మీ భీమా క్లెయిమ్ రద్దు కావడానికి ఇవే కారణాలు.. దానికి మీరే కారణం కూడా..!!

ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో వాహనాలు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వెహికల్ భీమా క్లెయిమ్ చేసి ఉంటారు. అయితే మీరు చేసే అనుకోని తప్పిదాల వల్ల అది కాస్త రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకీ భీమా రద్దు కావడానికిగల కారణాలు ఏమిటి? వాటి గురించి ఇతర వివరాలను ఇక్క తెలుసుకుందాం.. రండి.

మీ భీమా క్లెయిమ్ రద్దు కావడానికి ఇవే కారణాలు.. దానికి మీరే కారణం కూడా..!!

డ్రంక్ డ్రైవ్ (మద్యం తాగి డ్రైవ్ చేయడం):

డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చట్టరీత్యా నేరం. మద్యం తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడితే ఇక మీ సంగతి ఇక అంతే?.. భారీ జరిమానాలు విధించమే కాకుండా, డ్రైవింగ్ లైసెన్స్ పూర్తిగా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది.

అంతే కాకూండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న సమయంలో మీ వాహనానికి గానీ, లేదా ఇతర వ్యక్తులకు గానీ నష్టం కలిగిస్తే భీమా క్లెయిమ్ రద్దు చేయబడుతుంది. దీనిని తప్పకుండా భీమాదారుడు గుర్తుంచుకోవాలి.

మీ భీమా క్లెయిమ్ రద్దు కావడానికి ఇవే కారణాలు.. దానికి మీరే కారణం కూడా..!!

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ డ్రైవింగ్ చేయడం:

నిజానికి రోడ్డుపైన వాహనాలు డ్రైవ్ చేయాలంటే తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలా లేకుండా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కితే భారీ జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసి ప్రమాదం జరిగితే అది పూర్తిగా మీ తప్పుగానే పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీ భీమా క్లెయిమ్ రద్దు చేయబడుతుంది.

మీ భీమా క్లెయిమ్ రద్దు కావడానికి ఇవే కారణాలు.. దానికి మీరే కారణం కూడా..!!

సమాచారం అందించకుండా కష్టమైజేషన్ కారును డ్రైవ్ చేయడం:

ప్రజా రహదారులపైన సంబంధిత అధికారుల అనుమతి లేకుండా కష్టమైజేషన్ వెహికల్స్ నడపకూడదు. ఇది చట్ట విరుద్ధం. అంతే కాకూండా మీరు భీమా తీసుకున్న తరువాత మీ వాహనాన్ని కష్టమైజేషన్ చేస్తే భీమా రద్దు అయ్యే అవకాశం ఉంటుంది.

మొదట్లో మీరు బీమాను తీసుకునేటప్పుడే మీ వెహికల్ గురించి పూర్తి వివరాలు అందివ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత కష్టమైజేషన్ జరిగితే వారికి ముందుగా తెలియజేయాలి. అలా జరగకపోతే మీ భీమా రద్దవుతుంది, దీనిని కూడా వాహన వినియోగదారుడు గుర్తుంచుకోవాలి.

మీ భీమా క్లెయిమ్ రద్దు కావడానికి ఇవే కారణాలు.. దానికి మీరే కారణం కూడా..!!

వెహికల్ మీ పేరుమీద లేని సమయంలో:

మీరు కొత్త వాహనం కాకుండా సెకండ్ హ్యాండ్ కారుని కొనుగోలు చేసి దానిని మీ పేరుమీదకి మార్చుకోకుండా అలాగే ఉపయోగిస్తున్న సమయంలో కూడా మీ క్లెయిమ్‌ను రద్దు చేస్తారు. ఉదాహరణకు మీరు మీరు ఎవరో ఒకరి నుండి సెకండ్ హ్యాండ్ కారుని కొనుగోలు చేశారని అనుకుందాం, కానీ ఇప్పటి వరకు మీరు మీ పేరు మీద యాజమాన్యాన్ని బదిలీ చేయలేదు, అటువంటి సమయంలో ప్రమాదం జరిగితే పోలీసులు భీమా చూపించమని అడుగుతాడు. అటువంటి పరిస్థితిలో, మీరు కంపెనీని సంప్రదిస్తే, వాహనం RTO కింద మీ పేరు మీద లేనందున వారు వెంటనే మీ క్లెయిమ్‌ను రద్దు చేస్తారు.

