భారత మార్కెట్లో జులై 20 న విడుదల కానున్న సిట్రోయెన్ సి3: వివరాలు
భారతీయ మార్కెట్లో 'సిట్రోయెన్' (Citroen) కంపెనీ తన 'సి3' (C3) ఎస్‌యూవీని ఎప్పుడు విడుదల చేస్తుందా అని ఎదురుచూసే కస్టమర్లకు కంపెనీ ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని వచ్చే నెల (జులై) 20 న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంతే కాకూండా బుకింగ్స్ కూడా జులై 01 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సిట్రోయెన్ సి3 (Citroen C3) అనేది భారతీయ మార్కెట్లో కంపెనీ విడుదల చేయనున్న రెండవ మోడల్. ఇప్పటికే మార్కెట్లో సి5 ఎయిర్ క్రాస్ మంచి ప్రజాదరణ పొందుతోంది. కావున రానున్న ఈ కొత్త ఎస్‌యూవీ కూడా తప్పకుండా మార్కెట్లో మంచి అమ్మకాలను పొందే ఆకాశం ఉంటుంది.

త్వరలో విడుదల కానున్న కొత్త సిట్రోయెన్ సి3 (Citroen C3) ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నింది ఉంటుంది. 'సిట్రోయెన్ సి3' (Citroen C3) అనేది భారతదేశంలో ఉత్పత్తి కానున్న మేడ్-ఇన్-ఇండియా ప్రోడక్ట్. భారతదేశంలో ఉత్పత్తి కానున్న సిట్రోయెన్ కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తి కూడా ఇదే. ఇది 2021 సెప్టెంబర్ నెలలో గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టబడింది. అయితే ఇప్పుడు భారతీయ రోడ్లపైన తిరగడానికి సిద్ధంగా ఉంది.

సిట్రోయెన్ సి3 అనేది లైవ్ మరియు ఫీల్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మొత్తం త్వరలోనే తెలుస్తుంది. సిట్రోయెన్ సి3 అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది డ్యూయల్ టోన్ రూఫ్ టాప్ కలిగి ఉందని తెలిసింది. సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీ ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.

Citroen C3 యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో మొత్తం 56 కస్టమైజేషన్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా దాదాపు 70 యాక్ససరీస్ ఆప్సన్ కూడా పొందవచ్చు. ఇది 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది, కావున ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు మిర్రర్ స్క్రీన్ ఫంక్షన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఈ ఎస్‌యూవీలో ఇవ్వనున్నారు. సి3 యొక్క ఇంటీరియర్‌లో రెండు కలర్ ఆప్షన్‌లు ఉంటాయి.

సిట్రోయెన్ సి3 కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 3,981 మిమీ, వెడల్పు 1,733 మిమీ, ఎత్తు 1,586 మిమీ మరియు వీల్‌బేస్ 2540 మిమీ వరకు ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది 180 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉండనున్నాయి. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. కానీ టర్బో పెట్రోల్ ఫీల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి వస్తుంది.

ఇందులోని 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ 81 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్‌తో గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. టర్బోచార్జ్డ్ వెర్షన్ యొక్క 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. కావున మొత్తం మీద ఈ లేటెస్ట్ SUV ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

సిట్రోయెన్ సి3 కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (CMP) పై నిర్మించబడుదుతోంది. ఈ డిజైన్ ప్లాట్‌ఫారమ్ భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మరింత సరసమైనదిగా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కావున దీని ధర కూడా కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ దీని ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ధర బహుశా రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఈ SUV ప్రొడక్షన్ తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు ప్లాంట్‌లో జరుగుతుంది.

సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీ భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ కంపెనీ యొక్క వెన్యూ, కియా కంపెనీ యొక్క సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్యువి300 వంటి సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లకు ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








