Just In
- 15 hrs ago
కార్తిక్ ఆర్యన్: ఖరీదైన గిఫ్ట్ పొందాడు.. భారదేశంలోనే ఫస్ట్ ఓనర్ అయిపోయాడు
- 16 hrs ago
'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే
- 19 hrs ago
ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!
- 21 hrs ago
రైడింగ్‌కి మీరు సిద్దమేనా.. మార్కెట్లో కొత్త 'కవాసకి నింజా 400' విడుదలైంది: వివరాలు
Don't Miss
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ 26 నుండి జులై 2వ తేదీ వరకు..
- News
Atmakur Bypoll Results 2022:మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు లాంఛనమేనా..?
- Sports
Eng vs Nz 3rd Test: ఆట ఇప్పుడే మొదలైంది.. డారిల్ మిచెల్ వర్సెస్ ఇంగ్లాండ్ షురూ..!
- Movies
ట్రెండింగ్: బండ్ల గణేష్ దృష్టిలో ఛార్మీ వ్యాంపా? రెండో పెళ్లికి సిద్దమైన ప్రముఖ నటి.. రష్మీపై సుధీర్ అలా..
- Finance
IT Jobs: భారత IT ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. కంపెనీలు చేస్తున్న ఆ పనితో ఇక కష్టమే..
- Technology
ఆండ్రాయిడ్ & ఆపిల్ ఫోన్లను హ్యాక్ చేసే కొత్త Spyware ! జాగ్రత్త...హెచ్చరించిన గూగుల్
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
కాలుష్యం విషయంలో ఆధునిక కార్లు, ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే పురాతన కార్లే చాలా బెస్ట్: రిపోర్ట్
భారత ఆటోమొబైల్ మార్కెట్ చాలా వైవిధ్యమైనది. ప్రస్తుతం మనదేశం ప్రపంచంలోని అతిపెద్ద కార్ మార్కెట్లలో ఒకటిగా ఉంది. భారతదేశ రోడ్లపై చాలా ఏళ్ల క్రితమే కార్లు తిరగడం ప్రారంభించాయి. ఆనాటి కార్లు చాలా అద్బుతమైనవి మరియు ఇప్పటికీ కొంతమంది కార్ కలెక్టర్ల వద్ద అలనాటి క్లాసిక్ కార్లు చాలా అందమైన స్థితిలో ఉన్నాయి. మారుతున్న కాలంతో పాటే కార్లు రూపాలు మారాయి మరియు వాటిలో ఉపయోగించే ఇంజన్లు అలాగే అవి విడుదల చేసే ఉద్ఘారస్థాయిలు అన్నీ మారాయి.

సాధారణంగా పాత కార్లు నేటి ఆధునిక కార్లతో పోలిస్తే చాలా ఎక్కువ కాలుష్య ఉద్ఘారాలను విడుదల చేస్తాయని చాలా మంది భావించవచ్చు. కానీ, అది పూర్తిగా అవాస్తవమని నేటి ఆధునిక కార్లు మరియు ఆధునిక ఎలక్ట్రిక్ కార్ల కంటే కూడా ఆనాటిక క్లాసిక్ కార్లే పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తాయని ఇటీవలి అధ్యయనం మరియు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాత కార్ల ఉద్ఘారాల విషయంలో ఉన్న చాలా మంది అపోహలను ఈ నివేదికలు తొలగించనున్నాయి.

బిఎస్6 వంటి తాజాగా ఉద్ఘారాల నేపథ్యంలో, క్లాసిక్ కార్ యజమానులు తమ పాత కార్లను కేవలం గ్యారాజ్‌లకు మాత్రమే పరిమితం చేశారు. వాటిని బయటకుతీస్తే ఎక్కడ పర్యావరణానికి హాని జరుగుతుందో లేక ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తారో అనే ఉద్దేశ్యంతో సదరు క్లాసిక్ కార్ల యజమానులు తమ పురాతన కార్లను కేవలం షో పీస్‌లుగా మాత్రమే ఉంచుకుంటున్నారు. అయితే, ఈ తాజా అధ్యయనం క్లాసిక్ కార్ల యజమానులు మరియు ఔత్సాహికులను ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది.

ప్రజలలో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన ప్రతి రోజు కొత్త ఎత్తులకు చేరుకుంటోంది. ఫలితంగా, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో, పాత కార్లు ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. క్లాసిక్ కార్ల యజమానులు తమ పాత కార్లను ఎంతో శ్రమతో చక్కగా మెయింటైన్ చేస్తునప్పటికీ, చాలామంది ఈ పాత కార్లను కాలుష్యం కారణంగా నిందిస్తూనే ఉన్నారు.

భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో అనేక క్లాసిక్ కార్లు ఇప్పటికీ చాలా స్వచ్ఛమైన స్థితిలో ఉన్నాయి మరియు వాటి యజమానులు అలాంటి పురాతన ఐకానిక్ క్లాసిక్ కార్లను నేటి ఆధునికత కోసం వదిలిపెట్డానికి ఇష్టపడరు. ఈ నేపథ్యంలో, క్లాసిక్ కార్ల యజమానులు ఈ కార్లను ఎప్పటికీ తమతోనే ఉంచడానికి కాలుష్యం విషయంలో ఇటీవలి అధ్యయనాలు మరింత ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నాయి. నేటి కార్లతో పోలిస్తే అవి అంత ఎక్కువ కాలుష్యాన్ని కలిగించవని తాజా అధ్యయనాలు నిరూపించాయి.

సాధారణంగా అప్పటి టెక్నాలజీతో తయారైన పాతకాలపు ఇంజన్‌లు ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి మరియు వాటిని ఎవరూ మార్చలేరు. అయితే, నేటి ఆధునిక కార్లతో పోలిస్తే, ఇలాంటి క్లాసిక్ కార్లు రోడ్లపై చాలా తక్కువగా ఉపయోగించబడుతున్నాయి. అంటే, ఇవి రోజువారీగా ఉపయోగించే ఆధునిక కారు విడుదల చేసే కాలుష్య ఉద్ఘారాల కంటే తక్కువగానే ఉంటుందని అర్థం.

మరోవైపు, ఎలక్ట్రిక్ కార్లు ఎలాంటి కాలుష్య ఉద్గారాలను ఉత్పత్తి చేయనప్పటికీ, దాని శక్తి (ఎనర్జీ) యొక్క మూలం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు, భారతదేశం బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుండి ఎక్కువ విద్యుత్ తయారవుతుంది. అంటే, కారును చార్జ్ చేసేందుకు విద్యుత్ కావాలంటే, విద్యుత్ పరిశ్రమ దానికోసం బొగ్గును మండించాల్సి ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే, రోజువారీగా ఉపయోగించే ఎలక్ట్రిక్ కారు కూడా అప్పుడప్పుడు ఉపయోగించే పాత క్లాసిక్ కారు కంటే కొంచెం ఎక్కువ కాలుష్యాన్నే కలిగిస్తుందని చెప్పొచ్చు.

ఈ తాజా పరిశోధనలు ఇప్పుడు క్లాసిక్ కార్ క్లబ్‌లు మరియు పాతకాలపు కార్ల యజమానులు పర్యావరణాన్ని కలుషితం చేయడం గురించి పెద్దగా ఆలోచించకుండా ఇలాంటి విలువైన వాహనాలను తమ స్వాధీనంలోనే ఉంచుకోవడానికి ఓ బలమైన సందర్భాన్ని అందించాయి. అయితే, దురదృష్టవశాత్తు పాత కార్ల వినియోగాన్ని నిరోధించే లేదా పరిమితం చేసే అనేక చట్టాలు ఇప్పటికే వివిధ దేశాల్లో అమలులో ఉన్నాయి. కాబట్టి, అలాంటి ప్రాంతాలలో ఇవి కేవలం మ్యూజియంలో బొమ్మలుగా మిగిలాల్సిందే.

ఎలక్ట్రిక్ వాహనాలు తమ బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి ఉపయోగించే విద్యుత్ పునరుత్పాదక మూలాల నుండి గ్రహించినంత వరకు అవి అద్భుతమైనవే. అయితే, ఎప్పుడైతే ఇలాంటి ఎలక్ట్రిక్ కార్లు చార్జింగ్ కోసం డీజిల్ జనరేటర్లు లేదా పర్యావరణానికి హనికలిగించి తయారు చేయబడే విద్యుత్‌శక్తితో చార్జ్ అవుతాయో అలాంటి సందర్భాల్లో ఇవి పర్యావరణ సాన్నిహిత్యమైనవిగా పరిగణించబడవు.

ఇక క్లాసిక్ కార్లంటే ఇష్టపడే వారు చాలా అరుదుగా ఉంటారు. అవి తక్కువ ఫీచర్లు మరియు భద్రతను కలిగి ఉన్నప్పటికీ, వాటితో తమకున్న అనుబంధం కారణంగా అలాంటి కార్లను వదులుకోలేరు. వాటి మెయింటినెన్స్ కాస్ట్ ఎక్కువగా ఉన్నా లేదా వాటిపై విధించే పన్నులు ఎక్కువగా ఉన్నా వాటిని తమతోనే ఉంచుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు. కాబట్టి, తాజా అధ్యయనం యొక్క ఫలితాలు అటువంటి ఔత్సాహికులకు ఈ విషయం లో మరింత ఉపశమనం కలిగించేలా ఉన్నాయి.