Citroen నుంచి రానున్న C3 SUV లాంచ్ ఎప్పుడో తెలుసా..?

సిట్రోయెన్ కంపెనీ భారతీయ మార్కెట్లో మరో కొత్త SUV విడుదల చేయనుంది. ఈ SUV 'సిట్రోయెన్ సి3'. ఇప్పటికే కంపెనీ తన సి5 మోడల్ విక్రయిస్తోంది. అయితే కంపెనీ త్వరలోనే సి3 అనే చిన్న SUV ని తీసుకురానుంది. ఇది కంపెనీ నుంచి భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న రెండవ మోడల్. ఇది 2022 జూన్ నాటికి భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త SUV గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Citroen నుంచి రానున్న C3 SUV లాంచ్ ఎప్పుడో తెలుసా..?

త్వరలో రానున్న కొత్త సిట్రోయెన్ సి3 SUV కంపెనీ యొక్క స్టాండర్డ్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఈ SUV స్పాట్ టెస్ట్ లో చాలాసార్లు కనిపించింది. సిట్రోయెన్ సి3 SUV ని కంపెనీ 'మేడ్ ఇన్ ఇండియా ఫర్ ఇండియన్స్'గా అభివర్ణించింది. కావున ఇది భారతదేశంలోనే ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.

Citroen నుంచి రానున్న C3 SUV లాంచ్ ఎప్పుడో తెలుసా..?

భారతదేశంలోని కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లో బలమైన ప్రత్యర్థులు ఉండటం వల్ల రానున్న ఈ సి3 SUV గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ఇది మిగిలిన ప్రత్యర్థులకంటే కూడా చాలా ప్రత్యేకంగా మరియు కొంత భిన్నంగా ఉండాలి. కావున ఈ సిట్రోయెన్ సి3 SUV 78 విభిన్న యాక్ససరీస్ తో మరియు అనేకరకాల కస్టమైజేషన్ ఆప్సన్స్ తో రానుంది.

Citroen నుంచి రానున్న C3 SUV లాంచ్ ఎప్పుడో తెలుసా..?

అది మాత్రమే కాకుండా.. ఈ సబ్-4మీ SUV 4 విభిన్న ఎక్స్టీరియర్ కలర్ ఆప్సన్స్ పొందటమే కాకుండా, రెండు వేర్వేరు రూఫ్ కలర్ ఆప్షన్‌లతో అందుబాటులోకి వస్తుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కావున చూపరులను ఒక్క సారికే కట్టిపడేస్తుంది.

Citroen నుంచి రానున్న C3 SUV లాంచ్ ఎప్పుడో తెలుసా..?

ఇందులోని ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు నావిగేషన్ వంటి విభిన్న ఫీచర్స్ అందిస్తుంది. అంతే కాకూండా, సి3 SU లో 1-లీటర్ గ్లోవ్ బాక్స్, ముందు మరియు వెనుక రెండు 2-లీటర్ డోర్ పాకెట్‌లు ఉన్నాయి. దీనితో పాటు, సెంట్రల్ కన్సోల్‌లో స్టోరేజ్, స్మార్ట్‌ఫోన్ హోల్డర్‌గా పనిచేసే వెనుక భాగంలో రెండు కప్పు హోల్డర్లు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు డ్రైవింగ్ సమయంలో ఎంతగానో అనుకూలంగా ఉంటాయి.

Citroen నుంచి రానున్న C3 SUV లాంచ్ ఎప్పుడో తెలుసా..?

ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. 2022 సిట్రోయెన్ సి3 SUV ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌తో రావచ్చు, ఇది ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌తో వచ్చిన భారతదేశపు మొదటి SUV అవుతుంది. ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్ పెట్రోలు మరియు ఇథనాల్ ఆధారిత ఇంధనం రెండింటిలోనూ పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Citroen నుంచి రానున్న C3 SUV లాంచ్ ఎప్పుడో తెలుసా..?

ఇందులోని ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్ 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్, ఇది 130 బిహెచ్‌పి పవర్గ ఉత్పత్తి చేయగలదు. అయితే, ఈ ఇంజన్ మరింత ఇంధన సామర్థ్యం అందించడం కోసం కంపెనీ అనుకూలంగా ట్యూన్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, కంపెనీ మొత్తం ఉత్పత్తి ఖర్చులను తగ్గించడానికి వారి ప్రస్తుత 1.6-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ ఇంజన్ ఆధారంగా 1.5-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందించే అవకాశం ఉంటుంది.

Citroen నుంచి రానున్న C3 SUV లాంచ్ ఎప్పుడో తెలుసా..?

కొత్త సిట్రోయెన్ సి3 SUV లో 315 లీటర్ల బూట్ స్పేస్‌, 653 మిమీ లెగ్‌రూమ్‌ మరియు 991 మిమీ హెడ్‌రూమ్ అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రయాణ సమయంలో వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. సిట్రోయెన్ సి3 రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వెర్షన్ కారుని కూడా విడుదల ఉంది.

Citroen నుంచి రానున్న C3 SUV లాంచ్ ఎప్పుడో తెలుసా..?

సిట్రోయెన్ సి3 సూప్ నాలుగు బాడీ కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి స్నో వైట్, ప్లాటినం గ్రే, ఆర్టెన్స్ గ్రే మరియు జెస్టీ ఆరంజ్ కలర్స్. ఇక రూప్ కలర్స్ విషయానికి వస్తే, ఇది ఆర్టెన్స్ గ్రే మరియు జెస్టీ ఆరంజ్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Citroen నుంచి రానున్న C3 SUV లాంచ్ ఎప్పుడో తెలుసా..?

'2022 సిట్రోయెన్ సి3' అనేది భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కంపెనీ యొక్క రెండవ ఉత్పత్తి. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండనుంది. సి3 SUV భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా XUV300 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకూండా దీని ధర కూడా కస్టమర్లు ఆశించిన స్థాయిలోనే ఉంటుంది, కావున మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 25, 2022, 15:22 [IST]
English summary
Citroen c3 india launch by june 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+