మీ కారు ఇంటీరియర్‌ని మీరే డీటేలింగ్ చేసుకోండి.. ఇలా చేస్తే తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు!

కారు లోపల శుభ్రంగా ఉంచుకోవడం కొంచెం కష్టమైన పనే, కానీ సరైన విధానం మరియు సరైన సాధనాలతో, దీనిని చాలా సులభంగా చేయవచ్చు. మనమే స్వయంగా ఇంటీరియర్ ను క్లీన్ చేసుకోవడం ద్వారా డీటేలింగ్ కోసం ఖర్చు చేసే డబ్బును చాలా వరకూ ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఇలా క్లీన్ చేసుకోవడం మీకు ఓ కొత్త అనుభూతిని మరియు మనస్సు ఎంతో ఉల్లాసాన్ని అందిస్తుంది.

మీ కారు ఇంటీరియర్‌ని మీరే డీటేలింగ్ చేసుకోండి.. ఇలా చేస్తే తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు!

సరే ఆలస్యం చేయకుండా, వెంటనే మీ కారు ఇంటీరియర్ ని ఎలా డీటేల్ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. ముందుగా, మీ కారు లోపలి భాగాన్ని శుభ్రం చేయడానికి మీకు వస్తువులు అవసరం అవుతాయి. వీటిలో మైక్రోఫైబర్ క్లాత్, గట్టి బ్రిస్టల్ బ్రష్, బకెట్, స్ప్రే బాటిల్, వ్యాక్యూమ్ క్లీనర్, డీటేలింగ్ బ్రష్, డస్టర్, అమ్మోనియా లేని విండో క్లీనర్, ఆల్కహాల్ ఆధారిత గ్లాస్ క్లీనర్ మరియు డిస్‌ఇన్‌ఫెక్టివ్ వైప్స్.

మీ కారు ఇంటీరియర్‌ని మీరే డీటేలింగ్ చేసుకోండి.. ఇలా చేస్తే తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు!

మొదటి దశ

ముందుగా మీ కారులో ఉండే చెత్త, పనికిరాని వస్తువులు మరియు ఫ్లోర్ మ్యాట్లను తీసివేయండి. ఫ్లోర్ మ్యాట్స్ క్రింద పేరుకు పోయిన దుమ్ము, ధూళిని తొలగించడానికి మీ వద్ద వాక్యూమ్ క్లీనర్ ఉంటే ఉపయోగించండి. వాక్యూమ్ క్లీనర్ లేనట్లయితే, ఫ్లోర్ మ్యాట్‌ను లోతుగా శుభ్రం చేయడానికి కార్పెట్ క్లీనర్ మరియు బ్రష్‌ను ఉపయోగించవచ్చు. ఒకవేళ, మీరు రబ్బర్ ఫ్లోర్ మ్యాట్‌ని ఉపయోగిస్తుంటే, దానిని శుభ్రం చేయడానికి మీరు ఏదైనా లిక్విడ్ సోప్ మరియు పాత మైక్రోఫైబర్ క్లాత్‌ని ఉపయోగించవచ్చు. రబ్బరు మ్యాట్లపై మరకలు శుభ్రం చేయడం చాలా సులభంగా ఉంటుంది.

మీ కారు ఇంటీరియర్‌ని మీరే డీటేలింగ్ చేసుకోండి.. ఇలా చేస్తే తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు!

రెండవ దశ

ఈ దశలో మీరు మీ కారు లోపలి భాగాన్ని పూర్తిగా వాక్యూమ్ చేయడం చాలా ముఖ్యం. దీని వలన కారు లోపల ఏదైనా వదులుగా ఉండే మురికిని సులభంగా తొలగించవచ్చు. అలాగే, మీరు కార్పెట్ లేదా ఇంటీరియర్ ట్రిమ్‌కు అంటుకున్న ధూళిని వదిలించడానికి మెత్తగా ఉండే బ్రష్‌లను ఉపయోగించవచ్చు. కారులోని సున్నితమైన ప్రదేశాలలో ఉండే దుమ్ము, ధూళిని వదిలించడానికి వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించకూడదు. ఇలా చేయడం వలన ఆ ప్రదేశాలలో గీతలు పడే అవకాశం ఉంది. కాబట్టి, స్టీరింగ్ వీల్, డ్యాష్‍‌బోర్డ్, ఏసి వెంట్స్, ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన వాటిని క్లీన్ చేయడం కోసం మృదువైన డీటేలింగ్ బ్రష్ ను మాత్రమే ఉపయోగించాలి.

మీ కారు ఇంటీరియర్‌ని మీరే డీటేలింగ్ చేసుకోండి.. ఇలా చేస్తే తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు!

