స్పాట్ టెస్ట్‌లో కనిపించిన 2022 Citroen C3.. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) భారతీయ మార్కెట్లో ఇప్పటికే 'సిట్రోయెన్ సి5' విడుదల చేసింది. ఈ SUV అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందగలిగింది. అయితే కంపెనీ ఇప్పుడు దేశీయ మార్కెట్ కోసం '2022 సిట్రోయెన్ సి3' ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ SUV స్పాట్ టెస్ట్ లో కనిపించింది. అయితే ఇప్పుడు మరో సారి ఆంధ్రప్రదేశ్ లో స్పాట్ టెస్ట్ చేస్తూ కెమెరాకు చిక్కింది.

సిట్రోయెన్ నుంచి రానున్న ఈ కొత్త సబ్-4మీ SUV త్వరలోనే దేశీయ విఫణిలోకి అడుగుపెట్టనుంది. ఈ SUV భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా XUV300 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇప్పటికే మార్కెట్లో విక్రయిచబడుతున్న సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ SUV దిగువన త్వరలో రానున్న ఈ కొత్త 2022 సిట్రోయెన్ సి3 SUV ఉంటుంది. సిట్రోయెన్ సి3 SUV ని కంపెనీ 'మేడ్ ఇన్ ఇండియా ఫర్ ఇండియన్స్'గా అభివర్ణించింది. కావున ఇది భారతదేశంలోనే ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.

నివేదికల ప్రకారం, సిట్రోయెన్ సి3 SUV కొనుగోలుదారులకు అందుబాటు ధరలో తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఉత్పత్తి ఖర్చులను తగ్గించడానికి ఫ్రెంచ్ కార్ తయారీదారు యొక్క కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (CMP)ని ఉపయోగిస్తుంది. కావున ఇది తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది.

భారతదేశంలోని కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లో బలమైన ప్రత్యర్థులు ఉండటం వల్ల రానున్న ఈ సి3 SUV గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ఇది మిగిలిన ప్రత్యర్థులకంటే కూడా చాలా ప్రత్యేకంగా మరియు కొంత భిన్నంగా ఉండాలి. కావున ఈ సిట్రోయెన్ సి3 SUV 78 విభిన్న యాక్ససరీస్ తో మరియు అనేకరకాల కస్టమైజేషన్ ఆప్సన్స్ తో రానుంది.

అది మాత్రమే కాకుండా.. ఈ సబ్-4మీ SUV 4 విభిన్న ఎక్స్టీరియర్ కలర్ ఆప్సన్స్ పొందటమే కాకుండా, రెండు వేర్వేరు రూఫ్ కలర్ ఆప్షన్‌లతో అందుబాటులోకి వస్తుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కావున చూపరులను ఒక్క సారికే కట్టిపడేస్తుంది.

ఇందులోని ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు నావిగేషన్ వంటి విభిన్న ఫీచర్స్ అందిస్తుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు డ్రైవింగ్ సమయంలో ఎంతగానో అనుకూలంగా ఉంటాయి.

ఇప్పటికే అందుబటులో ఉన్న సమాచారం ప్రకారం.. 2022 సిట్రోయెన్ సి3 SUV ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌తో రావచ్చు, ఇది ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌తో వచ్చిన భారతదేశపు మొదటి SUV అవుతుంది. ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్ పెట్రోలు మరియు ఇథనాల్ ఆధారిత ఇంధనం రెండింటిలోనూ పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఇందులోని ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్ 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్, ఇది 130 బిహెచ్‌పి పవర్గ ఉత్పత్తి చేయగలదు. అయితే, ఈ ఇంజన్ మరింత ఇంధన సామర్థ్యం అందించడం కోసం కంపెనీ అనుకూలంగా ట్యూన్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, కంపెనీ మొత్తం ఉత్పత్తి ఖర్చులను తగ్గించడానికి వారి ప్రస్తుత 1.6-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ ఇంజన్ ఆధారంగా 1.5-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందించే అవకాశం ఉంటుంది.

'2022 సిట్రోయెన్ సి3' అనేది భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కంపెనీ యొక్క రెండవ ఉత్పత్తి. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండనుంది. అంతే కాకూండా దీని ధర కూడా కస్టమర్లు ఆశించిన స్థాయిలోనే ఉంటుంది, కావున మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








