హోండా హైబ్రిడ్ కారు (Honda City e:HEV)ని చెక్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

భారతదేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా, కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల హైడ్రోజన్‌తో నడిచే టొయోటా మిరాయ్ సెడాన్‌ను నడపడం ప్రారంభించారు. తాజాగా, మరొక జపనీస్ కార్ బ్రాండ్ హోండా కూడా ఇటీవలే భారత మార్కెట్లో తమ కొత్త హైబ్రిడ్ కారు హోండా సిటీ ఇ-హెచ్‌ఇవి (Honda City e:HEV) ని విడుదల చేసిన సంగతి తెలిసినదే. నితిన్ గడ్కరీ ఇప్పుడు ఈ కారును కూడా స్వయంగా చెక్ చేశారు. కంపెనీ సిబ్బందని కలిసి, వివరాలు అడిగి తెలుసుకన్నారు.

హోండా హైబ్రిడ్ కారు (Honda City e:HEV)ని చెక్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

హోండా సిటీ ఇ:హెచ్ఈవి భారతదేశంలోనే మొట్టమొదటి మాస్-సెగ్మెంట్ ఫుల్-హైబ్రిడ్ కారుగా ఉంది. ఇది ఇతర మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ మాదిరిగా కాకుండా, మరింత సమర్థవంతమైన పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం, హోండా కార్స్ ఇండియా బృందం నితిన్ గడ్కరీని అతని నివాసంలో కలుసుకుని, ఆయనకు ఈ కొత్త హైబ్రిడ్ కారు గురించి మరియు దాని మైలేజ్, ఫీచర్లు తదితర వివరాల గురించి వెల్లడించారు. నితిన్ గడ్కరీ సరికొత్త హోండా సిటీ ఇ-హెచ్‌ఇవిని తనిఖీ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను హోండా కార్స్ ఇండియా తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

హోండా హైబ్రిడ్ కారు (Honda City e:HEV)ని చెక్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

నితిన్ గడ్కరీతో ఏర్పాటైన ఈ సమావేశానికి హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) కునాల్ బెహ్ల్, అతని సహచరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో, హోండా కార్స్ ఇండియా నితిన్ గడ్కరీకి ఓ తెలుపు రంగు హోండా సిటీ ఇ:హెచ్‌ఇవి హైబ్రిడ్ కారును ప్రదర్శించారు. కొత్త హోండా సిటీ హైబ్రిడ్ కారు, చూడటానికి అచ్చం దాని పెట్రోల్ వేరియంట్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, ఈ రెండు మోడళ్లను వేరు చేసేందుకు కంపెనీ ఈ హైబ్రిడ్ కారు ఎక్స్టీరియర్‌లో చిన్నపాటి మార్పులు చేసింది.

హోండా హైబ్రిడ్ కారు (Honda City e:HEV)ని చెక్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

భారత మార్కెట్లో హోండా సిటీ ఇ:హెచ్‌ఈవీ హైబ్రిడ్ కారు కేవలం ఒకే ఒక వేరియంట్‌లో (ZX) ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభ్యం కానుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.19.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. మీ కంపారిజన్ కోసం.. ఇందులోని స్టాండర్డ్ ఫుల్ పెట్రోల్ వెర్షన్ హోండా సిటీ యొక్క టాప్-ఎండ్ (ZX CVT) వేరియంట్ ధర రూ. 15.03 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అంటే, స్టాండర్డ్ టాప్-ఎండ్ వేరియంట్‌తో పోలిస్తే, ఈ హైబ్రిడ్ వేరియంట్ ధర సుమారు రూ.4.47 లక్షలు అధికంగా ఉంటుంది.

హోండా హైబ్రిడ్ కారు (Honda City e:HEV)ని చెక్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

హోండా తమ ఐదవ తరం హోండా సిటీ సెడాన్‌ను ఆధారంగా చేసుకొని ఈ హైబ్రిడ్ వేరియంట్‌ను తయారు చేసింది. ఇదివరకు చెప్పుకున్న దీని ఓవరాల్ డిజైన్‌లో ఎలాంటి మార్పు లేనప్పటికీ, ఈ హైబ్రిడ్ వేరియంట్‌ను హైలైట్ చేసేందుకు కంపెనీ ఫ్రంట్ గ్రిల్ పైన మందపాటి క్రోమ్ స్ట్రిప్‌ మరియు ఆ గ్రిల్‌లో స్టాండర్డ్ మోడల్‌లో కనిపించే హారిజాంటల్ స్లాట్‌లకు బదులుగా ఉండే హనీకోంబ్ ప్యాటర్న్ లను ఉపయోగించింది. ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటాయి, వీటిలో ఎలాంటి మార్పు ఉండదు.

