కొత్త సంవత్సరంలో ధరలు పెంచనున్న కార్ కంపెనీలు.. ఇవే

2021 ముగిసిపోయింది.. ఎట్టకేలకు 2022 కూడా ప్రారంభమయ్యింది. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో తమ వాహనాల ధరలను పెంచనున్నాయి. ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో ధరలు పెంచనున్న కార్ కంపెనీలను గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

కొత్త సంవత్సరంలో ధరలు పెంచనున్న కార్ కంపెనీలు.. ఇవే

మారుతి సుజుకి (Maruti Suzuki):

భారతీయ మార్కెట్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ప్రసిద్ధి పొందిన 'మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్' (Maruti Suzuki India Ltd) తమ ఉత్పత్తుల ధరలను 2022 జనవరి నుంచే పెంచనున్నట్లు తెలిపింది. ధరలు పెరగడానికి ప్రధాన కారణం ముడిసరుకుల కొరత మరియు ముడిసరుకుల ధరల పెరుగుదల అని కూడా కంపెనీ తెలిపింది. అయితే కంపెనీ ఏ మోడల్ పైన ఎంత ధర పెంచుతుంది అనే విషయం త్వరలో అధికారికంగా తెలుస్తుంది.

కొత్త సంవత్సరంలో ధరలు పెంచనున్న కార్ కంపెనీలు.. ఇవే

టాటా మోటార్స్ (Tata Motors):

స్వదేశీ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' (Tata Motors) కూడా ధరల పెంచనున్న కంపెనీల జాబితాలో ఉంది. ఇప్పటివరకు, ప్యాసింజర్ వాహనాల విభాగంలో ఈ ఏడాది రెండుసార్లు ధరలను కంపెనీ సవరించింది. అయితే ఇప్పుడు ఈ నెల ప్రారంభం నుంచి తమ వాహనాల ధరలను పెంచే అవకాశం ఉంది. అయితే ఏ మోడల్స్ పైన ఎంత ధర పెరుగుతుంది అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు, దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ త్వరలో వెల్లడిస్తుంది.

కొత్త సంవత్సరంలో ధరలు పెంచనున్న కార్ కంపెనీలు.. ఇవే

టయోటా (Toyota):

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ భారతీయ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొడగలిగింది. ఈ కంపెనీ యొక్క వాహనాలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతూ మంచి ఆదరణతో ముందుకుసాగుతున్నాయి. అయితే కంపెనీ 2022 జనవరి నుంచి తమ వాహనాల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది.

వాహన తయారీకి కావాల్సిన ముడిసరుకుల ధరలు పెరగటం వల్ల తమ ఉత్పత్తుల ధరలను పెంచవలసి వచ్చిందని, కంపెనీ తెలిపింది. పెరిగిన కొత్త ధరల జాబితా త్వరలో వెల్లడవవుతుంది. అయితే పెరిగిన ధరలు అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

కొత్త సంవత్సరంలో ధరలు పెంచనున్న కార్ కంపెనీలు.. ఇవే

సిట్రోయెన్ ఇండియా (Citroen India):

ప్రముఖ ప్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ దేశీయ మార్కెట్లో సి5 ఎయిర్ క్రాస్ SUV విడుదల చేసి మంచి ఆదరణ పొందుతోంది. అయితే కంపెనీ రానున్న కొత్త సంవత్సరంలో మరో కొత్త మోడల్ భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అంతే కాకూండా రానున్న కొత్త సంవత్సరంలో కంపెనీ యొక్క ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే కంపెనీ తమ సి5 ఎయిర్ క్రాస్ SUV ధరను ఎక్కువ మొత్తంలో పెంచింది.

కొత్త సంవత్సరంలో ధరలు పెంచనున్న కార్ కంపెనీలు.. ఇవే

స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India):

దేశీయ మార్కెట్లో స్కోడా ఆటో ఇండియా 2022 జనవరి నెలలో భారతదేశంలో తమ కార్ల ధరలను మరింత పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దేశీయ మార్కెట్లో ముడిసరుకుల ధరలు అమాంతం పెరగడం వల్ల తమ ఉత్పత్తుల ధరలు పెంచడం జరిగిందని కంపెనీ తెలిపింది. అయితే ఏ వేరియంట్ పైన ఎంత ధర పెరుగుతుంది అనే విషయం ఇంకా అధికారికంగా తెలియలేదు, త్వరలో కంపెనీ వెల్లడిస్తుంది.

కొత్త సంవత్సరంలో ధరలు పెంచనున్న కార్ కంపెనీలు.. ఇవే

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen India):

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కంపెనీ కూడా తమ ఉత్పత్తుల ధరలను ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పెంచే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే తెలిపింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం తమ ఉత్పత్తులపైన 5 శాతం ధరలు పెరగనున్నాయి.

కొత్త సంవత్సరంలో ధరలు పెంచనున్న కార్ కంపెనీలు.. ఇవే

మెర్సిడెస్-బెంజ్ ఇండియా (Mercedes Benz India):

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కూడా ధరలు పెంచనున్న కంపనీల జాబితాలో ఉంది. కంపెనీ తమ ఉత్పత్తులను 2022 జనవరి 01 నుంచే పెంచనున్నట్లు తెలిపింది. అయితే ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రెండు శాతం వరకు పెంచే ప్రణాళికను ప్రకటించింది.

కొత్త సంవత్సరంలో ధరలు పెంచనున్న కార్ కంపెనీలు.. ఇవే

ఆడి ఇండియా (Audi India):

జర్మన్ దేశానికి చెందిన మరో లగ్జరీ కార్ తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా తన మొత్తం మోడల్ శ్రేణిలో కార్ల ధరలను పెంచే ప్రణాళికలను ప్రకటించింది. ఇది 2022 జనవరి 01 నుంచి అమ్మలులోకి రానుంది. ధరలు మూడు శాతం వరకు పెరుగుతాయని అంచనా వేయబడింది మరియు మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి మారుతుంది. ఇన్‌పుట్ మరియు నిర్వహణ ఖర్చులు పెరగడం ధరల పెరుగుదలకు కారణమని కంపెనీ పేర్కొంది.

కొత్త సంవత్సరంలో ధరలు పెంచనున్న కార్ కంపెనీలు.. ఇవే

వోల్వో ఇండియా (Volvo India):

స్వీడన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ వోల్వో (Volvo) తమ కార్ల ధరలను కొత్త సంవత్సరం 2022 జనవరి 01 నుంచి పెంచనున్నట్లు అధికారికంగా తెలిపింది. కంపెనీ ఇప్పుడు తమ కార్ల ధరలను రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు పెంచునున్నట్లు తెలిపింది.

కొత్త సంవత్సరంలో ధరలు పెంచనున్న కార్ కంపెనీలు.. ఇవే

వోల్వో (Volvo) కంపెనీ దేశీయ మార్కెట్లో XC40, XC60, XC90 మరియు S90 అనే మొత్తం నాలుగు మోడల్స్ విక్రయిస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు జనవరి 01 నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే తెలిపాయి. ఇప్పుడు వోల్వో కూడా ఈ బాటలోనే నడుస్తోంది. కావున జనవరి 01 నుంచి వోల్వో కార్ల ధరలు కూడా అమాంతం పెరగనున్నాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Cars companies set to hike price maruti suzuki tata motors details
Story first published: Saturday, January 1, 2022, 12:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X