క్యామోఫ్లేజ్ లేకుండా కెమెరాకు చిక్కిన సిట్రోయెన్ సి3 (Citroen C3).. త్వరలోనే విడుదల!

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ (Citroen) భారత మార్కెట్లో ఇప్పటికే సి5 ఎయిర్‌క్రాస్ (C5 Aircross) అనే ప్రీమియం ఎస్‌యూవీని విక్రయిస్తున్న సంగతి తెలిసిదనదే. కాగా, ఇప్పుడు ఈ బ్రాండ్ తమ రెండవ మోడల్ సిట్రోయెన్ సి3 (Citroen C3) కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా, ఈ మోడల్ భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా కెమెరాకు చిక్కింది. అయితే, ఈసారి ఈ టెస్టింగ్ మోడల్‌పై ఎలాంటి క్యామోఫ్లేజ్ లేదు. దీన్నిబట్టి చూస్తుంటే, సిట్రోయెన్ సి3 త్వరలోనే విడుదల కావచ్చని తెలుస్తోంది.

క్యామోఫ్లేజ్ లేకుండా కెమెరాకు చిక్కిన సిట్రోయెన్ సి3 (Citroen C3).. త్వరలోనే విడుదల!

కొత్త సిట్రోయెన్ సి3 స్పై చిత్రాలను గమనిస్తే, ఈ మోడల్ డ్యూయెల్ టోన్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంది. ఇది డార్క్ గ్రే కలర్ పెయింట్ స్కీమ్‌తో కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ రూఫ్‌ను కలిగి ఉంటుంది. భారతదేశంలో సిట్రోయెన్ సి3 ఈ కలర్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. ఈ సిట్రోయెన్ తమ 3సి కారును చాలా కాలంగా భారత రోడ్లపై పరీక్షిస్తోంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

క్యామోఫ్లేజ్ లేకుండా కెమెరాకు చిక్కిన సిట్రోయెన్ సి3 (Citroen C3).. త్వరలోనే విడుదల!

సి3 మోడల్‌ను విస్తృతమైన పరీక్షలకు గురిచేయడం ద్వారా, సిట్రోయెన్ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని 'మేడ్ ఇన్ ఇండియా ఫర్ ఇండియన్స్'గా అందించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది నెలల్లోనే ఇది భారతదేశంలో విడుదల కావచ్చని భావిస్తున్నారు. కొత్త సిట్రోయెన్ సి3, ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ నుండి వస్తున్న మొట్టమొదటి మాస్-మార్కెట్ మోడల్ అవుతుంది మరియు కంపెనీ దీని తయారీలో దాదాపు 90 శాతానికి పైగా స్థానికీకరించబడుతుంది (లోకలైజేషన్). ఫలితంగా, దీని ధర కూడా చాలా అగ్రెసివ్ గా ఉంటుందని సమాచారం.

క్యామోఫ్లేజ్ లేకుండా కెమెరాకు చిక్కిన సిట్రోయెన్ సి3 (Citroen C3).. త్వరలోనే విడుదల!

సిట్రోయెన్ సి3 మోడల్‌ను కంపెనీ యొక్క కాంపాక్ట్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (సిఎమ్‌పి) పై తయారు చేయనున్నారు. ఇందులో ముందు వైపు లోగోను క్రోమ్‌తో ఫినిష్ చేయబడి ఉండి, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ డిజైన్‌తో విలీనం చేయబడినట్లుగా ఉంటుంది. ఇందులోని హెడ్‌ల్యాంప్‌లు, డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు గ్రిల్ కలిసి ఫ్రంట్ డిజైన్‌కు X-ఆకారపు లుక్‌నిస్తాయి. ఫాగ్ ల్యాంప్స్ హౌసింగ్ లో మాత్రం కలర్ కోఆర్డినేటెడ్ యాక్సెంట్‌లు ఉంటాయి. అలాగే, ఇరువైపులా స్కఫ్ ప్లేట్స్, సైడ్స్ లో ఎయిర్-పాకెట్ డిజైన్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, డ్యూయెల్-టోన్ రూఫ్, స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్, 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మొదలైనవి ఉన్నాయి.

