ప్రమాదంలో నుజ్జు నుజ్జయిన కారు.. 'రిషబ్ పంత్' కి తీవ్ర గాయాలు

ఇండియన్ క్రికెట్‌ టీమ్‌లో స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ అయిన రిషబ్ పంత్‌ ఈ రోజు ఉదయం (శుక్రవారం) ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‌ ఎక్కువ గాయాలు పాలు కాగా, తన కారు పూర్తిగా కాలిపోయి నుజ్జు నుజ్జు అయినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రిషబ్ పంత్‌ ఈ రోజు ఉదయం 5:30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో హమ్మద్‌పూర్ ఝల్ సమీపంలోని రూర్కీలోని నర్సన్ సరిహద్దులో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు డివైడర్ ని డీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఎక్కువగా మంటలు వ్యాపించాయి, అతి కష్టం మీద రిషబ్ పంత్‌ బయటపడ్డాడు, కానీ అతనికి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలయ్యాయి.

ప్రమాదంలో నుజ్జు నుజ్జయిన కారు.. రిషబ్ పంత్ కి గాయాలు

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్‌ను ఢిల్లీ రోడ్డులోని సక్షమ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు అందించిన సమాచారం ప్రకారం, రిషబ్ పంత్ తమ మీద, కాలికి, వీపు భాగంలో గాయాలైనట్లు తెలిసింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ దేహత్ స్వప్న కిషోర్ సింగ్ సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

రిషబ్ పంత్‌ తన మెర్సిడెస్‌ కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పంత్‌ కారు విండో పగులగొట్టి కష్టం మీద బయటకు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే రిషబ్ పంత్‌ వీపు భాగానికి మంటలు అంటుకున్నట్లు ఆయనకు చికిత్స చేసిన డాక్టర్లు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదంలో నుజ్జు నుజ్జయిన కారు.. రిషబ్ పంత్ కి గాయాలు

రిషబ్ పంత్‌ మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదానికి గురి కావడానికి సరైన కారణం తెలియదు, బహుశా ఉదయం కావున పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన సరైన వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉంది. ప్రమాదంలో చాలా కష్టం మీద రిషబ్ పంత్ బయటపడగలిగాడు, అంతే కాకుండా సమయానికి హాస్పిటల్ లో చేరడం వల్ల ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.

ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి. ఈ ఫోటోలలో గమనించినట్లతే కారు పూర్తిగా కాలిపోయి ఉండటం చూడవచ్చు. అంతే కాకుండా కారు ముందు భాగం కూడా చాలా వరకు నుజ్జు నుజ్జు అయినట్లు కూడా చూడవచ్చు. వీటిని బట్టి ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగింది అనే దానిని అంచనా వేయవచ్చు. అయితే ఇంత ప్రమాదం జరిగినప్పటికీ రిషబ్ పంత్ ప్రాణాలతో బయటపడగలిగాడు.

దిహిళ ఉండగా రిషబ్ పంత్ ఇటీవల ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఆడాడు. అయితే ఇక త్వరలో జరగబోయే శ్రీలంక టీ20 సిరీస్‌కు పంత్‌ను ఎంపిక కాలేదు. ఇటీవల జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి దుబాయ్‌లో సెలబ్రేట్‌ చేసుకున్నారు. భారత్ తరఫున పంత్ వరుసగా 33 టెస్టులు, 30 వన్డేలు, 66 టీ20లు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 98 IPL మ్యాచ్‌లు ఆడాడు, అతను కెప్టెన్‌గా 2838 పరుగులు చేశాడు.

ప్రస్తుతం కాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు, ఇవన్నీ పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, December 30, 2022, 10:58 [IST]
English summary
Cricketer rishabh pant car accident details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+