హోండా హైబ్రిడ్ కారు (Honda City e:HEV)ని చెక్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ఇకపోతే, ఈ హైబ్రిడ్ వేరియంట్ యొక్క ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ పూర్తిగా రీడిజైన్ చేయబడి ఉంటుంది, ఇప్పుడు ఇది చూడటానికి పంజా లాంటి స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ముందు భాగంలో కనిపించే మరొక ప్రధానమైన మార్పు ఏంటంటే, దాని ఫ్రంట్ హోండా లోగో. స్టాండర్డ్ సిటీ వేరియంట్లలో ఇది పూర్తి క్రోమ్‌లో ఉంటుంది, అయితే, హైబ్రిడ్ వేరియంట్‌లో మాత్రం ఇది బ్లూ కలర్ యాక్సెంట్‌లను కలిగి ఉండి, ఇది హైబ్రిడ్ వాహనం అని గుర్తు చేస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్-అవుట్ B-పిల్లర్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, 16 ఇంచ్ డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ వంటి మార్పులు ఉంటాయి.

హోండా హైబ్రిడ్ కారు (Honda City e:HEV)ని చెక్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

హోండా సిటీ ఇ:హెచ్‌ఈవి కారులో ఉపయోగించిన హైబ్రిడ్ పవర్‌ట్రైన్ సెటప్ కారణంగా, ఇది లీటరుకు 26.5 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారులో స్టాండర్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లు కూడా ఉంటాయి. ఇందులోని 1.5 లీటర్ అట్కిన్సన్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లు కలిసి గరిష్టంగా 109 బిహెచ్‌పి శక్తిని మరియు 253 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్లు కారు ముందు చక్రాలపై అమర్చబడి ఉంటాయి. ఇవి ఒకే ఫిక్స్‌డ్ రేషియో eCVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

హోండా హైబ్రిడ్ కారు (Honda City e:HEV)ని చెక్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ఈ హైబ్రిడ్ వేరియంట్‌లో స్టాండర్డ్ పెట్రోల్ మోడల్ సిటీ యొక్క టాప్-ఎండ్ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లకు అదనంగా, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే మరియు హోండా వెబ్‌లింక్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో సహా) మరియు అమెజాన్ అలెక్సా మరియు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో పాటుగా హోండా సెన్సింగ్ టెక్నాలజీలో భాగంగా కంపెనీ అనేక అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లను మరియు సేఫ్టీ ఫీచర్లు కూడా అందిస్తోంది.

హోండా హైబ్రిడ్ కారు (Honda City e:HEV)ని చెక్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

వారంటీ విషయానికి వస్తే, హోండా సిటీ ఇ:హెచ్‌ఈవి హైబ్రిడ్ కారుపై కంపెనీ 3 ఏళ్లు లేదా అపరిమిత కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు 5 సంవత్సరాల పొడగించిన వారంటీ (ఎక్స్‌టెండెడ్ వారంటీ) లేదా కారు కొనుగోలు చేసిన తేదీ నుండి 10 ఏళ్ల వరకూ ఎప్పుడైనా వారంటీ (ఎనీటైమ్ వారంటీ)ని కొనుగోలు చేయవచ్చు. కాగా, ఇందులో ఉపయోగించిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌పై కారు కొనుగోలు చేసిన తేదీ నుండి 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్లు (ఏది ముందుగా ముగిస్తే) పరిమిత వారంటీని కూడా కంపెనీ అందిస్తోంది. ఈ హైబ్రిడ్ వేరియంట్‌ను మేము ఇటీవలే టెస్ట్ డ్రైవ్ చేశాము. - పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Central transport minister nitin gadkari checks out new honda city e hev hybrid car
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X