సిట్రోయెన్ సి3 vs టాటా పంచ్ vs నిస్సాన్ మాగ్నైట్ : కంపారిజన్

ఫ్రెంచ్ కార్ కంపెనీ 'సిట్రోయెన్' (Citroen) భారత మార్కెట్లో తమ మొట్టమొదటి సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సిట్రోయెన్ సి3 (Citroen C3) ని జులై 20, 2022వ తేదీన అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. సిట్రోయెన్‌కు ఇది భారత మార్కెట్లో ఇది రెండవ మోడల్. ఈ బ్రాండ్ ఇప్పటికే సిట్రోయెన్ సి5 (Citroen C5) అనే ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. అయితే, అధిక ధర కారణంగా ఈ ప్రీమియం ఎస్‌యూవీ మార్కెట్లో అంతగా రాణించలేకపోతోంది.

సిట్రోయెన్ సి3 vs టాటా పంచ్ vs నిస్సాన్ మాగ్నైట్ : కంపారిజన్

ఈ నేపథ్యంలో, సిట్రోయెన్ తమ సి3 ఎస్‌యూవీని అగ్రెసివ్ ధరతో మార్కెట్లో విడుదల చేసి ఈ విభాగంలో ఇప్పటికే రాజ్యమేలుతున్న ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వాలని కంపెనీ చూస్తోంది. ఇందుకోసం కంపెనీ ఈ కారును పూర్తిగా భారతదేశంలోనే ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకుంది. ఇలా చేయడం వలన కంపెనీ ఈ కారు ధరను మార్కెట్లో ఇతర మోడళ్లకు పోటీగా నిర్ణయించే అవకాశం ఉంటుంది.

సిట్రోయెన్ సి3 vs టాటా పంచ్ vs నిస్సాన్ మాగ్నైట్ : కంపారిజన్

కొత్త సిట్రోయెన్ సి3 ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో అందుబాటులోకి రానుంది. సిట్రోయెన్ ఈ మేడ్-ఇన్-ఇండియా ప్రోడక్ట్ ని భారతదేశంలోనే కాకుండా ఇతర గ్లోబల్ మార్కెట్ లలో కూడా విక్రయించనుంది. భారతదేశంలో ప్రస్తుతం టాటా పంచ్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. మరి కొత్తగా రాబోయే సిట్రోయెన్ సి3 ఈ రెండు మోడళ్లతో ఎలా పోటీ పడుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

సిట్రోయెన్ సి3 vs టాటా పంచ్ vs నిస్సాన్ మాగ్నైట్ : కంపారిజన్

ముందుగా ఈ మూడు ఎస్‌యూవీల పరిమాణాల గురించి తెలుసుకుందాం రండి. సిట్రోయెన్ సి3 పొడవు 3981 మిమీ, వెడల్పు 1733 మిమీ, ఎత్తు 1586 మిమీ మరియు వీల్‌బేస్ 2540 మిమీగా ఉంటుంది. ఇందులో 30 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది.

సిట్రోయెన్ సి3 vs టాటా పంచ్ vs నిస్సాన్ మాగ్నైట్ : కంపారిజన్

టాటా పంచ్ విషయానికి వస్తే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పొడవు 3827 మిమీ, వెడల్పు 1742 మిమీ, ఎత్తు 1615 మిమీ, వీల్ బేస్ 2445 మిమీ మరియు దీని ఇంధన సామర్థ్యం 37 లీటర్లుగా ఉంటుంది. కాగా, నిస్సాన్ మాగ్నైట్ పొడవు 3994 మిమీ, వెడల్పు 1758 మిమీ, ఎత్తు 1572 మిమీ, వీల్ బేస్ 2500 మిమీ మరియు ఇంధన ట్యాంక్ సామర్థ్యం 40 లీటర్లుగా ఉంటుంది. ఈ మూడు మోడళ్లలో నిస్సాన్ మాగ్నైట్ కాస్తంత విశాలంగా అనిపిస్తుంది.

సిట్రోయెన్ సి3 vs టాటా పంచ్ vs నిస్సాన్ మాగ్నైట్ : కంపారిజన్

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, సిట్రోయెన్ సి3 కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. ఇందులోని 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ 81 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్‌తో గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. కాగా, టర్బోచార్జ్డ్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. ఈ రెండు ఇంజన్లు వరుసగా 19.8 కెఎంపిఎల్ మరియు 19.4 కెఎంపిఎల్ మైలేజీని అందిస్తాయి.

సిట్రోయెన్ సి3 vs టాటా పంచ్ vs నిస్సాన్ మాగ్నైట్ : కంపారిజన్

కాగా, టాటా పంచ్ మాత్రం ఒకే ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి పవర్ ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది. కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది లీటరుకు 18.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

సిట్రోయెన్ సి3 vs టాటా పంచ్ vs నిస్సాన్ మాగ్నైట్ : కంపారిజన్

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.0 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి శక్తిని మరియు 96 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, టర్బో పెట్రోల్ ఇంజన్ 100 బిహెచ్‌పి శక్తిని మరియు 152 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ రెండు ఇంజన్లు వరుసగా లీటరుకు 18.75 కిమీ మరియు 17.7 కిమీ మైలేజీని అందిస్తాయి.

సిట్రోయెన్ సి3 vs టాటా పంచ్ vs నిస్సాన్ మాగ్నైట్ : కంపారిజన్

ఇంజన్ ఆప్షన్స్ పరంగా చూస్తే, కొత్తగా రాబోయే సిట్రోయెన్ సి3 శక్తివంతమైన మరియు ఇంధన సమర్థమైన ఇంజన్లను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. సిట్రోయెన్ సి3 గతేడాది సెప్టెంబర్ నెలలో గ్లోబల్ మార్కెట్‌లలో ప్రవేశపెట్టబడింది. కంపెనీ దీనిని కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌ (CMF)పై ఆధారపడి తయారైంది మరియు కంపెనీ దీని తయారీలో 90 శాతం వరకు స్థానికీకరణను సాధించింది. భారత మార్కెట్లో Citroen C3 లైవ్ మరియు ఫీల్ అనే రెండు వేరియంట్‌లలో విడుదల చేయనున్నారు. ఈ ఎస్‌యూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Article Published On: Saturday, June 11, 2022, 13:49 [IST]
English summary
Comparison between citroen c3 tata punch and nissan magnite
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+