క్యామోఫ్లేజ్ లేకుండా కెమెరాకు చిక్కిన సిట్రోయెన్ సి3 (Citroen C3).. త్వరలోనే విడుదల!

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, సిట్రోయెన్ సి3 కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క స్పోర్టీ ఎక్స్టీరియర్‌కు తగినట్లుగానే, కంపెనీ దాని ఇంటీరియర్‌ను కూడా బయటి కలర్స్ మ్యాచ్ అయ్యే స్పోర్టీ థీమ్‌తో అందించే అవకాశం ఉంది. ఈ థీమ్డ్ ఇంటీరియర్ కారు ఇంటీరియర్ డిజైన్‌కు మరింత ఫంకీ అప్పీల్‌ను అందిస్తుంది. ఈ ఎస్‌యూవీలో 1 లీటర్ గ్లోవ్ బాక్స్, ముందు మరియు వెనుక డోల్రపై 2 లీటర్ల డోర్ పాకెట్‌లు, సెంట్రల్ కన్సోల్‌లో స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, అలాగే వెనుక భాగంలో రెండు కప్ హోల్డర్‌లతో కూడిన రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

క్యామోఫ్లేజ్ లేకుండా కెమెరాకు చిక్కిన సిట్రోయెన్ సి3 (Citroen C3).. త్వరలోనే విడుదల!

అలాగే, ఇందులో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టెంపరేచర్ కంట్రోల్, ఫాస్ట్-ఛార్జింగ్ యూఎస్‌బి పోర్టులు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్, 315 లీటర్ల బూట్ స్పేస్ మరియు డ్రైవర్, కో-ప్యాసింజర్ కోసం స్మార్ట్‌ఫోన్ క్లాంప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సిట్రోయెన్ పేర్కొన్న సమాచారం ప్రకారం, సి3 వెనుక ప్రయాణీకులకు 653 మిమీ లెగ్‌రూమ్‌ను అందిస్తుంది, ఇది ఈ విభాగంలో అతిపెద్దదిగా ఉంటుంది.

క్యామోఫ్లేజ్ లేకుండా కెమెరాకు చిక్కిన సిట్రోయెన్ సి3 (Citroen C3).. త్వరలోనే విడుదల!

భారతదేశంలో సిట్రోయెన్ సి3 విడుదలైనప్పుడు, ఇది విశాలమైన క్యాబిన్ మరియు స్టోరేజ్ స్పేస్‌తో ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత ఆచరణాత్మకమైన క్యాబిన్ కలిగిన ఎస్‌యూవీగా నిలుస్తుంది. భారతదేశంలో విడుదల కాబోయే కొత్త సిట్రోయెన్ సి3 ఇంజన్ స్పెసిఫికేషన్‌లను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లను ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. ఇందులో సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను స్టాండర్డ్ గా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

క్యామోఫ్లేజ్ లేకుండా కెమెరాకు చిక్కిన సిట్రోయెన్ సి3 (Citroen C3).. త్వరలోనే విడుదల!

కొత్త సిట్రోయెన్ సి3 తయారీలో కంపెనీ ఎక్కువ భాగం స్థానికీకరణను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి, సిట్రోయెన్ తమ సి5 ఎయిర్‌క్రాస్ మాదిరిగా కాకుండా, సి3 మోడల్‌ను చాలా సరసమైన ధరకే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాసం ఉంది. ప్రస్తుతం, దేశంలో అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో సిట్రోయెన్ సి3 ఈ పోటీని తట్టుకుని నిలబడాలంటే, కంపెనీ దీనిని రూ. 6 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే, ఇంకొన్ని నెలలు ఓపిక పట్టాలి.

More from DriveSpark

Article Published On: Saturday, April 23, 2022, 16:25 [IST]
English summary
Citroen c3 spotted testing without camouflage exclusive spy pics from drivespark
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+