మరో 2-3 నెలల్లో భారత మార్కెట్లో సిట్రోయెన్ సి3 (Citroen C3) ఎస్‌యూవీ విడుదల; వివరాలు

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ (Citroen) భారత మార్కెట్‌పై భారీ ఆశలతో తమ సరికొత్త సి5 ఎయిర్‌క్రాస్ (C5 Aircross) ఎస్‌యూవీ ద్వారా ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసినదే. అయితే, ఈ మోడల్ యొక్క ప్రీమియం ధర కారణంగా, ఇది సాధారణ కస్టమర్లకు అందుబాటులోకి రాలేకపోయింది. ఈ నేపథ్యంలో, దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో సరసమైన ధరకే ఓ కారును ప్రవేశపెట్టాలని, తద్వారా భారత మార్కెట్ పై మంచి పట్టు సాధించాలని సిట్రోయెన్ లక్ష్యంగా పెట్టుకుంది.

మరో 2-3 నెలల్లో భారత మార్కెట్లో సిట్రోయెన్ సి3 (Citroen C3) ఎస్‌యూవీ విడుదల; వివరాలు

ఈ లక్ష్యం నుండి పుట్టుకొచ్చిన మోడలే సిట్రోయెన్ సి3 (Citroen C3). భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని, సిట్రోయెన్ తయారు చేసిన చిన్న మరియు సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇది. తాజాగా, సిట్రోయెన్ సి3 మోడల్‌ ఉత్పత్తిని కంపెనీ బ్రెజిల్‌లోని పోర్టో రియల్‌లో ప్రారంభించింది. ఈ కొత్త సి3 మోడల్ ను కంపెనీ గతేడాది (2021లో) ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ ఏడాది జూలై నాటికి ఇది భారతదేశంలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.

మరో 2-3 నెలల్లో భారత మార్కెట్లో సిట్రోయెన్ సి3 (Citroen C3) ఎస్‌యూవీ విడుదల; వివరాలు

కొత్త సిట్రోయెన్ సి3, ఈ బ్రాండ్ నుండి భారతదేశంలో వస్తున్న మొట్టమొదటి మాస్-మార్కెట్ మోడల్ అవుతుంది మరియు కంపెనీ దీని తయారీలో దాదాపు 90 శాతానికి పైగా స్థానికీకరించబడుతుంది (లోకలైజేషన్). స్థానికంగా భారతదేశంలోనే లభించే విడిభాగాలు మరియు పరికరాల సాయంతో ఈ కారును తయారు చేస్తున్న నేపథ్యంలో, దీని ధర కూడా చాలా అగ్రెసివ్ గా ఉంటుందని భావిస్తున్నారు. మరి ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరో 2-3 నెలల్లో భారత మార్కెట్లో సిట్రోయెన్ సి3 (Citroen C3) ఎస్‌యూవీ విడుదల; వివరాలు

సిట్రోయెన్ సి3 డిజైన్

బ్రెజిల్‌లో తయారవుతున్న సి3 మోడల్‌కి మరియు భారతదేశంలో విడుదల కాబోయే సి3 మోడల్‌కి చాలా దగ్గర పోలికలు ఉండనున్నాయి. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క ఫ్రంట్ ఫాసియాపై బ్రాండ్ యొక్క చెవ్రాన్ లోగోను క్రోమ్‌తో ఫినిష్ చేయబడి ఉండి, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ డిజైన్‌తో విలీనం చేయబడినట్లుగా ఉంటుంది. ఇందులోని హెడ్‌ల్యాంప్‌లు, డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు గ్రిల్ కలిసి ఫ్రంట్ డిజైన్‌కు X-ఆకారపు లుక్‌నిస్తాయి. ఫాగ్ ల్యాంప్స్ హౌసింగ్ లో మాత్రం కలర్ కోఆర్డినేటెడ్ యాక్సెంట్‌లు ఉంటాయి.

మరో 2-3 నెలల్లో భారత మార్కెట్లో సిట్రోయెన్ సి3 (Citroen C3) ఎస్‌యూవీ విడుదల; వివరాలు

సిట్రోయెన్ సి3 యొక్క డిజైన్ హైలైట్స్ ను గమనిస్తే, ఇందులో రెండు చివర్లలో స్కఫ్ ప్లేట్స్, సైడ్స్ లో ఎయిర్-పాకెట్ డిజైన్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, డ్యూయెల్-టోన్ రూఫ్, స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్, 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మొదలైనవి ఉన్నాయి. కొత్త సిట్రోయెన్ సి3 (Citroen C3) కారుని కస్టమర్లు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవడం కోసం కంపెనీ 78 విభిన్నమైన ఉపకరణాల (యాక్ససరీలను) కూడా అందిస్తోంది.

