రిడ్ ఛార్జింగ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది. అంటే, ఈ బస్సు సాయంతో పాఠశాల పవర్ గ్రిడ్‌కు లేదా మరేదైనా భవనానికి అవసరమైన విద్యుత్తును సరఫరా చేయవచ్చు.

బస్సు నుండి పవర్ గ్రిడ్ కు కనెక్ట్ చేయడానికి కేబుల్ ఉపయోగించవచ్చు. ఇది బస్సు బ్యాటరీ సామర్థ్యంలో ఉంటే విద్యుత్తును, పాఠశాల విద్యుత్ గ్రిడ్ కి లేదా మరో మాటలో చెప్పాలంటే, తరగతి గదికి శక్తినిస్తుంది. పవర్ అవుటేజ్ సమయాల్లో ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్‌గా ఉంటుంది. ఈ బస్సును విడుదల చేసిన సందర్భంగా, బివైడి టోటల్ టెక్నాలజీ సొల్యూషన్స్ హెడ్ శామ్యూల్ కాంగ్ మాట్లాడుతూ, తమ టైప్ ఎ బస్సు యొక్క బై-డైరెక్షనల్ ఛార్జింగ్ సామర్ధ్యం ఈ విభాగంలో దీనిని గేమ్-ఛేంజర్ గా మారుస్తుందని కంపెనీ తెలిపింది.

పవర్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు పాఠశాల బస్సులను రాత్రిపూట ఛార్జ్ చేయవచ్చు మరియు తరగతి గదులను బాగా వెలుతురుగా ఉంచుతూ మరియు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ప్లగ్-ఇన్‌గా అందుబాటులో ఉంటూ, బస్సును నిలిపివేసినప్పుడు పాఠశాల సమయంలో స్వచ్ఛమైన ఉద్గార రహిత శక్తిని తరగతి గదిలోకి తిరిగి అందించవచ్చని ఆయన తెలిపారు.

అంతేకాకుండా, టైప్ ఎ బస్సుని ఇతర ఎలక్ట్రిక్ బస్సులతో వేరుగా ఉంచే మరొక ఫీచర్ ఏంటంటే, ఇది 360 కిలోగ్రాముల వరకు లిఫ్ట్ చేయగల ఆప్షనల్ పవర్డ్ లిఫ్ట్‌గేట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ వికలాంగుల కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాంప్రదాయ స్కూల్ బస్సులతో పోల్చుకుంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూల్ బస్సులు ఇంధనం మరియు నిర్వహణ ఖర్చుల విషయంలో 60 శాతం చౌకగా ఉంటాయని బివైడి తెలిపింది.


Click it and Unblock the Notifications