మూడవ దశ

కారు లోపల అంచులలో పేరుకున్న మురికి, ధూళిని శుభ్రం చేయడం కష్టమైన పని. ఒకవేళ, మీకు ఈ మురికి క్లీన్ చేయడం కష్టంగా అనిపిస్తే, మీరు ఈ మురికిని తొలగించడానికి మైక్రోఫైబర్ క్లాత్, బ్రష్‌లు మరియు అమ్మోనియా లేని క్లీనింగ్ లిక్విడ్స్ ని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం మీ కారు ఇంటీరియర్ దాదాపుగా కొత్తదానిలా నిగనిగా మెరిసిపోతుంది. ఇలా క్లీన్ చేసే టప్పుడు పదునుగా ఉండే వస్తువులను ఉపయోగించకండి మరియు ఎక్కువ బలంతో క్లీన్ చేయకండి.

మీ కారు ఇంటీరియర్‌ని మీరే డీటేలింగ్ చేసుకోండి.. ఇలా చేస్తే తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు!

నాల్గవ దశ

ఈ దశలో కారు అద్దాలను లోపలి వైపు నుండి శుభ్రం చేయండి. దీని కోసం, మీరు ఆల్కహాల్ ఆధారిత గ్లాస్ క్లీనర్‌ను ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, ఈ దశ కోసం శుభ్రమైన మైక్రోఫైబర్ క్లాత్ ని ఉపయోగించడం చాలా అవసరం. గ్లాస్‌ని శుభ్రం చేయడానికి, ముందుగా మైక్రోఫైబర్ క్లాత్‌పై ఆల్కహాల్ ఆధారిత క్లీనర్‌ను అప్లై చేసి గ్లాస్‌పై మెల్లిగా తుడవండి. దీని తరువాత, మైక్రోఫైబర్ క్లాత్ యొక్క శుభ్రమైన వైపును ఉపయోగించి, విండోలను తుడవండి.

మీ కారు ఇంటీరియర్‌ని మీరే డీటేలింగ్ చేసుకోండి.. ఇలా చేస్తే తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు!

ఐదవ దశ

కారు లోపలి భాగంలో త్వరగా క్రిములు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి, కారుని క్రిమిసంహారకం చేయడం కోసం క్రిమిసంహారక వైప్‌లు (డిస్‌ఇన్‌ఫెక్టివ్ వైప్స్) ఉపయోగించి అన్ని ఉపరితలాలపై శుభ్రంగా క్లీన్ చేయండి. ఈ ప్రక్రియ వలన అన్ని సూక్ష్మక్రిములను మరియు బ్యాక్టీరియాను చంపడమే కాకుండా, కొంతవరకు వీటి పెరుగుదలను కూడా నిరోధించవచ్చు.

మీ కారు ఇంటీరియర్‌ని మీరే డీటేలింగ్ చేసుకోండి.. ఇలా చేస్తే తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు!

ఆరవ దశ

మీరు కారు లోపలకి ప్రవేశించిన ప్రతిసారి మీ మనస్సు ఉల్లాసంగా ఉండాలంటే, కారులో మంచి ఎయిర్ ఫ్రెషనర్ ఉండటం చాలా అవసరం. మీ కారు ఇంటీరియర్ వాసనను ఆహ్లాదకరంగా ఉంచడానికి మీరు ఇప్పుడు కొత్త కార్ ఎయిర్ ఫ్రెషనర్‌ని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వలన కారు లోపల క్లీన్ చేసిన తర్వాత సోప్ మరియు ఆల్కహాల్ ఆధారిత క్లీనర్ వాసనను కూడా ఈ ఎయిర్ ఫ్రెషనర్లు తొలగిస్తాయి.

మీ కారు ఇంటీరియర్‌ని మీరే డీటేలింగ్ చేసుకోండి.. ఇలా చేస్తే తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు!

పై దశలను అనుసరించి, మీ కారు ఇంటీరియర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వలన మీ కారు జీవితచక్రం అంతటా దాని ఇంటీరియర్ శుభ్రంగా ఉండటమే కాకుండా, కారులో ప్రయాణించే వారి ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది. మీ కారు ఇంటీరియర్‌ను ఎంత తరచుగా శుభ్రం చేయాలా అనేది మీరు ఉపయోగించే తీరును బట్టి ఉంటుంది. ప్రతినెలా కనీసం ఒక్కసారైనా మీ కారు కోసం కొంత సమయం కేటాయించి, ఇంటీరియర్ ను క్లీన్ చేసుకుంటే మంచిదని నిపుణలు చెబుతున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, July 21, 2022, 9:34 [IST]
English summary
Car interior cleaning step by step guide details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+