Just In
- 1 hr ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- 3 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 11 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
- 17 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
Don't Miss
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్‌తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'సిట్రోయెన్ సి3' బుక్ చేసుకున్న కస్టమర్లకు గుడ్ న్యూస్.. అదేంటో ఇక్కడ చూడండి
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ భారతీయ మార్కెట్లో ఇటీవల తన కొత్త 'సిట్రోయెన్ సి3' (Citroen C3) విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ SUV ప్రారంభ ధర రూ. 5.71 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.06 లక్షలు. కంపెనీ ఈ SUV కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఇప్పుడు కంపెనీ బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.
సిట్రోయెన్ కంపెనీ తన సి3 SUV ని డెలివరీ చేసిన ఫోటోలు ఇక్కడ చూడవచ్చు. అయితే డెలివరీలు ఎక్కడ జరిగాయి, ఎన్ని యూనిట్లు డెలివరీ చేయబడ్డాయి అనే వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది.
సిట్రోయెన్ కంపెనీ తన కొత్త ఎస్‌యూవీని రెండు వేరియంట్లలో విడుదల చేసింది. అవి లైవ్ మరియు ఫీల్ వేరియంట్. ఈ రెండూ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. సిట్రోయెన్ సి3 భారతదేశంలో ఉత్పత్తి కానున్న మేడ్-ఇన్-ఇండియా ప్రోడక్ట్. ఎందుకంటే ఇది భారతదేశంలో ఉత్పత్తి కానున్న సిట్రోయెన్ కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తి.
కొత్త సిట్రోయెన్ సి3 నాలుగు మోనో-టోన్ మరియు రెండు డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లలో అందించబడుతుంది. అవి పోలార్ వైట్, స్టీల్ గ్రే, జెస్టీ ఆరెంజ్ మరియు ప్లాటినం గ్రే అనే మోనో కలర్స్ మరియు జెస్టీ ఆరెంజ్ విత్ ప్లాటినం గ్రే రూఫ్ మరియు పోలార్ వైట్‌తో జెస్టీ ఆరెంజ్ కలర్ రూఫ్ అనే డ్యూయెల్ టోన్ కలర్స్.
సిట్రోయెన్ సి3 ఎస్యూవీ రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, కాగా మరొకటి 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.
ఇందులోని 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ 81 బిహెచ్పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. టర్బోచార్జ్డ్ వెర్షన్ యొక్క 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది.
ఈ కొత్త ఎస్యూవీ డిజైన్ విషయానికి వస్తే, ముందు భాగంలోని బంపర్లపై కలర్-కోడెడ్ ఇన్సర్ట్లు, గ్రిల్‌తో కలిసే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, హెక్సా గోనల్ ఎయిర్ డ్యామ్, X-షేప్ లో ఉండే ఫాక్స్ స్కఫ్ ప్లేట్, రూఫ్ రెయిల్స్ మరియు బాడీ క్లాడింగ్ ఉన్నాయి. ఇది 15 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇక వెనుక భాగంలో ర్యాపరౌండ్ టెయిల్-లైట్స్ చక్కగా అమర్చబడి ఉన్నాయి.
కొత్త సి3 ఎస్‌యూవీలోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, ఫోర్-స్పీకర్స్, యుఎస్బి ఛార్జింగ్ సాకేట్ వంటివి మాత్రమే కాకుండా మిర్రర్ స్క్రీన్ ఫంక్షన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వర్టికల్ ఏసీ వెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
సిట్రోయెన్ సి3 పరిమాణం గమినించినట్లైతే ఇది 3,981 మిమీ పొడవు, 1,733 మిమీ వెడల్పు, 1,586 మిమీ ఎత్తు మరియు వీల్‌బేస్ 2540 మిమీ వరకు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ మరియు బూట్ స్పేస్ 315 లీటర్ల వరకు ఉంటుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబిడి, సెంట్రల్ లాక్/అన్‌లాక్ బటన్, డీఫాగర్, పవర్డ్ వింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ మరియు సీట్‌బెల్ట్ రిమైండర్ వంటివి ఉన్నాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన కోట్ సిట్రోయెన్ సి3 టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మరియు మారుతి సుజుకి ఇగ్నిస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
కంపెనీ ఇప్పుడు తన సిట్రోయెన్ సి3 పైన 2 సంవత్సరాలు లేదా 40,000 కిమీల వారంటీ అందిస్తుంది. అదే సమయంలో విడి భాగాలు మరియు యాక్ససరీస్ పైన ఒక సంవత్సరం లేదా 10,000 కిమీల వారంటీ అందుబాటులో ఉంటుంది. 24/7 రోడ్‌సైడ్ అసిస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
Source: Cardekho