మీ భీమా క్లెయిమ్ రద్దు కావడానికి ఇవే కారణాలు.. దానికి మీరే కారణం కూడా..!!

బీమా క్లెయిమ్‌లో జాప్యం:

ఏదైనా ఒక సంఘటన జరిగిన తరువాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి కొంత సమయం ఉంటుంది. కంపెనీ నిర్ణయించిన ఆ సమయంలో లోపల మీరు క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించకపోతే కంపెనీ మీ క్లెయిమ్‌ను రద్దు చేయబడుతుంది. ప్రతి కంపెనీకి ఈ కాలపరిమితి ఉంటుంది. కావున భీమాదారుడు బీమా క్లెయిమ్‌లో జాప్యం చేయకూడదు.

మీ భీమా క్లెయిమ్ రద్దు కావడానికి ఇవే కారణాలు.. దానికి మీరే కారణం కూడా..!!

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం:

మీరు డ్రైవింగ్ చేసే సమయంలో చాలా జాగరూకగా వ్యవహరించాలి, ఎందుకంటే రోడ్డుపైన మీరు మాత్రమే కాకుండా తోటి ప్రయాణికులు కూడా ప్రయాణిస్తూ ఉంటారు. ఆలాంటి సమయంలో మీరు నిర్లక్యంగా డ్రైవ్ చేస్తే ఊహకందని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల మీ భీమా పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంటుంది.

మీ భీమా క్లెయిమ్ రద్దు కావడానికి ఇవే కారణాలు.. దానికి మీరే కారణం కూడా..!!

పాలసీ షరతుల ఉల్లంఘించడం:

మీరు మీ కారుపైన భీమా చేసేటప్పుడు అది సొంత వినియోగానికా.. లేదా కమర్షియల్ పర్పస్ కా అనేది కూడా తెలియజేయాలి. మీరు సొంత వినియోగానికి ఉపయోగించే వాహనాన్ని కమర్షియల్ (వాణిజ్య) ప్రయోజనాలకు వినియోగించే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే అలాంటప్పుడు భీమా రద్దవుతుంది. ఇది పాలసీ షరతులను ఉల్లంఘించడం అంటారు.

మీ భీమా క్లెయిమ్ రద్దు కావడానికి ఇవే కారణాలు.. దానికి మీరే కారణం కూడా..!!

బీమా రెన్యూవల్ చేయకపోవడం:

మీరు ఉపయోగించే కారుకి నిర్దిష్ట సమయంలో రెన్యూవల్ చేయాలి, అలా కాకుండా రెన్యూవల్ చేయడంలో ఏదైనా జాప్యం జరిగితే కూడా మీ భీమా రద్దవుతుంది. ఉదాహరణకు మీ మీ కారు బీమా పాలసీ గడువు 5 రోజుల క్రితం ముగిసిందని మరియు మీరు రెన్యూవల్‌ను కోల్పోయారని అనుకుందాం. ఆరవ రోజు, మీరు ఒక ప్రమాదానికి గురవుతారు, దీనిలో మీ కారు తీవ్రంగా దెబ్బతింటుంది. అలాంటప్పుడు భీమా క్లెయిమ్ రద్దయిపోతుంది.

మీ భీమా క్లెయిమ్ రద్దు కావడానికి ఇవే కారణాలు.. దానికి మీరే కారణం కూడా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

వాహన వినియోగదారులు వాహనాలకు భీమా క్లెయిమ్ చేయడమే కాదు, క్లెయిమ్ నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలి. అలా కాకుండా మీరు ఆ నియమాలను ఉల్లంఘిస్తే భీమా క్లెయిమ్ రద్దు చేయబడుతుంది. భీమా క్లెయిమ్ రద్దు కావడానికి గల కారణాలను పైన వివరించడం జరిగింది, దీనిపైన మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, October 21, 2022, 7:00 [IST]
English summary
Car insurance claim can be rejected for these reasons and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+