మరో 2-3 నెలల్లో భారత మార్కెట్లో సిట్రోయెన్ సి3 (Citroen C3) ఎస్‌యూవీ విడుదల; వివరాలు

ఈ కస్టమైజేషన్స్‌లో భాగంగా రూఫ్, బాడీ మరియు ఇంటీరియర్‌ల కోసం ప్రత్యేకమైన ఎక్స్‌టీరియర్ పెయింట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎక్స్టీరియర్ పెయింట్స్ విషయానికి వస్తే, ఇది ఐస్ వైట్, ప్లాటినియం గ్రే, ఆర్టెన్స్ గ్రే మరియు జెస్టీ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇంకా ఇది డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌తో కూడా అందించబడుతుంది, ఇందులో రెండు రూఫ్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. అవి: ఆర్టెన్స్ గ్రే మరియు జెస్టీ ఆరెంజ్. Citroen C3 ఈ ఏడాది (2022) మొదటి అర్ధ భాగంలో విడుదల కావచ్చని సమాచారం.

మరో 2-3 నెలల్లో భారత మార్కెట్లో సిట్రోయెన్ సి3 (Citroen C3) ఎస్‌యూవీ విడుదల; వివరాలు

సిట్రోయెన్ సి3 ఇంటీరియర్స్

సిట్రోయెన్ సి3 కాంపాక్ట్ ఎస్‌యూవీ దాని స్పోర్టీ ఎక్స్టీరియర్స్ మాదిరిగానే స్పోర్టీ ఇంటీరియర్స్ ను కూడా కలిగి ఉంటుంది. బయటి కలర్స్ మ్యాచ్ అయ్యే ఇంటీరియర్ యాక్సెంట్స్‌ను ఇందులో పొందవచ్చు. ఈ థీమ్డ్ ఇంటీరియర్ కారు డిజైన్‌కు మరింత ఫంకీ అప్పీల్‌ను అందిస్తుంది. ఈ ఎస్‌యూవీలో 1 లీటర్ గ్లోవ్ బాక్స్, ముందు మరియు వెనుక డోల్రపై 2 లీటర్ల డోర్ పాకెట్‌లు, సెంట్రల్ కన్సోల్‌లో స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, అలాగే వెనుక భాగంలో రెండు కప్ హోల్డర్‌లతో కూడిన రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

మరో 2-3 నెలల్లో భారత మార్కెట్లో సిట్రోయెన్ సి3 (Citroen C3) ఎస్‌యూవీ విడుదల; వివరాలు

అంతేకాకుండ్, ఇందులో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టెంపరేచర్ కంట్రోల్, ఫాస్ట్-ఛార్జింగ్ యూఎస్‌బి పోర్టులు,,

స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్, 315 లీటర్ల బూట్ స్పేస్ మరియు డ్రైవర్, కో-ప్యాసింజర్ కోసం స్మార్ట్‌ఫోన్ క్లాంప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

మరో 2-3 నెలల్లో భారత మార్కెట్లో సిట్రోయెన్ సి3 (Citroen C3) ఎస్‌యూవీ విడుదల; వివరాలు

సిట్రోయెన్ పేర్కొన్న సమాచారం ప్రకారం, సి3 వెనుక ప్రయాణీకులకు 653 మిమీ లెగ్‌రూమ్‌ను అందిస్తుంది, ఇది ఈ విభాగంలో అతిపెద్దదిగా ఉంటుంది. అదనంగా, ముందు ప్రయాణీకులు 1,418 మిమీ బెస్ట్ ఇన్ క్లాస్ ఎల్బో రూమ్ మరియు 991 మిమీ మార్కెట్-లీడింగ్ హెడ్‌రూమ్‌ను ఆనందిస్తుందని కంపెనీ తెలిపింది. భారతదేశంలో సిట్రోయెన్ సి3 విడుదలైనప్పుడు, ఇది విశాలమైన క్యాబిన్ మరియు స్టోరేజ్ స్పేస్‌తో ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత ఆచరణాత్మకమైన క్యాబిన్ కలిగిన ఎస్‌యూవీగా నిలుస్తుంది.

మరో 2-3 నెలల్లో భారత మార్కెట్లో సిట్రోయెన్ సి3 (Citroen C3) ఎస్‌యూవీ విడుదల; వివరాలు

సిట్రోయెన్ సి3 ఇంజన్ మరియు గేర్‌బాక్స్

భారతదేశంలో విడుదల కాబోయే కొత్త సిట్రోయెన్ సి3 ఇంజన్ స్పెసిఫికేషన్‌లను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లను ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. ఇక గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇందులో సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను స్టాండర్డ్ గా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

మరో 2-3 నెలల్లో భారత మార్కెట్లో సిట్రోయెన్ సి3 (Citroen C3) ఎస్‌యూవీ విడుదల; వివరాలు

సిట్రోయెన్ సి3 అంచనా ధర, పోటీ

ఇదివరకు చెప్పుకున్నట్లుగా, కొత్త సిట్రోయెన్ సి3 తయారీలో కంపెనీ దాదాపు 90 సాతం స్థానికీకరణను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా, దీని ధరను అందుబాటులో ఉంచాలని కంపెనీ చూస్తోంది. మరోవైపు, దేశంలో అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో సిట్రోయెన్ సి3 గట్టిగా నిలబడాలంటే, కంపెనీ దీనిని రూ. 6 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇక పోటీ విషయానికి వస్తే, సిట్రోయెన్ సి3 ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, రెనో కిగర్, నిస్సాన్ మాగ్నైట్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు పోటీగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 28, 2022, 9:26 [IST]
English summary
Citroen c3 india launch expected in july 2022 production begins in brazil details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+